Latest Updates
-
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.!
అర్ధరాత్రిళ్లు అస్సలే నిద్ర పట్టట్లేదా, ఈ బ్రిటన్ ఫార్ములా పాటించారంటే ఫుల్లుగా నిద్రపోవాల్సిందే!
చాలా మందికి అర్ధరాత్రిళ్లు సరిగ్గా నిద్ర పట్టదు. మానసిక సమస్యలు, టెన్షన్లు, డిర్పెషన్.. ఇలా పలు రకాల సమస్యలతో నిద్రకు దూరం అవుతుంటారు. ముఖ్యంగా సాయంత్రం 6, 7 గంటలకు టీ, కాఫీలు తాగడం వల్ల కూడా చాలా మందికి సరిగ్గా నిద్ర పట్టదు.
అయితే వీటన్నిటికి చెక్ పెట్టి బాగా నిద్ర పోవాలంటే కచ్చితంగా ఈ బ్రిటన్ ఫార్మూలాను ఫాలో అవ్వమని నిపుణులు సూచిస్తున్నారు. అసలీ బ్రిటన్ ఫార్ములా ఏంటి, నిద్రం సుఖంగా పట్టాలంటే ఏం చేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

బ్రిటన్ ఫార్ములా అంటే ఏమిటి?
ఎవరైనా సరే పడుకోవడానికి 10 గంటల ముందే కూల్ డ్రింక్స్, టీ, కాఫీలు మానేయాలి. లేదా చాలా వరకు తగ్గించాలి. ముఖ్యంగా కెఫిన్ నిద్రకు సంబంధించిన 36 గణాంకం ఉందట. ఫలితంగా నిద్ర ఎగిరిపోతుంది. అందుకే రాత్రి 10 గంటలకు నిద్రపోయే సమయం అయితే మధ్యాహ్నం 12 గంటల తర్వాత టీ, కాఫీలు తాగకూడదు. నిద్రకు సంబంధించిన ఫార్ములాలో ఇది చివరిది. రాత్రి నిద్రించడానికి ఒక గంట ముందు మీ గాడ్జెట్లు అన్నీ తీసి పక్కన పెట్టేయాలి. ముఖ్యంగా అస్సలే ఫోన్లను దగ్గర ఉంచుకోకూడదు.
ఫోన్లు, ల్యాప్ టాప్‌లు పక్కన పెట్టేయాలి!
ఫోన్లు, ల్యాప్ టాప్ ల, ట్యాబ్లు, టీవీలు వంటి వంటినా చాలా దూరంగా ఉంచాలి. ఫలితంగా గ్యాడ్జెట్ల నుంచి వెలువడే బ్లూ లైటింగ్ కారణంగా తలెత్తే కంటి నొప్పి ఉండదు. ఫలితంగా నిద్ర హాయిగా పడుతుంది. రాత్రి నిద్రించడానికి మూడు గంటల ముందు డ్రింక్స్ లేదా భారీ డైట్ తీసుకోకూడదు. దీని వల్ల శరీరానికి ఆహారాన్ని జీర్ణం చేసుకునేందుకు సమయం లభిస్తుంది. అంతేకాకుండా రాత్రి వేళ గ్యాస్, ఎసిడిటీ సమస్య ఉత్పన్నం కాదు. ఇలా చేయడం వల్ల బెడ్ పైకి వెళ్లిన కాసేపటిక తర్వాతే కళ్లు అలిసిపోయి నిద్ర వచ్చేస్తుంది.
10-3-2-1 ఫార్ములా అప్లై చేసి చూడండి..!
పడుకోవడానికి రెండు గంటల ముందే అన్ని పనులు పూర్తి చేసుకోవాలి. దీనివల్ల మెదడుకు విశ్రాంతి లభిస్తుంది. ఫలితంగా మస్తిష్కంలో నడిచే వివిధ విషయాలు పక్కకు పోతాయి. ఫలితంగా పడుకునే ముందు ఎలాంటి ఆలోచనలు రావు. ముఖ్యంగా ఇంట్లోని, ఆఫీసులోని సమస్యలు అస్సలే గుర్తుకు రావు. దీని వల్ల టెన్షన్ తగ్గి నిద్ర వస్తుంది. ఇదే కాకుండా 10-3-2-1 అనే మరో బ్రిటన్ ఫార్ములా కూడా ఉంది.
ఇలా చేస్తే 7 నుంచి 8 గంటల సుఖమైన నిద్ర మీ సొంతం..!
ఈ ఫార్ములాను అమలు చేస్తే ఏ విధమైన చికిత్స లేకుండానే 7 నుంచి 8 గంటల పాటు మంచి నిద్ర పడుతుందని బ్రిటన్ కు చెందిన వైద్యులు చెబుతున్నారు. పశ్చిమ దేశాలు ఇప్పుడు ఇదే ఫార్ములాను ఫాలో అవుతున్నాయి. మీరు కూడా ఓసారి ట్రై చేసి చూడండి. సుఖమైన నిద్రను సొంతం చేసుకోండి. తేడా మీకే తెలుస్తుంది.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications
