Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
చూయింగ్ గమ్‌తో ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలిస్తే.. నములుతూనే ఉంటారు
క్రికెట్ లాంటి క్రీడలతో పాటు మరికొన్ని ఆటల వేళ క్రీడాకారులు నోట్లో ఏదో వేసుకుని నములుతూ ఉండటం చాలా మంది గమనించే ఉంటారు. ఒత్తిడి సమయంలో చూయింగ్ గమ్ నమలడం ద్వారా స్ట్రెస్ తొలగిపోతుందని అంటారు. అందుకే ఇలా చూయింగ్ గమ్ నములుతుంటారు.
అయితే చూయింగ్ గమ్ తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని కొంత మంది, సమస్యలు వస్తాయని మరికొంత మంది అంటుంటారు. చూయింగ్ గమ్ ల వల్ల సమస్యలు తప్పవని హెచ్చరిస్తుంటారు కూడా. కానీ చూయింగ్ గమ్ నమలడం ద్వారా పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

కేలరీలు కరుగుతాయి:
చూయింగ్ గమ్ నోట్లో వేసుకుని నమిలినప్పుడు దవడలు ఆడించాల్సి వస్తుంది. దీని వల్ల ముఖ కండరాలకు మంచి వ్యాయామం చేసినట్లు అవుతుంది. అలాగే ఇలా చేయడం వల్ల కేలరీలు కరుగుతాయి కూడా. అయితే బరువు తగ్గడానికి నోట్లో చూయింగ్ గమ్ వేసుకుని అదే పనిగా నమిలినా సరిపోదని గుర్తుంచుకోవడం ముఖ్యం. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, సరైన క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, డైట్ పాటించడం లాంటి చర్యలతో పాటు చూయింగ్ గమ్ కూడా చేర్చుకుంటే లాభం ఉంటుంది.
చూయింగ్ గమ్ ఆకలిని అణచివేస్తుంది:
చూయింగ్ గమ్ నమలడం ద్వారా ఆకలి తగ్గుతుంది. దీని వల్ల ఆటోమేటిక్ గా తక్కువ తింటారు. తక్కువ తినడం బరువు తగ్గడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా మెదడుకు మేలు చేస్తుంది. చూయింగ్ గమ్ నమలడం ద్వారా ఒత్తిడి కూడా తగ్గుతుంది. ఆహారం తిన్న తర్వాత కొద్ది సేపటికి చాలా మందికి ఆకలి వేయడం మొదలవుతుంది. ఏదో తినాలన్న కోరిక కలుగుతుంది. చిరుతిండ్లు తినడం వల్ల అదనపు కేలరీలు చేరి బరువు పెరుగుతారు. అలాంటి సమయంలో చూయింగ్ గమ్ నమలడం వల్ల ప్రయోజనం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. చూయింగ్ గమ్ నమలడం ద్వారా ఆకలి తగ్గుతుంది. దీని వల్ల అతిగా తినడం కూడా తగ్గుతుంది.
ముఖంలోని కొవ్వు కరుగుతుంది:
కొందరి ముఖంపై కొవ్వు పేరుకుపోయి ముఖ ఆకృతి దెబ్బ తింటుంది. అలాగే చెక్కిళ్ల వద్ద సరైన ఆకృతి లేక అందవిహీనంగా కనిపిస్తుంది. అలాంటి వారికి చూయింగ్ గమ్ నమలాలని సిఫార్సు చేస్తారు. చూయింగ్ గమ్ నమలడం ద్వారా దవడలు కదులుతూ ఉంటాయి. దీని వల్ల అక్కడ ఉండే కొవ్వు కరుగుతుంది.
అలసటను పోగొడుతుంది:
చూయింగ్ గమ్ నమలడం ద్వారా అలసట దూరం అవుతుంది. నోట్లో చూయింగ్ గమ్ వేసుకుని నమిలినప్పుడు లాలాజలం ఉత్పత్తి అవుతుంది. దాంతో పాటు హార్మోన్లు విడుదల అవుతాయి. ఈ హార్మోన్ల వల్ల అలసట తగ్గి తక్షణ శక్తి ఉత్పత్తి అవుతుంది.
నోటి దుర్వాసన తొలగిపోతుంది:
నోటి దుర్వాసన ఇబ్బంది పెడుతుంటే.. చూయింగ్ గమ్ కంటే మంచి ప్రత్యామ్నాయం మరొకటి లేదు. చూయింగ్ గమ్ నములుతున్నప్పుడు ఉత్పత్తి అయ్యే లాలాజలం నోట్లోని దుర్వాసనను పోగొడుతుంది. దాని వల్ల కాసేపట్లోనే దుర్వాసన పోయి తాజా శ్వాస వస్తుంది.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications