Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
నిద్రలేమి సమస్యతో డయాబెటిక్ ముప్పు
రోజూ సరిపడా నిద్ర, పౌష్టికాహారం హెల్తీ లైఫ్ స్టైల్ కి చిహ్నం. ఒకే ఈ రెండింటిలో ఏది గాడీ తప్పినా.. ముప్పే. జీవనశైలి ఆరోగ్యవంతంగా లేకపోవడం, చెడు అలవాట్లు, పౌష్టికాహారలోపం, వ్యాయామం లేకపోవడం, సరైన నిద్ర పొందలేకపోవడం వల్ల అనేక రకాల జబ్బులకు గురికావాల్సి వస్తుంది. నిద్రలేమి సమస్య కూడా సీరియస్ హెల్త్ డిజార్డర్లను సూచిస్తుంది.

నిద్రలేమి వల్ల శరీరంలో హైబ్లడ్ ప్రెజర్, హార్ట్ రిలేటెడ్ సమస్యలు, హార్ట్ బీట్ లో అవకతవకలు, హార్ట్ ఫెయిల్యూర్, స్ట్రోక్ వంటి సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా నిద్రలేమి కారణంగా డయాబెటిస్ బారిన పడే అవకాశాలున్నాయని తాజా అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. శరీరానికి, మెదడుకి కావాల్సిన నిద్ర అందకపోతే డయాబెటిస్ ముప్పు పొంచి ఉంటుందని స్టడీస్ తేల్చాయి. నిద్ర మరీ తక్కువైనా ఇబ్బందేనని, మరీ ఎక్కువైనా ఇబ్బందేనని అంటున్నారు. ఇలాంటి సమస్యలు ఉన్నవారిలో పురుషుల కంటే మహిళలకు డయాబెటిస్ ముప్పు ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు.

సగటున రోజుకు ఆరుగంటల నిద్ర అవసరమని, అంతకంటే రెండు గంటలు తక్కువగా గానీ, రెండు గంటలు ఎక్కువగా గానీ నిద్రపోతే టైప్-2 డయాబెటిస్ సోకే అవకాశాలు 15 శాతం ఎక్కువ అవుతాయని హార్వర్డ్ టీహెచ్ చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ నిపుణులు చెబుతున్నారు. అమెరికాలోని పలువురు మహిళలపై 14 ఏళ్ల పాటు నిర్వహించిన అధ్యయనాలు ఈ విషయం తేలింది. కాబట్టి.. నిద్ర విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications