Latest Updates
-
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.!
మీరు బరువు పెరగడానికి కారణమయ్యే 10 అలవాట్లు
తాజాగా మీరు బరువు పెరిగిపోయారా ? మీరు ఎందుకు ఉన్నట్టుండి లావయైపోయారో మీకు తెలుసా ? మీరు అకస్మాత్తుగా బరువు పెరగడానికి రోజూ మీరు ఫాలో అవుతున్న అన్ హెల్తీ హ్యాబిట్సే ప్రధాన కారణమని గ్రహించారా ? నిజమే... మీ అలవాట్లే.. మీ ఫ్యాట్ కి కారణం.
వర్క్ చేసే వాళ్లే ఎక్కువ మంది ఉన్నారు. అందులోనూ.. ఒత్తిడికి గురయ్యేవాళ్ల సంఖ్యా ఎక్కువే. ఈ ఒత్తిడే మీరు బరువు పెరగడానికి అతిపెద్ద కారణం. ఒత్తిడి నుంచి బయటపడటానికి రకరకాల ఆహారాలు, అన్ హెల్తీ ఫుడ్ తీసుకుంటూ ఉంటాం. ఇది బరువు పెరగడానికి కారణమవుతోంది.
మనం ఫాలో అవుతున్న లైఫ్ స్టైలే.. మనల్ని అనారోగ్యం పాలుచేస్తోంది. కాబట్టి మనం ఫాలో అవుతున్న ఎలాంటి అలవాట్లు మనల్ని బరువు పెరగేలా చేస్తున్నాయి. ఎలాంటి అలవాట్లు అనారోగ్యకరం. ఎలాంటి అలవాట్లకు దూరంగా ఉంటే.. అనారోగ్య సమస్యలు దూరంగా ఉంటాయో ఇప్పుడు చూద్దాం..

డ్రింక్స్
కూల్ డ్రింక్స్ తాగే అలవాటు బరువు పెరగడానికి ముఖ్య కారణం. ఎందుకంటే.. ఇవి లో ఫ్యాట్, నో క్యాలరీస్ అని చెబుతున్నా.. వీటిల్లో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అది ఆరోగ్యానికి మంచిది కాదు.

నిద్ర
అతిగా నిద్రపోవడం వల్ల లేజీగా మారి.. బరువు పెగరడానికి కారణమవుతుంది. అలాగే శరీరానికి కావాల్సినంత సేపు నిద్రపోకపోయినా.. అనారోగ్యకరమే. దీనివల్ల ఫ్యాట్ పెరుగుతుంది.

భోజనం మిస్ చేయడం
భోజనం అస్సలు మిస్ చేయకూడదు. ఎందుకంటే.. ఒకపూట తినకపోతే.. మళ్లీ తినేటప్పుడు చాలా ఎక్కువ తినేస్తారు. ఇలాంటి అలవాటు వల్ల ఈజీగా బరువు పెరిగిపోతారు.

టీవీ
భోజనం చేసేటప్పుడు టీవీ చూసే అలవాటు అత్యంత అనారోగ్యకరమైనది. ఎందుకంటే.. టీవీ చూస్తూ ఏది తిన్నా.. ఎక్కువ మొత్తంలో లాగించేస్తారు. దీనివల్ల బరువు పెరిగిపోతారు.

నీళ్లు
నీళ్లు తాగడం తగ్గిస్తే.. చాలా అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందులో మొదటిది బరువు పెరగడం. నీళ్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల మెటబాలిజంపెరుగుతుంది. శరీరానికి ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి.
రోజంతా యాక్టివ్ గా ఉంటారు.

ఒత్తిడి
ఒత్తిడికి ఎక్కువగా లోనవుతుంటే.. మీరు అనేక అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకున్నట్టే. ఒత్తిడి కేవలం బరువు పెరగడానికే కాదు.. అనేక హెల్త్ ప్రాబ్లమ్స్ కి కారణమవుతుంది.

నైట్ షిఫ్ట్స్
ఈ కాలంలో వర్క్ చేయడమంటేనే ఒత్తిడితో కూడినది. అందులోనూ నైట్ షిఫ్ట్స్ లేదా.. రాత్రిళ్లు ఎక్కువసేపు పనిచేస్తే.. బరువు పెరిగిపోతారు. కాబట్టి శరీరానికి కావాల్సిన రెస్ట్ ఇవ్వాలి.

లేజీ
రోజంతా యాక్టివ్ గా ఉండటం చాలా అవసరం. ఎప్పుడుపడితే.. అప్పుడు నిద్రపోయే అలవాటు ఉంటే వెంటనే మానేయండి. శరీరాన్ని ఫిట్ అండ్ యాక్టివ్ ఉంచుకోవడం చాలా అవసరం. దీనివల్ల క్యాలరీలు కరుగుతాయి.

డిప్రెషన్
డిప్రెషన్ లో ఉన్నప్పుడు ఫుడ్ మీ మూడ్ ని హ్యాపీగా మార్చేస్తుంది. కానీ.. అది చాలా బ్యాడ్ హ్యాబిట్. ఆహారం ఆనందం కలిగించినా.. బరువు పెరగడానికి కూడా కారణమవుతుంది. ఇది గుండె ఆరోగ్యానికి అసలు మంచిది కాదు.

ఫ్యాట్ కి దూరంగా ఉండటం
కాస్త ఫ్యాట్ తీసుకోవడం చాలా అవసరం. మంచి ఫ్యాట్స్ శరీరానికి చాలా అవసరం. అవి యాక్టివ్ గా ఉండటానికి, మెటబాలిజం పెంచడానికి సహాయపడతాయి. అలాగే ఇమ్యునిటీని పెంచుతాయి. అయితే బ్యాడ్ ఫ్యాట్స్ దూరంగా ఉండాలి.



Click it and Unblock the Notifications
