Latest Updates
-
డ్రమ్ లో శవమవడం కంటే ఇదే బెస్ట్.. భార్యకు ఆమె ప్రియుడితో పెళ్లి జరిపించిన భర్త.. నెటిజన్ల ప్రశంసలు -
చుక్క నూనె లేకుండానే బెస్ట్ స్నాక్..ఒక్కటితో ఆగరు,అంత రుచిగా ఉంటుంది! -
పెళ్లి కాని ప్రసాద్ లు చూస్తే ఏడ్చేస్తారు.. కుక్కను పెళ్లి చేసుకొని అందరికీ షాకిచ్చిన బ్యూటీ! -
నాన్ వెజ్ ని మించిన రుచి, ఆరోగ్యం కూడా..చపాతీ, రైస్ లోకి కిర్రాక్ అనిపించే గోంగూర సోయా చేసుకోండిలా.. -
రాజస్థాన్ ఫేమస్ కార్న్ ఢోక్లా..బరువు తగ్గాలనుకునేవాళ్లకి ఇది బెస్ట్! -
గుడ్డు పచ్చసొన తింటే కొలెస్ట్రాల్ పెరిగి హార్ట్ ఎటాక్ వస్తుందా? డాక్టర్ విక్రాంత్ సింగ్ ఏమంటున్నారంటే.. -
ఈ ఒక్క పొడి ఉంటే చాలు..జీవితంలో హాస్పిటల్ కి వెళ్లాల్సిన పనే ఉండదు..అన్నం, టిఫిన్స్ లోకి సూపర్ -
అబ్బాయి వర్జిన్ కాదని పెళ్లి రద్దు చేసుకున్న యువతి..అసలు నువ్వు వర్జినేనా అంటూ.. -
100 ఏళ్లు బతికించే హెల్తీ బ్రేక్ ఫాస్ట్..రోజుకి ఒక గిన్నె తింటే బరువు ఇట్టే తగ్గిపోతారు..ఎలా చేసుకోవాలంటే.. -
హోటల్ స్టైల్ ఇడ్లీ కారం పొడి..బ్రేక్ ఫాస్ట్ లోకి చట్నీ కూడా వద్దంటారు..ఇంట్లోనే ఇలా చేసుకోండి..
కంటి చూపుతో గుండె జబ్బుల గుర్తింపు!..హార్ట్ ఎటాక్ ని ముందుగానే ఇలా కనిపెట్టవచ్చు!
ఈ రోజుల్లో మారిన జీవనశైలి,ఆహార అలవాట్లు, ఒత్తిడి కారణంగా చాలా మంది గుండె వీక్ గా మారిపోతుంది. దీర్ఘాయుష్షు అనేది రాను రాను ఓ కలగానే మిగిలిపోతుంది. 60 ఏళ్లు బతికితేనే గొప్ప అనే స్టేజ్ కి చాలామంది వచ్చేస్తున్నారు. అయితే గత కొన్నేళ్లుగా గుండె సంబంధిత వ్యాధులతో నిలబడినోళ్లు నిలబడ్డట్లే కుప్పకూలిపోడం, కూర్చున్న వ్యక్తి సడెన్ గా కుప్పకూలి చనిపోవడం,ఫంక్షన్ లో డ్యాన్స్ చేస్తూ అకస్మాత్తుగా కిందపడి మరణించిన ఘటనలు అనేకం వార్తల్లో చూసి ఉంటారు.
గుండె జబ్బులను ముందుగా గుర్తిస్తే ప్రాణాలు పోకుండా కాపాడుకోవడం సులభమవుతుంది. గుండెకు,మన కళ్లకు చాలా అద్భుతమైన కనెక్షన్ ఉందని మీకు తెలుసా? కళ్లు కేవలం ప్రపంచాన్ని చూసేందుకే కాదు..అవి మన ఆరోగ్యం గురించిన రహస్యాలను కూడా బయటపెడతాయి. మన గుండె ఎంత ఆరోగ్యంగా ఉందో కళ్లను చూసి చెప్పవచ్చని తాజా పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. ఇది ఆశ్చర్యంగా అనిపించినా డాక్టర్లు ఇప్పుడు మన కంటిలోని రెటీనాను గుండె ఆరోగ్యానికి ఒక కిటికీలా చూస్తున్నారు.

కంటికి, గుండెకు ఉన్న సంబంధం ఏమిటి?
మన శరీరంలోని సూక్ష్మ రక్త నాళాల వ్యవస్థను నేరుగా, ఎలాంటి ఆపరేషన్ లేకుండా చూడగలిగే ఏకైక ప్రదేశం కంటిలోని రెటీనా. ఈ చిన్న రక్త నాళాలు నిర్మాణం, పనితీరులో.. గుండె, మెదడులోని రక్త నాళాలను పోలి ఉంటాయి. అందువల్ల రెటీనాలోని రక్త నాళాలకు నష్టం జరిగితే అది గుండెలోని నాళాల అనారోగ్యాన్ని ప్రతిబింబిస్తుంది.
అధిక రక్తపోటు
అధిక రక్తపోటు (హైపర్టెన్షన్) ఉన్నవారిలో ఈ ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుంది. దీర్ఘకాలికంగా అధిక రక్తపోటు ఉండటం వల్ల కంటిలోని సున్నితమైన రక్త నాళాలు దెబ్బతింటాయి. ఈ పరిస్థితిని హైపర్టెన్సివ్ రెటినోపతి అంటారు. ఇది దృష్టి సమస్యలకే కాకుండా శరీరంలోని ఇతర అవయవాలు కూడా ప్రమాదంలో ఉన్నాయని చెప్పడానికి ఒక బలమైన సంకేతం.
ముందస్తు హెచ్చరికలు గుర్తించడం ఎలా?
సాధారణ కంటి పరీక్ష సమయంలో డాక్టర్లు రెటీనాలోని రక్త నాళాలలో మార్పులను గమనించగలరు. నాళాలు ఉబ్బడం, వాటి నుండి రక్తస్రావం కావడం లేదా ద్రవాలు లీక్ అవడం వంటి లక్షణాలు కనిపిస్తే అది రాబోయే గుండెపోటు, స్ట్రోక్ లేదా గుండె వైఫల్యానికి ముందస్తు హెచ్చరిక కావచ్చు. లేటెస్ట్ టెక్నాలజీ, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఈ మార్పులను మరింత కచ్చితంగా విశ్లేషించి, గుండె జబ్బుల ప్రమాదాన్ని అంచనా వేయడంలో సహాయపడుతోంది.'
అధిక రక్తపోటు ఉన్నవారు కేవలం బీపీని నియంత్రించుకోవడమే కాకుండా, క్రమం తప్పకుండా కంటి వైద్యునిచే పూర్తిస్థాయి పరీక్షలు చేయించుకోవడం అత్యవసరం. మీ తదుపరి కంటి పరీక్ష కేవలం కళ్లజోడు కోసం కాదు, అది మీ గుండె ఆరోగ్యాన్ని కాపాడే ఒక ముఖ్యమైన పరీక్ష కూడా అని గుర్తుంచుకోండి. మీ కళ్ళు మీ గుండె ఆరోగ్యం గురించి చెప్పే రహస్యాలను తెలుసుకోవడం మంచిది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
