Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
షుగర్ వ్యాధిని కంట్రోల్ చేయాలంటే డైట్ లో మెంతి ఆకులు..
మెంతి ఆకుల్లో క్యాల్షియం, ఫాస్పరస్, ఐరన్, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. దీన్ని ఉడకబెట్టి తీసుకోవడం వల్ల ఎక్కువ లాభాలు పొందవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. జీర్ణక్రియ సమస్యలు, కాలేయ సమస్యలకు ఈ మెంతి ఆకు చక్కటి పరిష్కారం. అలాగే రక్తం ఏర్పడటానికి కూడా ఇవి సహాయపడతాయి.
మగవాళ్ల ప్రత్యేక సమస్యలు దివ్వౌషదం ఫెనుగ్రీక్ ..!
డయాబెటిక్ పేషంట్స్ కి మెంతి ఆకు చక్కటి పరిష్కారం. షుగర్ తో బాధపడుతున్న వాళ్లకు బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగకుండా కాపాడుతుంది. కాబట్టి డయాబెటిక్ పేషంట్స్ ఈ మెంతి ఆకును రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. దీన్ని పప్పుతో కలిపి తీసుకుంటే.. ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చని సూచిస్తున్నారు. లేదా ఉదయాన్నే మెంతి ఆకు జ్యూస్ తీసుకోగలిగితే.. ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చు.

అలాగే మెంతి ఆకుల్లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు శ్వాసను తాజాగా ఉంచడంలో తోడ్పడతాయి. అందుకే ఈ ఆకుల్ని చూయింగ్ గమ్, మౌత్ ఫ్రెష్నర్స్, టూత్ పేస్ట్ తయారీలలో ఉపయోగిస్తారు. దీనిలో శ్వాసకోశ వ్యాధులను నిర్మూలించే గుణం సమృద్ధిగా ఉన్నాయి. మెంతి రసంలో జీర్ణశక్తిని పెంచే సత్తా ఉంటుంది. ఇందులోని యాంటీ సెప్టిక్ ప్రాపర్టీస్ చర్మ సంరక్షణకు తోడ్పడతాయి. మెంతి, నిమ్మరసం మిశ్రమాన్ని రోజూ ఒక గ్లాసు తీసుకుంటే శరీరంలోని మలినాలన్నీ బయటికిపోతాయని స్టడీస్ సూచిస్తున్నాయి.
షుగర్ వ్యాధి కంట్రోల్ చేసే శక్తి మెంతులకే సొంతం..

మెంతి ఆకును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. దగ్గు, వాంతులు, కీళ్ల నొప్పులు వంటి సమస్యలకు కూడా మెంతి ఆకు దివ్య ఔషధంలా పనిచేస్తుంది. మెంతి ఆకు ద్వారా ఎక్కువ మోతాదులో ఖనిజాలు, విటమిన్లు పొందవచ్చు. అలాగే ఇందులో శరీరానికి అవసరమైన పీచు పదార్థం కూడా లభిస్తుంది. కాబట్టి మలబద్ధకంతో బాధపడేవాళ్లు మెంతి ఆకును డైట్ లో చేర్చుకుంటే.. సమస్య తగ్గుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications