Latest Updates
-
నిమిషం ఆలస్యంగా తిన్నా గంట సేపు జీతం లేని చాకిరీ తప్పదు.. ఆఫీసులో వింత నియమం.! -
మాజీ భాగస్వామితో గడిపిన ఆ సందర్భాలు.. పదే పదే అపరాధ భావనకి గురవుతున్నారా.? -
రోజూ పూజ చేస్తున్నా ఫలితం రావడం లేదా? ఈ 5 తప్పులు కారణం కావచ్చు! -
ఫేస్ వాష్ కొనే పని లేదు.. వారం రోజుల్లోనే మెరిసే ముఖం.. కిచెన్లోనే అద్భుత రహస్యం.! -
మిలీనియల్ ‘అబ్బాయిల’కి అట్రాక్ట్ అవుతున్న జెన్ జీ అమ్మాయిలు.. కారణాలివే.! -
నెలరోజుల పాటు ఈ ఒక్కటి మానేస్తే.. ఈజీగా 3 కేజీల బరువు తగ్గేస్తారు.! -
రక్తహీనత సమస్యకి దివ్య ఔషధం.. పాలకూరతో ఇలా చేశారంటే మెతుకు కూడా వదిలిపెట్టరు.! -
మహిళల్లో పడిపోతున్న అండాల సంఖ్య.. ఈ కారణాలు తెలుసుకోకపోతే భారీ మూల్యం తప్పదు.! -
టేస్ట్, హెల్త్ ఒకేసారి..ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఓట్స్ వెజిటబుల్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలంటే.. -
జూన్ 23: ఈ రాశుల వారికి అదృష్టం.. కాసుల వర్షం కురిసే ఛాన్స్!
బ్లూ టీ ఎప్పుడైనా తాగారా? ఈ లాభాలు తెలుసుకుంటే రోజూ తాగుతారు
ఈ మధ్యకాలంలో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా చాలా మంది రోగాల బారిన పడుతున్నారు. అనారోగ్య సమస్యలు చిన్న వయస్సు నుంచే చుట్టు ముడుతున్నాయి. అనారోగ్యకరమైన జీవనశైలి, ఫాస్ట్ పుడ్, ప్యాకేజ్డ్ ఫుడ్స్ తినడం, వ్యాయామం చేయకపోవడం, గంటల తరబడి కూర్చీలకే అతుక్కుపోవడం లాంటి చెడు అలవాట్ల వల్ల అనారోగ్యాల బారిన పడుతున్నారు చాలా మంది.
వయస్సుతో సంబంధం లేకుండా చాలా మంది టీని ఇష్టపడతారు. రోజుకు కనీసం ఒక కప్పు టీ అయినా తాగకుండా ఉండలేని వారు చాలా మందే ఉంటారు. అయితే టీలలో కొన్ని పదార్థాలు కలపడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. అల్లం, పుదీనా, లెమన్, గ్రీన్ టీ ల్లాంటివి తాగడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి. అయితే ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు యవ్వనాన్ని, వయస్సును కనబడకుండా చేయడంలో ఈ బ్లూ టీ అద్భుతంగా పని చేస్తుంది. అసలు ఈ బ్లూ టీ అంటే ఏంటి, ఎలా తయారు చేస్తారు, దీని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

బ్లూటీని ఎలా తయారు చేస్తారు:
టీ పౌడర్ వేసి టీ తయారు చేయడం గురించి అందరికీ తెలిసిందే. టీ పొడి నీటిలో లేదా పాలలో మంచిగా మరగడం వల్ల దాని రంగు నీటికి లేదా పాలకు వస్తుంది. అలా టీకి ఆ రంగు వస్తుంది. మిగతా టీలు కూడా ఆయా రంగులు రావడానికి వెనక కారణంగా.. అందుకోసం వాడే పదార్థాలే. అలాగే బ్లూ టీని శంఖు పూలతో తయారు చేస్తారు. నీలి రంగులో నిగనిగలాడే శంఖు పూలను నీటిలో మరిగించడం వల్ల దాని రంగు వస్తుంది. అలా ఈ టీ బ్లూ టీగా పిలుస్తారు. బ్లూటీ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటంటే..
- బ్లూటీ ఆరోగ్యానికి చాలా మంచిది. టీ పొడిలో కెఫిన్ ఉంటుంది. కెఫిన్ ను ఎక్కువగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. కానీ ఈ బ్లూటీలో ఎలాంటి కెఫిన్ ఉండదు. స్వచ్ఛమైన శంఖు పూలతో తయారు చేయడం వల్ల నేచురల్ డ్రింక్ గానూ ఉంటుంది. అందుకే మామూలు టీ కంటే కూడా బ్లూటీ మంచిది.
- శంఖు పూలలో సహజంగానే బరువు తగ్గించే లక్షణాలు ఉంటాయి. ఇందులో పోషకాలు బరువు తగ్గించడంలో సహాయపడతాయి. ఈ బ్లూటీ తాగడం వల్ల కొవ్వు కరుగుతుంది. అలాగే ఈ బ్లూటీ తాగడం వల్ల ఫ్యాటీ లివర్ సమస్య నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.
- ఆరోగ్యానికి యాంటీ ఆక్సిడెంట్లు చాలా ముఖ్యం. యాంటీ ఆక్సిడెంట్లు అనేక రకాలుగా ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. బ్లూటీలో ఉండే డిటాక్సిఫైయింగ్ ఏజెంట్లు అయిన యాంటీ ఆక్సిడెంట్లు శరీరం నుంచి చెడును తొలగిస్తుంది. విషాన్ని తొలగించి మంచి ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.
- బ్లూటీలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి మేలు చేస్తాయి. వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తాయి. ఇందులోని హైడ్రేటింగ్ ఏజెంట్లు యాంటీ ఏజింగ్ సంకేతాలను తగ్గించడంలో సహాయపడతాయి. దీనిలోని ఫ్లేవనాయిడ్లు కొల్లాజెన్ ను పెంచుతాయి. ఇది చర్మ స్థితిస్థాపకతను మెరుగుపరచడం ద్వారా యాంటీ గ్లైకేషన్ లక్షణాలను అందిస్తాయి.
- అలాగే ఈ బ్లూటీ వల్ల రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. ఇందులోని విటమిన్లు, ఖనిజాలు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. మానసిక స్థితిని కూడా పెంపొందిస్తాయి.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications