Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
బరువు తగ్గాలనుకునే వారు మామిడి పండ్లు తినొచ్చా? ఫిట్‌నెస్ నిపుణులు ఏమంటున్నారంటే!
మామిడి పండ్లు తింటే ఎక్కడ బరువు పెరిగిపోతామో, తమ కష్టమంతా వృధా అవుతుందేమో అన్న భయంతో చాలామంది వీటిని తినకూడని జాబితాలో పెట్టేస్తుంటారు. కానీ ఫిట్ నెస్ నిపుణుల ప్రకారం అసలు సమస్య మామిడి పండులో లేనే లేదు, దాన్ని మనం తినే విధానంలోనే ఉంది. సరైన మోతాదులో, కాస్త ఆలోచించి తింటే బరువు తగ్గే ప్రయాణంలో మామిడి పండు కూడా ఒక అద్భుతమైన భాగం అవుతుందని వివరిస్తున్నారు.

నమన్ ఎస్ సోలంకి ఏమంటున్నారంటే..
తన బరువును 125 కిలోల నుండి 79 కిలోలకు తగ్గించుకుని, ఏకంగా 45 కిలోల బరువు తగ్గి ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచిన ఫిట్ నెస్ కోచ్ నమన్ ఎస్ సోలంకి..మామిడి పండ్ల వల్లే కొవ్వు పేరుకుపోతుందన్న వాదనను తోసిపుచ్చారు. తన ఇన్ స్టాగ్రామ్ లో ఆయన.. బరువు తగ్గే సమయంలో మామిడి పండు నిస్సందేహంగా తినవచ్చు అని సూచించారు. చాలా మంది దాన్ని తినే విధానమే అసలైన సమస్య అని నొక్కి చెప్పారు.
మనం చేసే అతిపెద్ద పొరపాటు ఇదే
చాలామంది మామిడి పండ్లను మిల్క్ షేక్స్ లాగా మార్చి అందులో పంచదార గుమ్మరిస్తారు. ఇక కొందరైతే కడుపు నిండా భారీగా భోజనం చేశాక, చివర్లో డెజర్ట్ లాగా ఈ పండ్లను లాగించేస్తారు. దీనివల్ల శరీరంలోకి అదనపు కేలరీలు విపరీతంగా చేరిపోయి, బరువు పెరుగుతారు.
మామిడి పండ్లను స్మార్ట్ గా ఇలా తినండి
ముక్కలుగా కోసుకుని తినండి: జ్యూస్ లు, షేక్స్‌గా కాకుండా సహజంగా ముక్కలు కోసుకుని మాత్రమే తినాలి.
ఒక స్నాక్ లాగా తీసుకోండి: భోజనంతో పాటు కాకుండా, ఉదయం లేదా సాయంత్రం వేళల్లో దీన్ని ఒక ప్రత్యేకమైన స్నాక్ లాగా మాత్రమే తినాలి.
చక్కెర వద్దు: పాలకు, సిరప్స్‌కు, అదనపు చెక్కెరకు దీన్ని దూరంగా ఉంచండి.
పరిమాణం ముఖ్యం: పోర్షన్ కంట్రోల్ (తినే పరిమాణం) చాలా అవసరం. రోజుకు ఒక మీడియం సైజ్ మామిడి పండును మాత్రమే తినాలి.
ఇది ఎందుకు బాగా పనిచేస్తుందంటే..
శరీరంలోని కొవ్వును కరిగించడం అనేది కేవలం ఒక పండును మానేయడం వల్ల జరిగే ప్రక్రియ కాదు. రోజంతా మనం ఎన్ని కేలరీలు తీసుకుంటున్నాం? ఎంత పరిమాణంలో తింటున్నాం? అనే దానిపైనే మన బరువు ఆధారపడి ఉంటుంది. పైగా బరువు తగ్గే ప్రయాణంలో మనకు తీపి తినాలనిపించినప్పుడు బేకరీ స్వీట్స్, చాక్లెట్స్ తినే బదులు.. ఒక మామిడి పండు తినడం వంద రెట్లు మేలు.
మామిడిలో పుష్కలమైన ఫైబర్ (పీచు పదార్థం), విటమిన్లు, సహజసిద్ధమైన తీపి ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. చివరగా నమన్ మాటల్లో చెప్పాలంటే.. మామిడి పండును చూసి భయపడకండి. సరైన పద్ధతిలో తినండి, మోతాదును అదుపులో ఉంచుకోండి. మీ కొవ్వు తగ్గే ప్రక్రియ ఆటంకం లేకుండా సాగుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications