Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
అబ్బాయిల్లో ఈ 10 కండరాలంటే అమ్మాయిలు బాగా ఇష్టపడతారట!
ప్రతి అమ్మాయి తన కలల రాకుమారుడు ఇలా ఉండాలి అలా ఉండాలని కలలు కంటుంది. చాలా మంది మగవాళ్లు అమ్మాయిలను పడేసేందుకు కండలను పెంచేందుకు చూస్తుంటారు.
అయితే అసలు అమ్మాయిలు తమలో ఏం చూసి ఇష్టపడతారో తెలుసుకోలేక సతమతమవుతారు. మహిళలు మగవాళ్లలో ఇష్టపడే 10 కండరాల జాబితాను ఇస్తున్నాం. మరీ మీరు వీటిని బాగా పెంచి ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయండి.

1.విశాలమైన భుజాలు
ప్రతి అమ్మాయికి తనకిష్టమైన మగవాడి భుజాలపైన సేదతీరాలని రహస్యంగా కోరుకుంటుంది. విశాలమైన భుజాలు మగతనానికి ప్రతీకగా నిలుస్తాయి. వాటిని సొంతం చేసుకునేందుకు ప్రొటీన్లు కలిగిన ఆహారం బాగా తిని భుజాలకు సంబంధించిన వ్యాయామం బాగా చేయాలి.

2.బలమైన కండలు
బలమైన కండలు పెంచితే అమ్మాయిలు బాగా ఆకర్షితులవుతారు. మీరు కూడా చూడడానికి చక్కగా అనిపిస్తారు. అయితే బలమైన కండలు పొందాలంటే చాలా కష్టపడాలి. కష్టానికి తగ్గ ఫలితం దొరుకుతుంది. కండలు బాగా పెంచేందుకు వెయిటింగ్ బార్లతో కసరత్తు చేయాలి.

3. దృఢమైన మో చేతులు
కండల మాదిరిగానే మోచేతులను దృఢంగా ఉంచుకుంటే ఆడవారు బాగా ఇష్టపడతారు. బలమైన మోచేతులను బిల్డ్ చేసుకునేందుకు బరువులను అర చేతులతో ఎత్తాలి. ఎలాగంటే అరచేతులు ఎప్పుడూ కిందికి ఉండేలా బరువులు లేపాలి. ఈ క్రమంలో మోచేతులను మోకాలి కి సమాంతరంగా ఉండేలా చూసుకోవాలి. కాస్త కిందికి వంగి స్ట్రెచ్ చేసి ఆ తర్వాత మణికట్టును బాగా వెడల్పు చేయాలి. మెల్లమెల్లగా క్రమంగా ఇలా చేస్తే మోచేతులు బాగా గట్టిగా మారతాయి.

4. విశాలమైన ఛాతీ
విశాలమైన ఛాతీ సొంతం చేసుకునేందుకు ఎక్కువగా లైట్ బెంచ్ ప్రెస్, ఫ్లాట్ బెంచ్ ప్రెస్, ఇంక్లయిన్ బెంచ్ ప్రెస్‌లను చేస్తుండాలి.

5. పై వీపు భాగం
వీపు భాగాన్ని మెలితిరిగి కండలు చూపిస్తుంటే అమ్మాయిలు ఆహా ఓహో అనాల్సిందే. మాంఛి వీ షేప్‌లో బాడీ రావాలంటే చిన్ అప్స్, పుష్ అప్స్ బాగా కొట్టాలి.

6. యాబ్స్ః
మాంఛి యాబ్స్ రావాలంటే చాలా కష్టం. కడుపు భాగంలో కొవ్వు అంతా కరిగిపోతుంది కాబట్టి యాబ్స్ అంటే అబ్బాయిలు కూడా ఇష్టపడతారు. యాబ్స్ రావడానికి చాలా క్రమశిక్షణ కలిగి ఉండాలి. మంచి ఆరోగ్య కరమైన డైట్ తీసుకుంటుండాలి. సిక్స్ ప్యాక్ యాబ్స్ కోసమే ప్రయత్నించక్కర్లేదు. టోన్డు బాడీ ఉన్నా అమ్మాయిల కంటికి ఇంపుగానే కనిపిస్తారు.

7. మంచి ఆకారం గల పిరుదులు
మంచి ఆకృతిలో పిరుదులను చేసుకోవడం చాలా ముఖ్యం. నడుము కింది భాగంలో దృష్టంతా ఆ రెండింటి మీదే ఉంటుంది. కాబట్టి వాటి ఆకృతి తెచ్చుకునేందుకు సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. మాంచి దృఢమైన టోన్డు పిరుదులు సొంతం చేసుకునేందుకు వాటికి సంబంధించిన వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది.

8. తొడల మధ్య భాగం
కొందరు ఆడవాళ్లకు తొడల మధ్య భాగాన్ని బాగా ఇష్టపడతారు. వాటిని కూడా మంచి షేప్‌లో తీసుకురావచ్చు.

9. బలమైన కాళ్లు
మగవాడు పై భాగంలో మంచి కండలు తిరిగిన దేహం కలిగి ఉండి కింద కాళ్లు బక్కగా ఉంటే వికారంగా కనిపిస్తారు. అందుకే కాళ్లను నిర్లక్ష్యం చేయరాదు. కాళ్లకు మంచి ఎక్సర్‌సైజ్ కావాలంటే నడుము సమాంతరంగా ఉండేలా రెండు రాడ్ల మధ్య నిల్చోవాలి. చేతులను ఆసరాగా తీసుకొని కడ్డీల పై చేయి వేసి పైకి లేవాలి. ఆ తర్వాత కిందికి. నడుమును మాత్రం ఉన్న చోటే ఉంచాలి. కాళ్లను బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. ఆ తర్వాత మళ్లీ నిల్చున్న పొజిషన్‌లోకి రావాలి. ఇలా కొన్ని సార్లు చేస్తే కాళ్లు దృఢంగా మారతాయి.

10.దృఢమైన మోకాలి కండరాలు
మోకాలి కండరాలంటే దాదాపు ప్రతి స్త్రీ ఇష్టపడుతుంది. కాళ్లను మోకాలి వద్ద ఒంచి చేసే వ్యాయామాలు చేస్తే తీరైన దృఢమైన మోకాలి కండరాలు మీ సొంతమవుతాయి.
ఇవండి.. స్త్రీలు మగవాళ్లలో ఇష్టపడే కొన్ని కండరాలు.. వీటిని బలంగా చేసుకోవడం వల్ల అమ్మాయిలను సులభంగా ఆకర్షించుకోగలుగుతారు.



Click it and Unblock the Notifications