Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
శిలాజిత్ కంటే పవర్ ఫుల్ ..ఈ పండు గురించి మీకు తెలుసా?
కరోనా తర్వాత నుంచే చాలామందిలో ఆరోగ్యంపై శ్రద్ధ మరింత పెరిగిందని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. అయితే ఆరోగ్యంపై శ్రద్ధ మరింత పెరిగిన క్రమంలో చాలామంది శారీరక దారుఢ్యం కోసం, శక్తి కోసం చాలా మంది శిలాజిత్ వంటి ఆయుర్వేద సప్లిమెంట్లను ఆశ్రయిస్తున్నారు.
అయితే శిలాజిత్ కంటే ఎంతో శక్తివంతమైన, సహజసిద్ధమైన ప్రయోజనాలను అందించే ఒక అద్భుతమైన పండు ఉందన్న విషయం మీకు తెలుసా? అదే లుకుమా పండు. దీనిని రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే మీ ఆరోగ్యానికి జరిగే మేలు అంతా ఇంతా కాదు.

లుకుమా పండు అంటే ఏమిటి?
లుకుమా అనేది దక్షిణ అమెరికాలోని ఆండీస్ పర్వత ప్రాంతాలకు చెందిన ఒక ప్రత్యేకమైన పండు. చూసేందుకు ఆకర్షణీయమైన బంగారు పసుపు రంగులో ఉండే ఈ పండును స్థానికులు ఇంకాస్ బంగారం అని పిలుచుకుంటారు.
శతాబ్దాలుగా ఆ ప్రాంత ప్రజలు తమ శారీరక బలాన్ని, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి దీనిని ఒక అమృతంలా భావించి తింటున్నారు.
ముఖ్యమైన మినరల్స్
లుకుమా పండు కేవలం రుచికి మాత్రమే కాదు, పోషకాలకు కూడా ఒక పవర్ హౌస్ లాంటిది. ఇందులో మన శరీరానికి అత్యంత అవసరమైన ఐరన్, కాల్షియం, పొటాషియం, జింక్ వంటి ఖనిజాలు మెండుగా ఉంటాయి.
ఈ ఖనిజాలు ఎముకలను దృఢంగా ఉంచడమే కాకుండా రక్త ప్రసరణను మెరుగుపరిచి, శరీర జీవక్రియల వేగాన్ని పెంచుతాయి. రోజంతా చురుకుగా పనిచేయడానికి అవసరమైన స్టామినాను అందిస్తాయి.
స్థిరమైన, అలసట లేని శక్తి
సాధారణంగా మనం తీపి పదార్థాలు లేదా ఎనర్జీ డ్రింక్స్ తీసుకున్నప్పుడు రక్తంలో షుగర్ లెవల్స్ అమాంతం పెరిగిపోయి, కొద్దిసేపటికే విపరీతమైన నీరసం వచ్చేస్తుంది. కానీ లుకుమా పండులో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది.
దీనివల్ల ఇది రక్తంలోకి షుగర్ ని స్లో గా రిలీజ్ చేస్తుంది. ఫలితంగా ఎలాంటి అలసట, నీరసం రాకుండా రోజంతా స్థిరమైన, సున్నితమైన శక్తిని మనకు అందిస్తుంది. డయాబెటీస్ ఉన్నవారికి కూడా ఇది బెస్ట్ ఆప్షన్.
హార్మోన్ల బ్యాలెన్స్ కు బ్రహ్మాస్త్రం
ఈ రోజుల్లో పురుషులు, మహిళలు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యల్లో హార్మోన్ల అసమతుల్యత ఒకటి. లుకుమా పండులో ఉండే ప్రత్యేకమైన మొక్కల సమ్మేళనాలు మన శరీరంలోని ఎండోక్రైన్ వ్యవస్థకు అద్భుతమైన సపోర్ట్ ఇస్తాయి.
హార్మోన్లను సహజ పద్ధతిలో బ్యాలెన్స్ చేయడంలో, శరీరానికి కొత్త ఉత్సాహాన్ని, తేజస్సును అందించడంలో ఇది ముందుంటుంది.
చర్మ సౌందర్యం.. యవ్వన రహస్యం
వృద్ధాప్య ఛాయలను దరిచేరనీయకుండా చేయడంలో లుకుమా సాటిలేనిది. ఇందులో యాంటీఆక్సిడెంట్లు, బీటా కెరోటిన్ ఎక్కువ మోతాదులో ఉంటాయి.
ఈ పోషకాలు శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. ముడతలు రాకుండా చర్మాన్ని బిగుతుగా, ప్రకాశవంతంగా ఉంచడంలో ఈ పండు చేసే మేలు అంతా ఇంతా కాదు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications