Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
Benefits of crying: ఏడిస్తే ఎన్ని ప్రయోజనాలుంటాయో తెలుసా?.,ఇది చదివి మనసారా ఏడవండి!
మనిషి అన్నాక ఏదో ఒక సందర్భంలో ఏడుస్తారు. అసలు పుట్టగానే ఏడుస్తూ పుడతాం. పోయాక మనం పుట్టించినోళ్లు మన కోసం ఏడుస్తారు. జీవితం అంటే కష్టాలు తప్పవు. కష్టాల సమయంలో బాధ వస్తే ఖచ్చితంగా ఏడుస్తాం.మనుషులకే ఏడుపు వస్తుంది. జంతువులు,పక్షులకు కేవలం కన్నీళ్లు మాత్రమే వస్తాయి. కొన్నిసార్లు ఆనందం ఎక్కువ అయ్యి కూడా ఏడ్చేస్తుంటాం. కాబట్టి ప్రతి కన్నీటి చుక్క ఏడుపు సంకేతం అని భావించకూడదు. ఉల్లిపాయలు కోసేటప్పుడు కూడా కన్నీళ్లు వస్తాయి..అలా అని ఏడుస్తున్నట్లు దాని అర్థం కాదు కదా.
అయితే కొన్ని సందర్భాలలో ఇంట్లో ఎవరైనా ఏడుస్తుంటే ఏడువు ఏం నష్టం లేదు అని అంటుండటం మనం వింటుంటాం. పెద్దలు ఆ మాట ఊరికే అనలేదండోయ్. ఏడుపు వల్ల చాలా ప్రయోజనాలే ఉన్నాయండి. అందుకే ఎంత ఏడిస్తే అంత మంచిది అని అంటుంటారు మన పెద్దలు. అలా అని కావాలని ఏడిస్తే కోరి కష్టాలను తెచ్చుకున్నట్లే. అకారణమైన ఏడుపు మానసిక అనారోగ్యానికి సంకేతం.

సహజంగా ఏడుపు వచ్చేస్తేనే ఏడుపు వల్ల లభించే ప్రయోజనాలను పొందగలుగుతాము. ఏడుపు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టే ఇటీవల కొంతకాలంగా లాఫింగ్ క్లబ్ ల మాదిరిగా క్రయింగ్ క్లబ్ లు కూడా వచ్చేస్తున్నాయి. అయితే అసలు ఏడుపు వల్ల ఏం ప్రయోజనాలు ఉంటాయో ఇప్పుడు చూడండి.
ఏడుపు వల్ల ప్రయోజనాలివే
-ఏదైనా గాయం జరిగినప్పుడు నొప్పి తట్టుకోలేక గట్టిగా ఏడ్చేస్తుంటాం. ఇదీ ఒకందుకు మంచిదేనట. కన్నీళ్లలో ఒకరకమైన పెయిన్ కిల్లర్ ఉంటుందట. బాగా ఏడ్చిన తర్వాత నొప్పి తగ్గినట్లు అనిపించడానికి ఇదే కారణం.
-ఏడుపు చర్మ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని మీకు తెలుసా? ఏడ్చే సమయంలో మొఖంలో రక్త ప్రసరణ పెరిగి చర్మానికి కొత్త నిగారింపు వస్తుంది.
-మనసారా ఏడ్చినప్పుడు మనసులోని చేదు జ్ణాపకాలు మసకబారిపోతున్న ఫీలింగ్ వస్తుంది. కన్నీళ్లతో పాటు కార్టిసాల్ అనే ఒత్తిడి హార్మోన్ కూడా బయటకి వెళ్లిపోతుంది. అందువల్ల బాగా ఏడ్చిన తర్వాత మనసు తేలికపడుతుంది.
- ఏడ్చినప్పుడు కన్నీళ్లు వస్తాయి. కన్నీళ్లు మన కళ్లను పొడిబారనీయవు. బైక్ కు ఇంజిన్ ఆయిల్ ఎలా పనిచేస్తుందో కళ్లకు సహజసిద్ధమైన లూబ్రికెంట్స్ ఇవి.
-ఎక్కువగా సంతోషంగా ఉంటే మనసారా నవ్వుతాం. ఓ అంచనా ప్రకారం మనసారా నవ్వినప్పుడు 1.3 క్యాలరీలు కరిగిపోతాయి..మనసారా ఏడ్చినప్పుడు కూడా అంతే క్యాలరీలు కరిగిపోతాయంట.
-ఆథ్యాత్మికంగాను ఏడుపు చాలా కీలకమైనది. పూజలు,వ్రతాలు, యజ్ణాల కంటే కన్నీళ్లతో కూడిన భక్తుడి ప్రార్థనలే దేవుడిని త్వరగా కదిలిస్తాయి. మన పురాణాల్లో దీనికి బోలెడు ఉదాహరణలు ఉన్నాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications