Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
చురుకుదనాన్నిచ్చే జోగింగ్.... ఎలా ప్లాన్ చేయాలి?

1. జోగింగ్ మొదలు పెట్టినపుడు అధిక దూరాలు జోగింగ్ చేయవద్దు. ప్రతి వారం కొద్దిపాటి అదనపు దూరాన్ని చిరునవ్వులు చిందిస్తూ పరుగెడుతూ వుండండి. షాపింగ్ చేయటానికి ఇష్టపడేవారైతే మార్కెట్ లో దొరికే సౌకర్యవంతమైన జోగ్ సూట్ ను ఖరీదు చేసి ధరించండి. మీ కొత్త దుస్తుల్లో ఎంతో హాయి ఫీలవుతారు.
2. పక్కన తోడు ఎవరూ లేరని మీ జోగింగ్ ఆపవద్దు. బదులుగా మీ కిష్టమైన మ్యూజిక్ ను వింటూ పరుగుపెట్టటమో లేదా బ్రేక్ ఇచ్చినపుడు మధ్యలో వార్తాపత్రిక చదువుకోడమో చేసి పక్కన తోడు లేని లోటును భర్తీ చేసుకోండి.
3. మీ జోగింగ్ సమయంలో పార్కులో జనాలు అధికంగా వుండి అసౌకర్యంగా వుందా? ఒక గంట ముందే మీరక్కడకు వెళ్ళి మీ జోగింగ్ పూర్తి చేయండి.
4. లేటుగా లేవటాన్ని ఇష్టపడేవారైతే కనీసం వారానికి నాలుగు రోజులే (సోమవారం నుండి గురువారం వరకు) జోగ్ చేయండి. కొత్తగా మొదలు పెట్టే వారికి ఇది చాలా మంచిది.
5. జోగింగ్ తర్వాత పని మొదలు పెట్టే ముందు ఒక గ్లాసెడు పండ్ల రసం లేదా మాల్ట్ వంటివి తీసుకొని కొద్ది సమయం రిలాక్స్ అవండి.
6. సాయంత్రం పనినుండి ఇంటికి వచ్చిన తర్వాత, కొద్దిపాటి వామ్ అప్ వ్యాయామాలు, అరబిక్స్ చేయండి. దీనితో రోజంతా మీకు చురుకుగా, ఆహ్లాదంగా వుంటుంది.
కొత్తగా మొదలుపెట్టే వారు మానసికంగా సిద్ధం చేసుకోవాలి. కారణాలు ఎన్నో చూపవచ్చు. కాని ఆరోగ్యానికి మించినది ఏదీ లేదన్న విషయం గుర్తుంచుకోవాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications