Latest Updates
-
వాతావరణ మార్పులతో మోకాళ్ల నొప్పుల బాధలు.. ఉపశమనం కోసం ఇంట్లోనే ఇలా చేయండి.! -
తిరోగమనం నుంచి బయటపడ్డ బుధ గ్రహం.. ఇక ఈ రాశుల వారి దశ తిరిగినట్లే.! -
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.!
బరువు తగ్గడానికి '7-Second Coffee Loophole'ట్రెండ్.. ఇది నిజంగా బరువు తగ్గిస్తుందా? వైరల్
7-Second Coffee Loophole బరువు తగ్గడానికి ప్రజలు వివిధ రకాలుగా ప్రయత్నిస్తుంటారు. అంతే కాదు ఏవైతే త్వరగా మరియు ఎఫెక్టివ్ గా ఫలితాలిస్తాయో వాటికోసం బరువు తగ్గించే పరిష్కారాల కోసం వెతుకుతుంటారు. ఆక్రమంలో వచ్చినవే వేగాన్ డైట్, కీటో డైట్ మొన్న ఆ మద్యన వాటర్ డైట్ మరియు ఓమాడ్ డైట్ అంటూ వివిధ రకాలు మొన్నటి వరకు ఇంటర్నెట్ లో బాగా ట్రెండ్ అవుతూ వస్తున్నాయి. బరువు తగ్గడానికి అలాంటిదే 'సెవన్ సెకండ్' అంటూ లేటెస్ట్ గా నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అదే కాఫీ ట్రెండె. కాఫీతో బరువు తగ్గొచ్చంటా. అది వేగంగా..! మరి ఈ విషయంలో నిపుణులు కాఫీని మితంగా తాగాలని సూచిస్తుంటారు. మరి కాఫీ బరువును ఎలా తగ్గిస్తుంది? ఇందులో ఉండే కెఫిన్ బరువును నియంత్రించడంలో ఎలా సయామపడుతుంది? ఇదేగా మీ సందేహం? రండి ఈ ఫిట్ నెస్ సీక్రెట్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
ప్రస్తుతం ఇంటర్నెట్ పుణ్యమా అని ప్రపంచంలో ఏమూల ఏం జరిగినా క్షణాల్లో ఇంటర్నెట్ లో ప్రత్యక్షం అవుతుంది. ప్రతి విషయం క్షణాల్లో ట్రెండ్ అవుతుంటాయి. బరువు తగ్గడానికి వివిధ రకాలుగా ప్రయత్నిస్తుంటారు. బరువు తగ్గడం కోసం పూర్తిగా అన్నం మానేసి, ఆకలి నియంత్రిస్తుంటారు. ఆకలిని కంట్రోల్ చేసుకోగలిగితే బరువు తగ్గడం సులభం అంటారు, ఇందులో భాగంగా పుట్టుకొచ్చింది 7-సెకన్ల కాఫీ డైట్.

ఇది ఇప్పుడు మరో ట్రెండ్ ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. దీనిని 7-సెకన్ల కాఫీ లూప్‌హోల్ అంటారు. దీని సహాయంతో ఆకలి అదుపులో ఉంచుకోవచ్చు. ఆకలిగా అనిపించినప్పుడు, మీరు దాల్చిన చెక్క లేదా నిమ్మకాయ వంటి పదార్థాలతో తయారుచేసుకునే బ్లాక్ కాఫీని ఏడు సెకన్లలోపు తీసుకోవాలి. ఇది బరువు తగ్గడానికి సులభమైన పద్దతి అంటూ నెట్టింట వైరల్ అవుతోంది. కానీ బరువు తగ్గడానికి ఈ పద్ధతి ప్రభావవంతంగా మరియు స్థిరంగా ఉందా? వీటినికి సమాధానం చేప్పడానికి పరిశోధన పరంగా ఎలాంటి ఆధారాలు లేవనే విషయాన్ని గ్రహించాలి.
7-సెకన్ల కాఫీ లొసుగు అంటే ఏమిటి?
7-సెకన్ల కాఫీ లూప్‌హోల్ ప్రకారం, మీకు ఆకలిగా అనిపించినప్పుడు, ఏడు సెకన్లలోపు బ్లాక్ కాఫీని కొన్ని పదార్థాలతో కలిపి తాగడం వల్ల మీ ఆకలిని తగ్గిస్తుంది మరియు బరువు తగ్గడంలో సహాయపడుతుంది. దాల్చి చెక్క లేదా నిమ్మకాయ వంటి ఇతర పదార్ధాలతో పాటు కెఫిన్ ఆకలిని నిర్వహించడానికి మరియు జీవక్రియను పెంచడానికి సహాయపడుతుందని సిద్ధాంతం.

ఇది ఎలా పని చేస్తుంది? ఎంతవ రకు దీన్ని నమ్మొచ్చు?
1. కాఫీలోని కెఫిన్ ప్రభావం: కాఫీ గురించి మాట్లాడుతున్న వ్యక్తు అభిప్రాయం ప్రకారం బ్లాక్ కాఫీలో ఉండే కెఫిన్ అడ్రినలిన్ మరియు డోపమైన్ వంటి హార్మోన్ల విడుదలను ప్రేరేపిస్తుంది. ఈ హార్మోన్లు ఆకలిని తాత్కాలికంగా అణిచివేస్తాయి, ఇవి మీకు ఎక్కువ సమయం ఆకలి కాకుండా , ఆకలిని నియంత్రిస్తాయి.
2. ఈ రెండు కీలకమైన పదార్థాలు: కాఫీలో దాల్చినచెక్క లేదా నిమ్మకాయ వంటి వాటిని జోడించడం ప్రయోజనకరంగా ఉంటుంది. దాల్చినచెక్క రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది మరియు నిమ్మకాయ విటమిన్ సి మరియు యాంటీఆక్సిడెంట్ల పుష్కలంగా ఉండటం వల్ల బరువు తగ్గడం వేగవంతం చేస్తుంది.
3. సీక్రెట్ ఏంటంటే: బరువు తగ్గడానికి దీని వెనుక ఉన్న లాజిక్ ఏమంటే, ఆకలిని వెంటనే నియంత్రించుకోవడానికి ఏడు సెకన్లలోపు బ్లాక్ కాఫీ తాగాలి.

ఇలా చేయడం వెనుక ఉన్న ప్రధాన ఉద్యేశం ఏంటంటే?
నిజానికి, కాఫీలో ఉండే కెఫిన్ అనే పదార్థం శరీరంపై అనేక ప్రభావాలను కలిగి ఉంటుంది. కెఫిన్ జీవక్రియను వేగవంతం చేస్తుంది. ఆ క్రమంలో ఎక్కువ కేలరీలు కరిగించడంలో సహాయపడుతుంది. అలాగే కెఫీన్ తాత్కాలికంగా ఆకలి కాకుండా చేస్తుంది.
స్వల్ప ప్రభావం ఉండవచ్చు
ఇలాంటి బరువు తగ్గించే సులభమైన మార్గాలను ఎంచుకున్నప్పటికి అవి తాత్కాలికమైనవి. వీటి వల్ల మెదటికే మోసం వస్తుంది. బంగారం లాంటే మీ ఆరోగ్యాన్ని మీరే మీ చేజేతులారా పాడు చేసుకుంటారు. కాబట్టి బరువు తగ్గడానికి, ఆహారం మరియు వ్యాయామం రెండింటిపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం.
బరువు తగ్గడానికి, ప్రాసెస్ చేయని ఆహారాన్ని తినండి, శరీరానికి సరిపడా నీళ్ళు తాగి హైడ్రేటెడ్ గా ఉండండి, క్రమం నడక, యోగ వంటి వ్యాయామాలు తప్పకుండా చేయండి మరియు ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకోండి.
గుర్తుంచుకోవాల్సి విషయం: త్వరగా శాశ్వతంగా బరువు తగ్గడానికి సత్వరమార్గం అంటూ ఏదీ లేదు. ఇందుకోసం మీ జీవనశైలిలో మార్పులు అవసరం.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications