Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
నడుము నొప్పి వేధిస్తుందా? కిడ్నీలు ప్రమాదంలో ఉన్నాయేమో!
నడుం నొప్పి అనేది చాలామందిని వేధించే సమస్య. ముఖ్యంగా మహిళలు ఎక్కువగా ఈ సమస్యతో బాధపడుతుండటం మన చుట్టుపక్కల చూస్తుంటాం. ఆఫీసులో గంటల తరబడి కూర్చోవడం వల్లనో, ఇంట్లో చిన్న పనికి వంగినందువల్లనో. వెన్నునొప్పి, నడుమునొప్పి మనల్ని తరచూ పట్టి పీడిస్తుంటాయి. ఈ నొప్పిని మనం సాధారణంగా కండరాల పట్టేయడం లేదా వెన్నెముక సమస్యగా భావించి, ఏదో ఒక పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్ వేసుకుని లేదా కాస్త విశ్రాంతి తీసుకుని సరిపెట్టుకుంటారు.
మీ నడుము నొప్పి వెనుక ఒక ప్రమాదకరమైన కారణం దాగివుండొచ్చని మీకు తెలుసా? అదే కిడ్నీ సమస్య. ప్రతీ నడుమునొప్పి వెన్నెముకకు సంబంధించింది కాదు. చాలాసార్లు మూత్రపిండాల్లో రాళ్లు, ఇన్ఫెక్షన్లు లేదా వాపు వంటి సమస్యలు కూడా తీవ్రమైన నడుమునొప్పికి కారణమవుతాయి.

సాధారణ నడుమునొప్పికి, కిడ్నీ నొప్పికి తేడా ఏమిటి?
సాధారణంగా వచ్చే నడుమునొప్పి విశ్రాంతి తీసుకుంటే కాస్త అటూ ఇటూ కదిలితే లేదా మసాజ్ చేస్తే తగ్గుముఖం పడుతుంది. కూర్చున్నప్పుడు, లేస్తున్నప్పుడు నొప్పి తీవ్రత మారుతూ ఉంటుంది. కానీ కిడ్నీల వల్ల వచ్చే నొప్పి భిన్నంగా ఉంటుంది. ఇది నడుము కింది భాగంలో కాకుండా పక్కటెముకల కింద, నడుముకు కొంచెం పై భాగంలో, సాధారణంగా ఒక వైపు మాత్రమే మొదలవుతుంది. ఇది పైపైన కాకుండా లోపలి నుండి వస్తున్నట్లుగా తీవ్రంగా, పదునుగా ఉంటుంది. ఈ నొప్పి ఎంత విశ్రాంతి తీసుకున్నా, పొజిషన్ మార్చినా తగ్గని మొండి నొప్పి. క్రమంగా దాని తీవ్రత పెరుగుతూనే ఉంటుంది.
ఈ లక్షణాలు కనిపిస్తే అప్రమత్తమవండి
కేవలం నొప్పినే కాకుండా, దానితో పాటు కొన్ని ఇతర లక్షణాలు కూడా కనిపిస్తే అది కిడ్నీ సమస్యకు సంకేతం కావచ్చు. వెంటనే డాక్టర్ ని సంప్రదించడం చాలా అవసరం.
మూత్ర విసర్జనలో సమస్యలు: తరచుగా మూత్ర విసర్జనకు వెళ్లాల్సి రావడం, మూత్రంలో మంట లేదా నొప్పి, మూత్రం ముదురు రంగులో లేదా దుర్వాసనతో రావడం కిడ్నీ సమస్యకు సంకేతం.
జ్వరం: విపరీతమైన చలితో కూడిన జ్వరం రావడం కూడా ఒక సంకేతమే.
వికారం,వాంతులు: నొప్పితో పాటు వికారంగా అనిపించడం లేదా వాంతులు కావడం. ఈ లక్షణాలు గనుక మీకు కనిపిస్తే దానిని కేవలం సాధారణ నడుమునొప్పిగా కొట్టిపారేయకండి. అశ్రద్ధ చేస్తే సమస్య తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. సరైన సమయంలో డాక్టర్ ని సంప్రదించి కారణం తెలుసుకోవడం మీ ఆరోగ్యానికి అత్యంత ముఖ్యం.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications