Latest Updates
-
బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే ఉదయాన్నే ఈ ప్రోటీన్ రిచ్ పరాఠా ట్రై చేయండి..సొరకాయ రైతాతో కేక! -
ఈ రాశుల వారికి ఈరోజు ధనయోగం.. ఆదాయం పెరగడమే కాదు అదృష్టం కూడా తోడవుతుంది! -
హ్యాపీ హనుమాన్ జయంతి..మీ బంధుమిత్రులకు పంపేందుకు బెస్ట్ విషెస్, వాట్సాప్ స్టేటస్ లు ఇవే! -
వైధృతి యోగం ఎఫెక్ట్.. ఈరోజు హైదరాబాద్, విజయవాడ వాసులు ఈ తప్పులు అస్సలు చేయకండి! -
హనుమాన్ దీక్ష విరమణ చేస్తున్నారా? స్వామివారి అనుగ్రహం పొందాలంటే ఈ నియమాలు, ముహూర్తాలు తప్పక పాటించండి! -
చంద్రుడు మీన రాశిలోకి ప్రవేశం: ఈ రాశుల వారికి అదృష్టం, ధనలాభం.. మీ రాశి ఉందా? -
వృశ్చికం, మీన రాశుల వారికి ధన యోగం.. ఈ 3 రాశుల వారు జాగ్రత్త! - మంగళవారం, 12 మే 2026 -
వంట నూనె తగ్గించండి.. ప్రధాని మోదీ పిలుపు వెనుక మాస్టర్ ప్లాన్ ఇదే! -
ఇడ్లీ, దోశ బోర్ కొట్టిందా? అయితే బ్రేక్ ఫాస్ట్ లో కొత్తిమీర పొంగలి ట్రై చేయండి..తయారీ విధానం ఇదే -
బంబుల్ యాప్లో ఇక స్వైపింగ్ లేదు! డేటింగ్ ప్రపంచాన్ని మార్చేయబోతున్న ఆ కొత్త AI ఫీచర్ ఇదే
డయాబెటిస్ ని సూచించే లక్షణాలపై అవగాహన ఉందా ?
డయాబెటిస్ ప్రస్తుతం అందరినీ భయపెడుతున్న వ్యాధి. ఒక్కసారి దీనిబారిన పడ్డాక మళ్లీ కోలుకునే ఛాన్స్ లు చాలా తక్కువ. అందుకే ప్రతి ఒక్కరు డయాబెటిస్ విషయంలో చాలా అలర్ట్ గా ఉండాలి. డయాబెటిస్ ని మొదట్లోనే గుర్తించడం వల్ల అదుపు చేయడం సులభమవుతుంది. ఏ చిన్న లోపం కనిపించినా.. మధుమేహం లక్షణాలు కనిపించినా.. వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి.
READ MORE: డయాబెటిస్ ను కంట్రోల్ చేసే హేర్బల్ హోం రెమెడీస్
రక్తంలో షుగర్ లెవెల్స్ అదుపు తప్పి అసాధారణ స్థితికి చేరినందు వల్ల వచ్చే సమస్యను డయాబెటిస్ గా పిలుస్తారు. ఇది బయటకు కనిపించని ప్రాణాంతక వ్యాధి . ఈ వ్యాధి ని మొదట్లోనే నియంత్రించకపోతే.. క్రమంగా దాని ప్రభావం శరీరంలోని ప్రతి భాగంపై పడుతుంది. దీనివల్ల రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది, రకరకాల ఇన్ఫెక్షన్లు, సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి షుగర్ వ్యాధిని తెలిపే లక్షణాలపై అవగాహన కల్పించుకోవడం మంచిది. డయాబెటిస్ ని తెలిపే సంకేతాలేంటో చూద్దాం..

బరువు తగ్గిపోవడం
బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగడం వల్ల అనుకోని విధంగా బరువు తగ్గిపోతారు. ఆహారం ద్వారా గ్లూకోజ్ ని మీ శరీరం సరిగ్గా గ్రహించకపోవడం వల్ల బరువు తగ్గిపోతారు. సడెన్ గా బరువు తగ్గిపోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. అలాగే ఎక్కువ ఆకలి అనిపించడం, ఎప్పుడూ తింటూ ఉండటం డయాబెటిస్ ని తెలిపే లక్షణం.

ఎక్కువ దప్పికవడం, తరచుగా యూరిన్ కి వెళ్లడం
తరచుగా యూరిన్ కి వెళ్లడం టైప్ టు డయాబెటిస్ ని సూచిస్తుంది. అది కూడా రాత్రిపూట ఎక్కువగా యూరిన్ కి వెళ్తున్నారంటే.. డయాబెటిస్ కి వార్నింగ్. ఎవరికైతే డయాబెటిస్ ఉంటుందో వాళ్ల రక్తంలో ఎక్కువ షుగర్ లెవెల్స్ ఉంటాయి. దీనివల్ల కిడ్నీలపై పని భారం పెరిగి.. వాటి పనితీరు కూడా దెబ్బతినే అవకాశముంది.

ఆకలి పెరగడం
చాలా మందికి డయాబెటీస్ ఉన్నా వాళ్లు గుర్తించలేకపోతున్నారు. షుగర్ వ్యాధిని సూచించే మరొక లక్షణం ఆకలి ఎక్కువగా ఉండటం. ఒకవేళ మీ బ్లడ్ సెల్స్ లో కావాల్సింత ఇన్సులిన్ లేకపోయినా, మీ శరీరానికి కావాల్సిన మోతాదులో గ్లూకోజ్ అందకపోయినా.. ఎక్కువ ఆకలి అనిపిస్తూ ఉంటుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గిపోయినప్పుడు నిరంతరం ఆకలిగా అనిపిస్తూ ఉంటుంది.

అలసిపోవడం
ఎప్పుడూ అలసిపోయినట్లు ఫీలవుతున్నారా ? అయితే ఒక్కసారి డయాబెటిస్ చెక్ చేసుకోవడం మంచిది. ఎక్కువ అలసట, నీరసం అనిపిస్తే.. టైప్ 2 డయాబెటిస్ కి సంకేతం. కిడ్నీలపై పని భారం పెరిగినప్పుడు ఎక్కువ అలసటకు గురవుతూ ఉంటారు. తరచుగా యూరిన్ కి వెళ్లాల్సి రావడం వల్ల సరిగా నిద్రకూడా పట్టకుండా ఇబ్బంది పడాల్సి వస్తుంది.

చూపు సమస్యలు
చూపు మందగించడం, మసకగా కనిపించడం అనేది డయాబెటిస్ ని సూచిస్తుంది. హై బ్లడ్ షుగర్ లెవెల్స్ ఉన్నప్పుడు చూపు సమస్యలు మొదలవుతాయి. శరీరం డీహైడ్రేట్ కి లోనయినప్పుడు ఫ్లూయిడ్ లెవెల్స్ పడిపోతాయి. దీనివల్ల కంటిచూపు మసకబారుతుంది. కాబట్టి రెగ్యులర్ గా ఐ చెకప్స్ చేసుకోవడం తప్పనిసరి.

ఇన్ఫెక్షన్స్
డయాబెటిస్ ని ముందుగానే గుర్తించడం చాలా అవసరం. లేదంటే నయం చేయడం కష్టమవుతుంది. అలాగే అనేక కాంప్లికేషన్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. తరచుగా ఇన్ఫెక్షన్లకు గురవడమనేది డయాబెటిస్ ని గుర్తించే ఒక లక్షణం. డయాబెటిస్ ఉందంటే.. రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. దీంతో ఇన్ఫెక్షన్ల నుంచి పోరాడలేకపోతుంది. డయాబెటిస్ ఉన్న వాళ్లలో సాధారణంగా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కనిపిస్తుంటుంది. బ్యాక్టీరియా, చీము కారడం వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి.

గాయాలు త్వరగా మానవు
చిన్న చిన్న గాయాలైనా, ఏ చిన్న దెబ్బ తగిలినా.. వెంటనే తగ్గిపోవు. మానడానికి ఎక్కువ సమయం తీసుకుంటోంది అంటే.. టైప్ టు డయాబెటిస్ ఉన్నట్లు గుర్తించాలి. లేదంటే.. వెంటనే డాక్టర్ ని సంప్రదించి టెస్ట్ లు చేయించుకోవడం మంచిది. కొన్ని వారాలు గడిచినా.. ఇంకా గాయాలు మానకపోతే.. గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయని, అవి రోగనిరోధక వ్యవస్థపై దుష్ర్పభావం చూపుతున్నాయని గమనించాలి.

తిమ్మిరిగా అనిపించడం, జలదరించడం
రక్తంలో షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే.. చాలా కాంప్లికేషన్స్ ఎదురవుతాయి. అందులో మొదటిది డయాబెటిస్. తరచుగా తిమ్మరిగా అనిపించడం, జలదరించినట్లు అనిపించడం అనేది డయాబెటిస్ కి సంకేతం. పాదాలు, చేతులు తిమ్మరికి లోనవుతుంటే.. టెస్ట్ కి వెళ్లడం మంచిది.

చర్మ సమస్యలు
టైప్ టు డయాబెటిస్ చాలా భయంకరమైనది. ఇది ఎటాక్ అయిందంటే.. శరీరంలోని అన్ని భాగాలపై ప్రభావం చూపుతుంది. శరీరం దాదాపు 70 శాతం నీటితో తయారై ఉంటుంది. డయాబెటిస్ ఉందంటే.. రక్త ప్రసరణపై ప్రభావం చూపుతుంది. దీనివల్ల డీహైడ్రేషన్ కి గురవ్వాల్సి వస్తుంది. దీంతో చర్మం దురదకు లోనవడం, గోళ్ల చుట్టూ ఇన్ఫెక్షన్స్ రావడం, మెడ చుట్టూ చర్మం నల్లగా మారడం వంటి సమస్యలు మొదలవుతాయి.

చిరాకు
అనవసరంగా చిరాకు పడటం అనారోగ్య సమస్యలను తెలుపుతుంది. ఎక్కువగా యూరిన్ కి వెళ్లడం, ఇన్ఫెక్షన్స్ కావడం, కోపానికి లోనవడం, అలసిపోవడం వంటి లక్షణాలు డిప్రెషన్ ని సూచిస్తాయి. ఇవన్నీ ఎనర్జీ లెవెల్స్ పడిపోయేలా చేస్తాయి. ఎక్కువ చిరాకుకు లోనవడం టైపు టు డయాబెటిస్ కి సంకేతం. కాబట్టి ఒక్కసారి హెల్త్ చెకప్ చేయించుకోవడం మంచిది.



Click it and Unblock the Notifications