Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
బరువు తగ్గడానికి ఓట్స్ ఇలా తినాలి.. ఈజీగా వెయిట్ లాస్ అవ్వొచ్చు
బ్రౌన్ రైస్‌ను చాలా మంది వైట్ రైస్‌కు ప్రత్యామ్నాయంగా తింటుంటారు. ఇందులో ఫైబర్, ప్రోటీన్, పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. బ్రౌన్ రైస్‌లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. బరువు తగ్గడానికి, ఆరోగ్యకరమైన బరువు మెయింటైన్ చేయడానికి ప్రయత్నించే వారికి బ్రౌన్ రైస్ ఉత్తమమైన ఎంపిక.
బరువు తగ్గడానికి బ్రౌన్ రైస్ తీసుకోవడానికి చాలా మార్గాలున్నాయి. అయితే బ్రౌన్ రైస్‌ను ఎలా తీసుకుంటే ఎఫెక్టివ్ గా బరువు తగ్గవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

బ్రౌన్ రైస్ ఎలా తినాలంటే?:
* నీటిలో, పులుసులో ఉడికించాలి:
బ్రౌన్ రైస్‌ను నీటిలో ఉడికించుకుని తినాలి. ఇందులో నూనె, నెయ్యి లాంటివి వేయకూడదు. అలాగే చికెన్, మటన్, ఫిష్ బోన్స్ ఉడికించిన నీటి(బ్రాత్)లో బ్రౌన్ రైస్ ఉడికించుకుని తినవచ్చు.
* కూరగాయలు, లీన్ ప్రోటీన్:
బ్రౌన్ రైస్ తో పాటు తాజా కూరగాయలు, లీన్ ప్రోటీన్లు తినాలి. వీటి వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది.
* సలాడ్‌లు, సూప్‌లు, స్టైర్-ఫ్రైస్:
బ్రౌన్ రైస్ తో పాటు సలాడ్లు, సూప్‌లు, స్టైర్ ఫ్రైస్ తినడం వల్ల శరీరానికి ఫైబర్ పుష్కలంగా అందుతుంది. అలాగే వివిధ పోషకాలు శరీరానికి అందుతాయి.
* బ్రౌన్ రైస్ కేక్‌లు:
బ్రౌన్ రైస్‌తో తయారు చేసిన కేక్ లలో తక్కువ కేలరీలు, ఫైబర్ అధికంగా ఉంటుంది. లంచ్‌కు, డిన్నర్‌కు మధ్యలో ఆకలిగా అనిపిస్తే వీటిని తినడం ద్వారా ఆకలి తగ్గుతుంది.

బరువు తగ్గడానికి బ్రౌన్ రైస్ బెనిఫిట్స్:
* ఫైబర్:
బ్రౌన్ రైస్‌లో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. బ్రౌన్ రైస్ తిన్న తర్వాత కడుపు నిండినట్లుగా అనిపిస్తుంది. ఎక్కువ సమయంపాటు ఆకలి వేయకుండా ఉంటుంది. దీని వల్ల తక్కువ తింటారు. తక్కువ కేలరీలు శరీరానికి అందుతాయి.
* గ్లైసెమిక్ ఇండెక్స్:
బ్రౌన్ రైస్ యొక్క గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. బ్రౌన్ రైస్ తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఉంటాయి. ఇది ఆకలి కోరికలను తగ్గిస్తుంది. అతిగా తినడాన్ని నివారిస్తుంది.
* అధిక పోషకాలు:
బ్రౌన్ రైస్‌లో మెగ్నీషియం, సెలీనియం, మాంగనీస్ తో సహా ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలతో ఆరోగ్యంగా ఉండొచ్చు.
బరువు తగ్గాలనుకునే వారు తినే ఆహారంలో బ్రౌన్ రైస్ చేర్చుకోవడం మంచి ఎంపిక. ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణ క్రియ మెరుగుపడుతుంది. బరువు తగ్గడానికి వైట్ రైస్‌ను బ్రౌన్ రైస్‌తో భర్తీ చేసుకోవచ్చు. బ్రౌన్ రైస్‌తో పాటు లీన్ ప్రోటీన్, కూరగాయలు కలిపి తినడం ద్వారా కడుపు నిండిన భావన కలుగుతుంది. దీని వల్ల తక్కువ ఆకలి వేస్తుంది.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications