Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
Weight Loss Tips: బరువు తగ్గాలా? ఆకుకూరలు ఇలా తినండి
బరువు తగ్గాలనుకునే వారు వారి డైట్‌లో చేర్చుకోవడానికి ఆకు కూరులు అత్యుత్తమమైనవి. ఆకు కూరల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. తక్కువ కేలరీలు, అధిక ఫైబర్ ఉంటుంది. బరువు తగ్గాలనుకుంటే ఆకు కూరలు బెస్ట్ ఆప్షన్. ఇవి కేవలం బరువు తగ్గడానికే కాకుండా ఇందులోని పోషకాలు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. బరువు తగ్గాలనుకునే వారు ఆకు కూరలను ఎలా తినాలో, ఎలా తింటే సులభంగా బరువు తగ్గవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
1. ఆకుకూరలను తేలికగా ఉడికించాలి:
ఆకుకూరలను ఉడికించేటప్పుడు వాటి పోషకాలు తొలగిపోకుండా చూసుకోవాలి. నీటిలో ఉడికిస్తే ఆ నీటిని పారబోయకూడదు. ఆకుకూరలను ఉడికించడానికి ఉత్తమమైన పద్ధతి ఆవిరపై ఉడికించడం. ఇలా ఉడికించడం వల్ల ఆకుకూరల్లోని పోషకాలు తొలగిపోకుండా ఉంటాయి. స్టైర్ ఫ్రైయింగ్ పద్ధతి కూడా మంచిదే.

2. స్మూతీస్‌కి జోడించుకోవచ్చు:
ఆకుకూరల నుండి పూర్తి స్థాయిలో పోషకాలు అందుకోవడానికి స్మూతీస్ గొప్ప మార్గం. మీకిష్టమైన ఆకుకూరలను బ్లెండర్ లో కొన్ని పండ్లు, పెరుగు, పాలు కలిపి స్మూతీస్ గా తయారు చేసుకుని తీసుకుంటే రుచిగా ఉండటంతో పాటు ఆకుకూరల్లోని పోషకాలు శరీరానికి అందుతాయి.
3. సలాడ్ లకు జోడించుకోవచ్చు:
సలాడ్స్ లో కూడా ఆకుకూరలు జోడించుకోవచ్చు. బచ్చలికూర, కాలే, పాలకూర లాంటివి సలాడ్‌లకు జోడిస్తే బాగుంటాయి. ఈ సలాడ్స్ లో పండ్లు, గింజలు, విత్తనాలు, స్ప్రౌట్స్ కూడా వేసుకోవచ్చు.
4. ఆకుకూరలతో సూప్‌లు:
ఆకుకూరలతో సూప్‌లు కూడా తయారు చేసుకోవచ్చు. వీటిని తీసుకోవడం కూడా చాలా సులభం. భోజనం చేసే ముందు లేదా తర్వాత ఆకుకూరలతో చేసిన సూప్‌లు తీసుకోవచ్చు.
5. శాండ్‌విచ్‌లు, బర్గర్లతో పాటు:
శాండ్‌విచ్‌లలో, బర్గర్ల మధ్యలో ఆవిరిపై ఉడికించిన ఆకుకూరలు, లేదంటే పచ్చివి కూడా పెట్టుకుని తినొచ్చు. దీని వల్ల ఆకుకూరల్లోని పోషకాలు సమృద్ధిగా అందుతాయి. ఇతర ఆహార పదార్థాలకు
6. స్టైర్-ఫ్రైస్ తో వండుకోవచ్చు:
ఆకుకూరలకు పోషణ, రుచిని జోడించడానికి స్టైర్ - ఫ్రైస్ మంచి మార్గం. ఇష్టమైన స్ట్రై-ఫ్రైస్ వంటకాలకు ఆకుకూరలు జోడించవచ్చు.
ఈ మార్గాల్లో ఆకుకూరలను రెగ్యులర్ డైట్‌లో భాగం చేసుకోవచ్చు. ఇలా ఆకుకూరలు తింటే అందులోని పోషకాలు సమృద్ధిగా అందడంతో పాటు బరువు తగ్గడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
ఆకుకూరలతో కలిగే అదనపు ప్రయోజనాలు:
* ఆకుకూరల్లో విటమిన్ ఏ, సి, కె లు పుష్కలంగా ఉంటాయి.
* ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది
* కేలరీలు, కొవ్వు తక్కువ
* యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి
* క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి
* గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి
* రక్తంలో చక్కెర నియంత్రిస్తుంది
* జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి
* రోగనిరోధక శక్తిని పెంచుతాయి
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications