Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
ఈ ఆకులను తెచ్చి మీ ఇంట్లో పెట్టుకోండి.. ఎందుకంటే!
ప్రస్తుత కాలంలో అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు చాలామంది చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయితే.. మన ఆరోగ్యాన్ని రక్షించుకునేందుకు జామకాయ దివ్య ఔషధంలా పని చేస్తుంది. ఇందులో ఉండే పోషకాలు, విటమిన్స్ మనల్ని అనేక రోగాల బారిన పడకుండా రక్షిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
అయితే కేవలం జామకాయ మాత్రమే కాదు, జామ ఆకులు కూడా అనేక రోగాల నివారిణిగా పని చేస్తాయని ఆయుర్వేద పండితులు చెబుతున్నారు. ఇందులో అనేక రకాల పోషకాలు లభిస్తాయని, ఇవి మనల్ని ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడతాయని చెబుతున్నారు. రోగాల బారిన కూడా పడకుండా రక్షిస్తాయని పేర్కొంటున్నారు. అయితే జామ ఆకును ఎలా తినాలి, దీంతో ఏ విధమైన లాభాలు ఉన్నాయనేది ఇప్పుడు తెలుసుకుందాం.

రక్తంలో షుగర్ నియంత్రిస్తుంది:
జామ ఆకులు రక్తంలో షుగర్ లెవెల్స్ ఎక్కువగా అవ్వకుండా నియంత్రిస్తాయి. ఇందులో ఉండే పోషకాలు షుగర్ లెవల్ పెరగకుండా చేయడంతో పాటు.. ఆహరం నుంచి కార్బోహైడ్రేట్ శోషణను నియంత్రించడంలో సహాయపడుతుంది. డైయాబెటిక్ రోగులు దీనిని తీసుకుంటే మంచి ఫలితాలు పొందొచ్చు.
చర్మం, జుట్టు ఆరోగ్యానికి..
జామ ఆకులో జామకాయలో ఉన్నట్లే విటమిన్ సీ, యాంటి ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ ఆకులను డికాషన్ చేసుకొని తాగితే, చర్మం, జుట్టు సమస్యలు దూరం అవుతాయి. అందులో ఉండే వీటినిస్ సీ రోగ నిరోధక శక్తి పెరగడానికి కూడా సహాయపడతాయి. దీనిని తీసుకోవడం వల్ల జుట్టు బలంగా మారడంతో పాటు చర్మం కాంతివంతంగా తయారవుతుంది.
గుండె జబ్బు నివారణలో..
జామ ఆకులను నీటిలో వేసి బాగా వేడి చేసుకున్నాక అందులోని రసాన్ని తాగితే చక్కటి ఫలితాలు పొందొచ్చు. ఈ రసం చేడు కొలెస్ట్రాల్‌ను కరిగిస్తుంది, అలాగే మంచి కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతుంది. దీని కారణంగా గుండె జబ్బులు రాకుండా నియంత్రించుకోవచ్చు.
ఇమ్యూనిటీ బూస్టర్:
శరీరంలో రోగ నిరోధక శక్తి పెరగాలంటే జామకాయ తినాలని పెద్దలు అంటూ ఉంటారు. అయితే జామ ఆకులు కూడా మంచి ఇమ్యూనిటీ బూస్టర్లుగా పని చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో అధిక మొత్తంలో విటమిన్ సీ ఉంటుందని, ఇది బలహీనమైన రోగ నిరోధక శక్తిని మెరుగుపరిచి, ఇమ్యూనిటీని పెంచుతుందని చెబుతున్నారు.
జీర్ణ సమస్యలు దూరం:
జామ ఆకుల్లో ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇది జీర్ణక్రియ సాఫీగా, వేగవంతంగా జరిగేందుకు ఉపయోగపడుతుంది. ఎవరైతే జీర్ణ సంబంధిత సమస్యలతో బాధ పడతారో వారు జామ ఆకుల కాసాయాన్ని తాగితే మంచి ఫలితాలు పొందొచ్చని నిపుణులు చెబుతున్నారు. కడుపు ఉబ్బరం, అజీర్ణం, అసిడిటీ, విరేచనాలు వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందొచ్చని తెలిపారు.
జామ ఆకుల డికాషన్ ఎలా చేసుకోవాలంటే..
ముందుగా ఒక గిన్నెలో గ్లాసు నీళ్లు తీసుకోవాలి. అలాగే కొన్ని ఆకులను అందులో వేసి బాగా మరిగించుకోవాలి. అనంతరం ఆకుల నుంచి రసం ఊరి ఆ నీళ్లలో కలిశాక.. అందులోంచి ఆకులను తీసేసి, నీటిని వడగట్టుకొని ఒక గ్లాసులో తీసుకుంటే డికాషన్ సిద్ధమైనట్లే.
గమనిక: జామ ఆకుల గురించి మేము పొందుపరిచిన అంశాలన్నీ ఇంటర్నెట్‌లో మాకు దొరికిన సమాచారం ఆధారంగా అందించబడింది. వీటిని పాటించే ముందు తప్పనిసరిగా నిపుణులు లేదా డైటీషియన్ల సలహాలు తీసుకోవాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications