Latest Updates
-
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.!
Weight Loss Tips: బరువు తగ్గాలనుకుంటున్నారా? ఈ తప్పులు అస్సలే చేయవద్దు
బరువు తగ్గడం అనుకున్నంత సులభమేం కాదు. అలా అని చాలా కష్టం, అసాధ్యం కూడా కాదు. సరైన విధానం, ప్లాన్, క్రమశిక్షణ, సక్రమమైన జీవనశైలితో బరువు తగ్గొచ్చు. బరువు తగ్గాలని, బెల్లీ ఫ్యాట్ కరిగించాలని, ఐడియల్ వెయిట్ మెయింటైన్ చేయాలని చాలా మంది కోరుకుంటారు. కొందరు బరువు తగ్గడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ కొన్ని చిన్న చిన్న పొరపాట్ల వల్ల వాళ్లు పడే శ్రమ బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది.
బరువు తగ్గాలనుకునే వారు, అందుకోసం కష్టపడే వారు చాలా మంది చేసే పొరపాట్లు కొన్ని ఉన్నాయి. వాటి వల్ల వారు లక్ష్యం చేరుకోలేరు. ఆ పొరపాట్లు ఏమిటో వాటిని ఎలా నివారించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

1. భోజనం స్కిప్ చేయడం:
భోజనాన్ని స్కిప్ చేయడం వల్ల బరువు తగ్గొచ్చని చాలా మంది భ్రమపడుతుంటారు. సరైన సమయానికి ఆహారం తింటేనే జీవక్రియ సక్రమంగా ఉంటుంది. లేకపోతే జీవక్రియ అస్తవ్యస్తమై బరువు తగ్గడం కష్టమవుతుంది. భోజనం దాటవేయడం వల్ల ఆకలి వేస్తుంటుంది. దీని వల్ల తర్వాత భోజనంలో అతిగా తినే అవకాశం ఉంది.
2. తక్కువ కొవ్వు, డైట్ లపై అతిగా ఆధారపడటం:
చాలా మంది తక్కువ కొవ్వు ఉన్న ఆహార పదార్థాలు, డైట్ ఫుడ్స్ బరువు తగ్గడానికి మంచి మార్గం అనుకుంటారు. అయితే ఇది అన్ని సార్లు, ప్రతి ఒక్కరికీ సరిపోదు. పూర్తిగా కొవ్వు తీసుకోవడాన్ని తగ్గించడం వల్ల ఇతర సమస్యలు వస్తాయి. దానికి బదులు సహజంగా కొవ్వు లభించే ఆహారాలు తినాలి.
3. నిద్రలేమి:
నిద్రలేమి అనేక ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడుతుంది. నిద్రలేమి వల్ల కార్టిసాల్ అనే హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఈ కార్టిసాల్ హార్మోన్ ఆకలిని పెంచుతుంది. దీని వల్ల బరువు తగ్గడం కష్టమవుతుంది. అందుకే రోజూ 7-8 గంటల నిద్ర కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి.
4. ఒత్తిడి:
ఒత్తిడికి కూడా బరువు పెరగడానికి దారితీస్తుంది. ఒత్తిడికి గురైనప్పుడు, శరీరం కార్టిసాల్ అనే హార్మోన్ ను విడుదల చేస్తుంది. కార్టిసాల్ వల్ల ఆకలి ఎక్కువగా అవుతుంది. వ్యాయామం, యోగా, ధ్యానం వంటి వాటి వల్ల ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.
5. ప్రోటీన్‌ను నిర్లక్ష్యం చేయడం:
బరువు తగ్గడానికి ప్రోటీన్ చాలా అవసరం. ప్రోటీన్ తగినంత తీసుకోవడం వల్ల ఆకలి తగ్గుతుంది. అలాగే ఒంట్లోని కొవ్వును కరిగిస్తుంది.
6. అతిగా వ్యాయామం చేయవడం:
బరువు తగ్గాలని కొందరు ఉన్నపళంగా వ్యాయామం మొదలు పెట్టి అతిగా చేస్తుంటారు. దీని వల్ల చాలా రకాల సమస్యలు వస్తాయి. ఉన్నట్టుండి శరీరాన్ని కష్టపెడితే అది భరించలేదు. కండరాల సమస్యలు, ఒంటి నొప్పులు లాంటి సమస్యలు వస్తాయి. శరీరం త్వరగా అలసిపోతుంది. శక్తి కోల్పోతే ఆకలి వేస్తుంది. ఈ శక్తిని భర్తీ చేసుకోవడం కోసం ఎక్కువగా తినాల్సి వస్తుంది.
7. ఫలితం కనిపించకపోతే నిరాశ:
బరువు తగ్గడానికి సమయం పడుతుంది. అలాగే చాలా శ్రమించాల్సి ఉంటుంది. కొన్ని రోజుల పాటు డైట్ పాటించి, వ్యాయామం చేస్తే బరువు తగ్గిపోరు. ఓపికగా శ్రమిస్తేనే ఫలితం వస్తుంది. ఓవర్ నైట్‌లో రిజల్ట్ కోసం పాకులాడొద్దు. పొట్ట పెంచినంత ఈజీ కాదు.. తగ్గించడం.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
