Latest Updates
-
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.! -
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్!
పవర్ యోగా తో ఆరోగ్య ప్రయోజనాలు!
యోగా అనేది ప్రపంచమంతా కూడా ఏ దేశంవారైనప్పటికి చేయటానికి ఇష్టపడతారు. యోగాసనాలను కూడా ఒక వ్యాయామంగానే చేయవచ్చు. సాధారణ వ్యక్తులేకాదు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ప్రముఖులు యోగా ఆచరించేందుకు ఇష్టపడతారు. మీ శరీరాన్ని, మైండ్ మరియు ఆత్మను రిలాక్స్ చేయాలంటే ఇది ఒక మంచి సాధనం. బరువు తగ్గాలనుకుంటూ, మరింత ఆహ్లాదంగా భావించాలనుకునేవారు పవర్ యోగా కూడా చేయవచ్చు. పవర్ యోగా కు సాంప్రదాయ యోగా కు కొద్ది వ్యత్యాసం ఉంటుంది. దీనిలో మానసిక, శారీరక, ఆధ్యాత్మిక ప్రయోజనాలు ఎన్నో ఉంటాయి. మీరు చేయవలసిందల్లా ఖచ్చితమైన నిర్ణయం తీసుకొని ప్రయత్నాలు పెడితే చాలు చక్కని ఆరోగ్యం మీ సొంతం అవుతుంది. మరి పవర్ యోగా ఆరోగ్య ప్రయోజనాలు ఎలా ఉంటాయో పరిశీలిద్దాం.
బరువు తగ్గటం - పవర్ యోగాలో కేలరీలు బాగా ఖర్చవుతాయి. బరువు తగ్గాలనుకునేవారికి ఇది ఎంతో తేలికైనది మరియు సమర్ధవంతమైనది. మీ శరీరంలోని అధిక బరువు కరిగిపోవాలంటే, పవర్ యోగా ఆచరించండి. దీనిని మీరు ఇంటి వద్దే చేయవచ్చు. లేదా యోగా తరగతులలో చేరి కూడా ఆచరించవచ్చు.

శరీరం తేలికైపోతుంది - పవర్ యోగా లో మీ శరీరంలోని అన్ని భాగాలు కదలిక చేయబడతాయి. మీ శరీరం దీనిలో చేసే ఆసనాలు అంటే, సాగతీయటం, వంగటం వంటి వాటితో ఎంతో తేలికవుతుంది. శరీరంలో నిల్వ ఉన్న కొవ్వు కరిగిపోతుంది.
శరీర జీవక్రియ పెరుగుతుంది - యోగా చేస్తే, శరీర మెటబాలిజం ఎంతో బాగుంటుంది. దీనికి కారణం పవర్ యోగా లో మన మైండ్ బాగా విశ్రాంతి పొంది మంచి ఆహ్లాదకరమైన భావనలు కలుగుతాయి. ఆ విధంగా మీరు శారీరకంగా, మానసికంగా ఎంతో చురుకుగా ఉంటారు.
బ్లడ్ సర్కులేషన్ - పవర్ యోగా లో మీకు బ్లడ్ సర్కులేషన్ బాగా పెరుగుతుంది. శరీర రక్తప్రసరణ పెరిగి వ్యాధులు దరికి చేరవు.
రోగ నిరోధకత పెరుగుతుంది - పవర్ యోగా రెగ్యులర్ గా సాధన చేస్తే, మీ శరీర రోగ నిరోధక వ్యవస్ధ మెరుగవుతుంది. అధిక ఆక్సిజన్ మీ శరీరంలోకి ప్రవేసిస్తుంది. ఇది మీ శరీరం తన జీర్ణ క్రియను మెరుగుపరచుకోటానికి, మలినాలను బయటకు వదిలేయటానికి పనికి వస్తుంది. దానితో జీర్ణక్రియ పెరిగి, మీ చర్మంలో మెరుపు కూడా ఏర్పడుతుంది.
వ్యాధులు కూడా నయం చేసుకోవచ్చు- మీకు కనుక కేన్సర్, ఆస్తమా, బ్రాంకైటిస్, సైనస్ లేదా నిద్రలేమి వంటివి ఇప్పటికే ఉంటే, పవర్ యోగాతో వీటిని సహజంగా నివారించుకోవచ్చు. రోగులైనప్పటికి మితంగా దీనిని ఆచరిస్తూ, తమ శరీరాన్ని మంచి ఆరోగ్యంలో ఉంచుకోవచ్చు.
ఒత్తిడి, డిప్రెషన్ - యోగాతో మీకు రోజులో వచ్చే ఒత్తిడి, మానసిక వేదన వంటివి తగ్గించుకోవచ్చు. పని ఒత్తిడి మీకు కోపం తెప్పిస్తూంటుంది. అటువంటపుడు ఇది బాగా పనిచేస్తుంది. జంటలమధ్య వివాదాలు రాకుండా వారు మనోవేదనకు గురికాకుండా ఉంటారు. అటువంటి మానసిక సమస్యలకు మీరు తప్పక యోగా ప్రయత్నించండి. సమస్యలు తగ్గటమే కాక, మానసిక, శారీరక విశ్రాంతి దొరుకుతుంది.
పవర్ యోగాతో ఈ ఆరోగ్య ప్రయోజనాలు మీకు చేకూరుతాయి. రోజూ చేస్తే, మరింత ఫిట్ గా చురుకుగా ఉంటారు. నిద్ర సరిగా పట్టని వారికి యోగాతో చక్కటి నిద్ర పట్టి మరుసటి రోజు హాయిగా ఉంటుంది. కనుక పవర్ యోగా తప్పక ఆచరించండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications