Latest Updates
-
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.!
Weight Loss Tips: ఈ తప్పులు చేస్తే అస్సలే బరువు తగ్గరు, అవేంటో తెలుసుకుని ఇప్పుడే ఆపేయండి
బరువు తగ్గాలన్న ప్రయత్నం అభినందించాల్సిందే. ఆరోగ్యకరమైన బరువును మెయింటైన్ చేయడానికి ఇతరులు పడే కష్టాన్ని ప్రోత్సహించాల్సి. అతిగా బరువు ఉండటం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. అది గుర్తించి బరువు తగ్గాలన్న నిర్ణయం తీసుకోవడం, అందుకు తగ్గట్లుగా కృషి చేయడం సాధారణంగా జరిగే ప్రక్రియ.
అయితే కొందరు ఎంత ప్రయత్నించినా బరువు తగ్గరు. రోజూ జిమ్‌కు వెళ్తుంటారు, డైట్ కూడా పాటిస్తారు. అయినా బరువు కొద్దిగా కూడా తగ్గరు. ఎందుకంటే అన్నీ కరెక్టుగా చేసినా.. కొన్ని చిన్న చిన్న పొరపాట్ల వల్ల బరువు కోల్పోవడం జరగదు. ఆ తప్పులేమిటో, వాటిని ఎలా నిలువరించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కేలరీలను ట్రాక్ చేయకపోవడం:
బరువు తగ్గాలనుకుంటే అన్నిటికంటే ముఖ్యమైనది కేలరీలను తగ్గించడం. కేలరీలు తీసుకోవడాన్ని తగ్గిస్తేనే బరువు తగ్గడం మొదలవుతుంది. అందుకోసం రోజు ఎన్ని కేలరీలు తీసుకుంటున్నాం అనేది గమినిస్తూ ఉండాలి. ఎన్ని కేలరీలు కరిగిస్తున్నాం, ఎన్ని కేలరీలు తీసుకుంటున్నాం అనేది ట్రాక్ చేసుకుంటూ ఉండాలి. బరువు తగ్గాలనుకునే వారి కేలరీ ఇన్‌టేక్ తక్కువుండేలా చూసుకోవాలి.
వ్యాయామాలను మార్చకపోవడం:
ఒకే వ్యాయామం చేస్తూ పోతే శరీరం దానికి అలవాటు పడిపోతుంది. మొదట్లో కరిగినన్ని కేలరీలు.. తర్వాత కరగవు. కేలరీ బర్నింగ్ తగ్గిపోతుంది. అందుకే ఒకే రకమైన వ్యాయామం కాకుండా వివిధ రకాల వర్కవుట్స్ ప్రయత్నించాలి.
ఏం తాగుతున్నామో కూడా ముఖ్యమే:
బరువు తగ్గాలనుకునే వారికి డైట్ ఎంత ముఖ్యమే.. ఏం తాగుతున్నామనేది కూడా అంతే కీలకం. కూల్ డ్రింక్స్, కార్బొనేటెడ్ వాటర్, షుగరీ డ్రింక్స్‌ల్లో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. బరువు తగ్గడమే మీ లక్ష్యమైతే వీటికి దూరంగా ఉండటం మంచిది.
తగినంత నిద్ర లేకపోవడం:
బరువు తగ్గడానికైనా, పెరగడానికైనా, ఆరోగ్యంగా ఉండటానికైనా రోజూ కంటి నిండా నిద్రపోవడం చాలా చాలా ముఖ్యం. శరీరానికి తగినంత విశ్రాంతి ఇస్తేనే అది దాని పనిని సవ్యంగా చేస్తుంది. తగినంత నిద్ర లేకపోవడం వల్ల శరీరం అలసిపోయి జీర్ణక్రియ మందగిస్తుంది. జీవక్రియ అలసిపోతుంది. దీని వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి.
ఒత్తిడితో సతమతం కావడం:
పనిలో, వ్యాపారంలో రోజువారీ కార్యకలాపాల వల్ల తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటున్నారు చాలా మంది. ఈ ఒత్తిడి చాలా ప్రమాదకరం. దీని వల్ల మొత్తం ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం పడుతుంది. ఒత్తిడి కార్టిసాల్ స్థాయిలు, అడ్రినలిన్ పెరుగుదలకు దారి తీస్తుంది. తర్వాత ఇది అడ్రినల్ ఫాటిగ్‌కు కారణం అవుతుంది. దీని వల్ల హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. ఇది శరీరంపై విపరీతమైన ప్రభావాన్ని చూపుతుంది.
బరువు తగ్గడం అసాధ్యమేమీ కాదు. అయితే దానికి పట్టుదల కావాలి. ఫలితాల కోసం ఓపికగా ఎదురుచూడాలి. కొన్ని తప్పులను సరిదిద్దుకుంటూ పోతే సులభంగా బరువు తగ్గవచ్చు. సరైన వ్యాయామం, సమతుల్యమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
