Latest Updates
-
రాజస్థానీ మటన్ కర్రీకి అంత క్రేజ్ ఎందుకు? ఈ సింపుల్ రెసిపీని ట్రై చేస్తే మీకే అర్థమవుతుంది! -
మా దేశాన్ని అవమానిస్తావా? ఇటలీలో బంగ్లాదేశ్ వెయిటర్ కు చుక్కలు చూపించిన భారతీయ నారీమణులు -
అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటున్నారా.. మీకు కాబోయే భాగస్వామిలో ఈ సంకేతాలు చాలా డేంజర్.! -
ఆల్పైన్ డివోర్స్.. మహిళలను వణికిస్తున్న ఈ కొత్తరకం విడాకులు ఏంటి? -
వర్షాలొచ్చేశాయ్.. పేరెంట్స్‌కి అలర్ట్.. మీ పిల్లల స్కూల్ బ్యాగులో ఇవి తప్పనిసరి.! -
సర్వరోగ నివారిణి నేల వేము..ఈ ఆయుర్వేద మూలిక ప్రయోజనాలు తెలిస్తే వదిలిపెట్టరు! -
31 రోజుల ఆధ్యాత్మిక ప్రయాణం.. ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పండి: మీరు ఎంత మారారు? -
సలాడ్, జ్యూస్ లేదా స్టీమింగ్.. బీట్రూట్ను ఎలా తింటే ఎక్కువ లాభాలో తెలుసా.? -
వెల్లుల్లి ఘాటు,టమాటా పులుపు,గుడ్డు కమ్మదనం.. నోరూరించే టమాటా గార్లిక్ ఎగ్ రైస్! -
రోజువారీ ఆహారంలో వీటిని ఎక్కువగా తీసుకుంటున్నారా.?.. మీ కిడ్నీలు రిస్క్‌లో పడినట్లే.!
డయాబెటిక్ పేషంట్స్ కు స్వీట్ పొటాటో అందించే ఆరోగ్య రహస్యాలు
స్వీట్ పొటాటో (చిలగడ దుంప0 మధుమేహగ్రస్తులకు చాలా ఉపయోగకరమైనది. ఎందుకంటే వీటిలో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి . ఇవి శరీరంలో అవయవాలు డ్యామేజ్ అవ్వకుండా కాపాడుతాయి. మరియు స్వీట్ పొటాటోలో ఉండే విటమిన్ సి శరీరంలో గాయాలను నయం చేసి నరాలు దెబ్బతినకుండా రక్షణ కల్పిస్తుంది.
స్వీట్ పొటాటోలో విటమిన్ ఎ మరియు ఇ పుష్కలంగా ఉన్నాయి . డయాబెటి కారణంగా కంటి సమస్యలు ఎదుర్కొంటుంటే, చిలగడ దుంప అందుకు రక్షణ కల్పిస్తుంది. శరీరంలో ఇన్సులిన్ లెవ్స్ ను మరింత ఎఫెక్టివ్ గా తయారవ్వడానికి రక్తంలోని గ్లూకోజ్ లెవల్స్ ను తగ్గిస్తుంది.
మధుమేహంతో బాధపడేవారిలో స్వీట్స్ తినాలనే కోరికను ఆరోగ్యకరంగా సంత్రుప్తి పరుస్తుంది ఈ స్వీట్ పొటాటో . ఎందుకంటే వీటిలో హెల్తీ కార్బోహైడ్రేట్స్ మరియు ఫైబర్ ఉండటం వల్ల డయాబెటిక్ పేషంట్స్ కు చాలా ప్రయోజనకరం.
READ MORE: చిలకడ దుంప చేసే మేలు అంతా..ఇంతా కాదు..
స్వీట్ పొటాటోలో మినిరల్స్ మరియు పొటాషియం ఇంకా మెగ్నీషియం కూడా అధికంగా ఉండటం వల్ల హార్ట్ , మజిల్స్ మరియు కణజాలు ఆరోగ్యంగా ఉండటానికి, ఆరోగ్యంగా మెయింటైన్ చేయడానికి స్వీట్ పొటాటోలోని మినిరల్స్ గ్రేట్ గా సహాయపడుతాయి . ఇవి శరీరంలోని రక్తకణాల్లోని ఆక్సిజన్ సరఫరాను మెరుగుపరుస్తాయి. దానికి వల్ల డయాబెటిస్ కారణంగా డ్యామేజ్ అయ్యే అవయవ హానిని నియంత్రిస్తుంది.
మధుమేహంతో బాధపడే వారిలో స్వీట్ పొటాటలో వల్ల మరికొన్ని ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి . కాబట్టి, హెల్తీ స్నాక్ రూపంలో స్వీట్ పొటాటోను తీసుకొని డయాబెటిస్ ను నివారించుకోవచ్చు లేదా డయాబెటిస్ కు చికిత్సగా ఉపయోగించుకోవచ్చు.
డయాబెటిస్ వారికి స్వీట్ పొటాటో ఏవిధంగా ప్రయోజనాలను అందిస్తుందో చూద్దాం....

ఇన్సులిన్ సామర్థ్యాన్ని తగ్గిస్తుంది :
స్వీట్ పొటాటోలో నేచురల్ షుగర్స్ ఎక్కువగా ఉన్నందు వల్ల ఇది ఇన్సులిన్ సెన్సిటివిటి పెంచుతుంది . స్వీట్ పొటాటో కూడా బ్లడ్ షుగర్ లెవల్స్ ను రెగ్యులేట్ చేస్తుంది.

కళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుతుంది:
స్వీట్ పొటాటోలో ఉండే కెరోటినాయిడ్స్ శరీరంలో విటమిన్ ఎ గా మార్పుచెంది కళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఈ విటమిన్ ఎ డయాబెటిస్ వారికి చాలా ఉపయోగకరమైనది. ఒంట్లో అదనపు షుగర్ వల్ల కళ్ళు పాడవకుండా విటమిన్ ఎ రక్షణ కల్పిస్తుంది మరియు రెస్పిరేటరీ సిస్టమ్ ను పునరుత్పత్తి చేస్తుంది.

హెల్తీ బోన్ అండ్ స్కిన్:
స్వీట్ పొటాటోలో విటమిన్ డి అధికంగా ఉంటుంది. ఇది శరీరంలో ఎముకలకు, దంతాలు మరియు హార్ట్ కు చాలా మేలు చేస్తుంది . ఈ విటమిన్ డి డయాబెటిక్ పేషంట్స్ కు చాలా అవసరం అవుతుంది . విటమిన్ డి థైరాయిడ్ గ్రంథులు నార్మల్ గా పనిచేయడానికి కూడా సహాయపడుతాయి.

హెల్తీ మజిల్స్ మరియు కణజాలలు:
స్వీట్ పొటాటోలో పొటాసియం అధికంగా ఉండటం వల్ల ఇది కణాజాలాలు మరియు కండరాలు ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. మరియు ఇది మజిల్ వీక్ నెస్, మజిల్ క్రాంప్ మరియు వాపును నివారిస్తుంది . ఇంకా బ్లడ్ ప్రెజర్ ను తగ్గించడానికి పొటాసియం చాలా గ్రేట్ గా సహాయపడుతుంది.

శరీరంలో ఆక్సిజెన్ ప్రసరణను మెరుగుపరుస్తుంది:
స్వీట్ పొటాటలో ఉండే మెగ్నీషియం మరియు పొటాషియం రెండు రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది ఫలితంగా శరీరంలో ఉండే ప్రతి కణానికి మరియు కణజాలకలు ఆక్సిజన్ మరియు రక్తసరఫరాను మెరుగ్గా అందిస్తుంది . దీని వల్ల శరీరంలో ఆర్గాన్ డ్యామేజ్ అవ్వకుండా సహాయపడుతుంది మరియు ఒత్తిడిని స్థాయిలను తగ్గిస్తుంది.

వ్యాధినిరోధకతను పెంచి వ్యాధులను నయం చేస్తుంది :
స్వీట్ పొటాటలో ఉండే విటమిన్ సి డయాబెటిస్ లో ఉండే అనేక వ్యాధులను నయం చేస్తుంది. వ్యాధులు రాకుండా శరీరానికి రక్షణ కల్పిస్తుంది. ఈ విటమిన్ వ్యాధినిరోధకతను పెంచుతుంది మరియు చర్మం మరియు నరాల యొక్క సున్నితత్వానికి రక్షణగా నిలిచి డ్యామేజ్ జరగకుండా కాపాడుతుంది.

డయాబెటిక్ పేషంట్స్ కు మంచి డైట్:
స్వీట్ పొటాటోలో అనేక విటమిన్స్ మరియు అధిక ప్రోటీన్స్ మరియు కార్బోహైడ్రేట్స్ కలిగి ఉన్నాయి. స్వీట్ తినాలనే కోరికను స్వీట్ పొటాటో తీరుస్తుంది. అందుకే ఇది డయాబెటిక్ వారికి హెల్తీ స్నాక్ అని చెప్పవచ్చు.

మెదడుకు మరియు గుండెకు రక్షణ కల్పిస్తుంది
స్వీట్ పొటాటలో విటమిన్ బి6 అధికంగా ఉండటం వల్ల స్ట్రోక్, హార్ట్ అటాక్ మరియు శరీరంలో ఇతర అవయవాలకు రక్షణ కల్పిస్తుంది .

ఫోలిక్ యాసిడ్ మరియు ఐరన్ :
స్వీట్ పొటాటోలో ఫోలిక్ యాసిడ్ మరియు ఐరన్ అధికంగా ఉండటం వల్ల ఇది అనీమియాను తగ్గిస్తుంది. రెడ్ బ్లడ్ సెల్స్ లో హీమోగ్లోబిన్ లెవల్స్ ను పెంచుతుంది మరియు ఫోలిక్ యాసిడ్ డెపిషియన్సీ వల్ల అనీమియా తగ్గిస్తుంది.

బరువు పెరగడం అరికడుతుంది:
స్వీట్ పొటాటోలో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మరియు మలబద్దకంను అరికడుతుంది . మరియు పొట్ట నిండుగా ఉన్న అనుభూతిని కలిగిస్తుంది. స్వీట్ పొటాటలో తిన్నప్పుడు మరేది తినాలనిపించదు మరియు ఆకలి పెరగనివ్వదు. దాంతో బరువు కంట్రోల్లో ఉంటుంది.



Click it and Unblock the Notifications