Latest Updates
-
మహిళలను వేధిస్తున్న పీసీఓఎస్ సమస్య.. వాళ్లు ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసా.? -
శరవణ భవన్ స్టైల్ వెన్ పొంగల్..కొబ్బరి చట్నీతో తింటే మర్చిపోలేరు! -
తప్పతాగి రోడ్డుకి అడ్డంగా పడుకున్న యువతి.. ఒక చేతిలో సిగరెట్, పక్కనే మందు బాటిల్‌తో రచ్చ.! -
మెరిసే ముఖం కోసం ఇంట్లోనే ఫేస్ ఆయిల్.. రోజూ ఉదయం ఇలా చేస్తే చాలు.! -
అమ్మాయిల గురించి మీకు తెలియని 7 షాకింగ్ నిజాలు! -
శిల్పా శెట్టి స్పెషల్..పంచదార లేని పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం.. టేస్ట్ అదుర్స్! -
షుగర్ పేషెంట్లకు రోజులో ఎక్కువ డేంజరస్ టైం ఏది? బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ కి ఈజీ చిట్కాలు.. -
వర్క్ ఫ్రం హోంలో పెరుగుతున్న ఒత్తిడి.. ఆందోళన తగ్గేందుకు ఇలా చేయండి.! -
మెనోడివోర్స్ అంటే ఏంటి? నడివయసులో దాంపత్యం దారితప్పడానికి కారణమిదే.. -
పప్పులకు పురుగులు పడుతున్నాయా? ఈ ఒక్కటి వేస్తే చాలు ఏడాదైనా పాడవ్వవు!
Weight Loss Tips: బరువు తగ్గడానికి ఓట్స్ ఇలా తినాలి.. ఈజీగా వెయిట్ లాస్ అవ్వొచ్చు
బరువు తగ్గాలనుకునే వారు తినాలని చాలా మంది చెప్పే ఆహారం ఓట్స్. బరువు తగ్గడానికి ప్రయత్నిస్తుంటే ఓట్స్ ఉత్తమమైన ఆహారాల్లో ఒకటి. ఓట్స్ ను సరిగ్గా తినగలిగితే సులభంగా బరువు తగ్గొచ్చు. ఎంత తింటున్నామనే పట్టింపులు లేకుండా తినేస్తుంటే బరువు పెరుగుతారు. బరువు తగ్గడానికి ఓట్స్ ఎలా తినాలి, రోజూ ఎంత తింటే బరువు తగ్గవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
ఓట్స్‌లోని పోషకాలు:
ఓట్స్ లో పైబర్, కార్బోహైడ్రేట్లు, ఫాస్పరస్, పొటాషియం, సెలీనియం, మెగ్నీషియం, బి కాంప్లెక్స్ విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్- యూఎస్డీఏ ప్రకారం, 100 గ్రాముల ఓట్స్‌లో ఉండే పోషకాలు

ఎనర్జీ - 379 కి.కేలరీలు
వాటర్ - 10.8గ్రా
ప్రోటీన్ - 13.2 గ్రా
ఫ్యాట్ - 6.52 గ్రా
కార్బోహైడ్రోట్లు - 67.7 గ్రా
షుగర్ - 0.99 గ్రా
ఫైబర్ - 10.1 గ్రా
కాల్షియం - 52 ఎంజీ
సోడియం - 6 ఎంజీ
పొటాషియం - 362 ఎంజీ
మెగ్నీషియం - 138 ఎంజీ
ఫాస్పరస్ - 410 ఎంజీ
ఐరన్ - 4.25 ఎంజీ
జింక్ - 3.64 ఎంజీ
కాపర్ - 0.39 ఎంజీ
బరువు తగ్గడానికి ఓట్స్ చేసే సాయం
1. సంతృప్తిగా అనిపిస్తుంది:
ఓట్స్ లో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఫ్యాట్ అబ్సార్‌ప్షన్ ను తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. ఆరోగ్యకరమైన గట్ బ్యాక్టీరియాను మెరుగుపరుస్తుంది. ఇది చాలా తక్కువ కేలరీలను అందిస్తుంది. ఫైబర్ ప్రేగు కదలికలను వేగవంతం చేస్తుంది. ఫైబర్ వల్ల పొట్ట ఎక్కువ సేపు నిండినట్లుగా అనిపిస్తుంది. దీని వల్ల ఆకలి త్వరగా వేయదు.
2. రక్తంలో చక్కెర స్థాయిల స్థిరీకరణ:
బీటా- గ్లూకాన్ అని పిలిచే ఓట్స్ లోని కరిగే ఫైబర్, గట్ లోని గ్లూకోజ్, ఇతర కార్బోహైడ్రేట్ల అబ్సార్‌ప్షన్ నెమ్మదిస్తుంది. ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను స్థిరంగా ఉంచుతుంది.
బరువు తగ్గడానికి రోజూ ఎంత ఓట్స్ తినాలి:
బరువు తగ్గడానికి రోజూ అర కప్పు ఓట్స్ తీసుకోవాలి. అంటే 50 గ్రాముల ఓట్స్ మంచి పరిమాణం. అంతకు మించి తింటే ఇతర సమస్యలు వస్తాయి. ఇందులోని ఫైబర్ వల్ల జీర్ణక్రియ సమస్యలు తలెత్తుతాయి. అందుకే పరిమితిలోనే ఓట్స్ తినాలి.
బరువు తగ్గడానికి ఓట్స్ ఎలా తినాలి:
ఓట్స్ లో రోజులో ఏ సమయంలోనైనా తినొచ్చు. అయితే ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనంలో ఓట్స్ తింటే పూర్తి స్థాయిలో ప్రయోజనాలు అందుతాయి. రాత్రి పూట కొంత మొత్తంలో ఓట్స్ తినడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరీకరించవచ్చు. అర్ధరాత్రి ఆకలి కాకుండా ఉంటుంది.
* బ్రేక్‌ఫాస్ట్ కోసం రుచికరమైన ఓట్ మీల్ తయారు చేసుకోవచ్చు
* రుచికరమైన ఓట్స్ వంటకాలు తినొచ్చు
* రాత్రి పూట కొంత మొత్తంలో ఓట్ మీల్ తినొచ్చు
ఓట్స్ అతిగా తింటే ఏమవుతుంది:
ఓట్స్ లో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఓట్స్ ను అతిగా తినడం వల్ల లేదంటే సరిగ్గా తినకపోవడం వల్ల బరువు పెరుగుతారు. అలాగే ఓట్స్ లో ఉండే అధిక ఫైబర్ కంటెంట్ కొంత మందిలో గ్యాస్, ఉబ్బరం, పొత్తి కడుపులో అసౌకర్యాన్ని కలిగిస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications