Latest Updates
-
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.!
ఉపవాసాలు బరువు తగ్గడానికి సహాయపడుతాయా...?
ఒక్కో సందర్భంలో మనం క్రమంగా బరువు పెరుగుతాం అయితే దాన్ని మనం దాన్ని గుర్తించలేం. కానీ ఏదో ఒక రోజు మాత్రం మనల్ని మనం అద్దంలో చూసుకోవడం వల్ల తెలుస్తుంది అసలు సంగతి. మనం బరువు పెరుగుతున్నామన్న టెన్షన్ అప్పుడు మొదలవుతుంది. దాంతో త్వరగా బరువు తగ్గాలని ఆ రోజు నిర్ణయం తీసుకుంటారు. అయితే బరువు పెరగడం చాలా సులభం, కానీ బరువు తగ్గడం అంత సులభతరం కాదు. మరి అంత త్వరగా మీరు బరువు తగ్గాలంనుకొంటే లైపోసెక్షన్, పిల్స్, మరియు ఉపవాసం వంటి హానికరమైన మరియు ఖరీదైన పద్దతులు మాత్రమే మన దగ్గర మిగిలి ఉన్నాయి.
మన భారతదేశంలో ఉపవాసం అనేదు బరువు కోల్పోవడానికి ఒక మార్గం, ముఖంగా ఈ ఉపవాసలు కొన్ని ప్రత్యేకమైన నెలలు కార్తీక మాసం, మాఘమాసం...వంటి నెల్లల్లో ఉపవాసం ఉంటారు. దాంతో వారు కొంత బరువును కోల్పోతారు. అయితే అనేక మంది క్రమం తప్పకుండా ఉపవాసం ఉండటం వల్ల బరువు కోల్పోవచ్చని హామీ ఇస్తుంటారు. మరి ఈ అన్ హెల్తీ డైయంటి ఆరోగ్యానికి మంచిదా?కాదా ఒక సారి చూద్దాం...
ఉపవాసాలు నిత్యం చేయడం వల్ల నీరసం, ఆహార సారం లేకపోవడం వల్ల శరీరంలో వ్యాధినిరోధకశక్తి తగ్గి అనేక ఇతర వ్యాధులు, బలహీనత ప్రవేశించే అవకాశాన్ని మనం ఇస్తున్నాం అని గ్రహించండి. మన చుట్టూ ఉన్న ప్రకృతిలోనే అద్భుత పోషకవిలువలు ఉండీ అధిక బరువును కరిగింపజేసే వస్తు సముదాయాల్ని భగవంతుడు భద్రపరిచాడు. వాటిని చూడగలిగిన శాస్త్రజ్ఞులు అవేమిటో గుర్తించి చూపించారు మనకి ఆయుర్వేద శాస్త్రరూపంలో. వాటిని వాడుకుంటూ కొంత ఆహారపు అలవాట్లని, కొంత జీవనవిధానాన్ని సవరించుకొని జీవిస్తే ఈ బరువు మనకి బరువైన సమస్య కాదు.

బరువు తగ్గడానికి ఉపవాసాలు మంచిదని కొంతమంది అపోహ పడుతూ ఉంటారు. తిండి తగ్గించి చేసే ఉపవాసాలు శరీరం బరువు తగ్గేందుకు కొంత సహకరిస్తాయి . ఉపవాసం పూర్తి కాగానే ఆవురావురుమంటూ తినడం వల్ల బరువు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. అధిక కొవ్వు, ప్రొటీన్లు లేని ఆహారం రెండు పూటలా తినవచ్చు. దీనికి తోడుగా క్రమం తప్పకుండా శరీర వ్యాయామం చేయడం వలన శరీరం బరువు తగ్గుతుంది. అధిక బరువుగల వ్యక్తులు మాత్రమే కాదు ఉపవాసాలు ఉండేది. అనారోగ్యం వచ్చినపుడు ‘లంకణం దివ్యౌషధం' అనే భావంతో రోగికి ఏమీ పెట్టరు. అటువంటి సందర్భాలలో రోగికి డీహైడ్రేషన్ వల్ల అనారోగ్య ప్రమాదం త్వరత్వరగా ఎదురుకావచ్చు.
సాధారణ మనుషులు ఉపవాసాలుండం వల్ల ఆరోగ్యకరమైన బరువు నష్టం కాదు బ్లడ్ కౌంట్ తగ్గుతుంది, రోగనిరోధక శక్తి మరియు మీ అందమైన చర్మం మీదా చాలా ప్రభావం చూపెడుతుంది. త్వరగా వయస్సు పైబడినట్లుగా కనబడుతారు. హెయిర్ ఫాల్, జుట్టు రంగు మారడం వంటి సమస్యలను ఎదుర్కోవల్సి ఉంటుంది. అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల అనేక చిక్కులు ఏర్పడుతాయి. కాబట్టి ఒకేసారి ఆహారాన్ని పూర్తిగా మానుకోవడం కంటే బరువు తగ్గడానికి ఆహారాన్ని క్రమేణా తగ్గించుకుంటూ రావాలి. అంతేగాని ఒకరోజున బరువు తగ్గాలని అనుకుని వెంటనే అన్నీ మానివేయడం సరైన పధ్ధతి కాదు. అలాగే త్వరగా బరువు తగ్గాలని ఉపవాసాలు చేయడం మరింత తప్పు. దానివల్ల కొంత విపరీత పరిణామాలు సంభవిస్తాయి. బరువు తగ్గ్గడానికి శ్రద్ధతో ఆహార నియమాలని పాటిస్తే తప్పక మంచి ఫలితం కనబడుతుంది. బరువు మొదటి దినాల్లో అంతగా తగ్గనట్లుగా అనిప్న్చినా పట్టుదల వీడకుండా నియమంగా భుజించుతూ ఉంటే బరువు తగ్గుతున్నట్లు తరువాత గమనించవచ్చు. బరువు ఎప్పుడూ ఒకే మిషను మీద చూసుకుంటూ ఉండాలి. ఒక్కొక్కసారి మిషను మీద బరువు చూసుకుంటూ ఉంటే తేడాలు వస్తూ ఉంటాయి. ఒకసారి బరువు తగ్గిన తరువాత కూడా ఆహార నియమాలని పాటిస్తూనే ఉండాలి. అంతేగాని తిరిగి అన్నీ తినివేయడం జరిగితే మళ్ళీ ఒళ్ళు వచ్చేస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications