Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
దాల్చిన చెక్క తేనె మిశ్రమంతో ఎన్నో ఆరోగ్యప్రయోజనాలో మీకు తెలుసా..?
ఈ వేసవిలో కూల్‌డ్రింక్స్, గోలిసోడా లాంటి పానియాలు కాకుండా కొత్తగా ఆరోగ్యకరమైన డ్రింక్స్‌ను ట్రై చేయండి. నిమ్మరసం, చెరుకు రసం, పళ్ల రసాలు కూడా సాధారణమే. అయితే తేనెలో దాల్చిన చెక్క కలుపుకొని తాగితే బాడీని రీఫ్రెష్ మాత్రమే చేయకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయ్. ప్రతీఒక్కరి ఇంట్లో వంటగదిలో ఉండే ఈ దాల్చిన చెక్క అందరికీ అందుబాటులో ఉంటుంది. దీని కోసం ఎక్కువ ఖర్చుపెట్టవలసిన అవసరం కూడా ఏర్పడదు. దాల్చిన చెక్కతో కలిగే ఆ ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.
బరువు అదుపులో
బరువును తగ్గించడానికి దీనికంటే మంచి డ్రింక్ లేదని చెప్పుకోవచ్చు. గోరువెచ్చని తేనె నీటిలో కొద్దిగా దాల్చిన చెక్కవేసుకొని ప్రతీ రోజు ఉదయాన్నే తాగితో బరువు త్వరగా తగ్గడమే కాకుండా పొట్టచుట్టూ కొవ్వు మాయమవుతుంది.
కొలెస్ట్రాల్ స్థాయి
శరీరంలో కొలస్ట్రాల్ స్థాయిని తగ్గించి రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. గుండెను ఆరోగ్యవంతంగా కూడా ఈ డ్రింక్ వుంచుతుందని వైద్యులు కుండబద్దలు కొడుతున్నారు.

శరీరంలో మంట
శరీరంలో మంట వేడిని కూడా ఈ దాల్చినచెక్క తేనె పానియం తగ్గిస్తుందని ఆయుర్వేదంతో పాటు ఆధునిక వైద్యులు కూడా చెబుతున్నారు.
చర్మ ఆరోగ్యం
ఇది చర్మ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. తేనె దాల్చిన చెక్క నీళ్లు తాగినా లేక ఆ మిశ్రమాన్ని అలాగే చర్మంపై రాసుకున్నా చర్మం కాంతివంతమౌతుంది. యాక్నె, చర్మం పగలడం కూడా తగ్గుతుందని సూచిస్తున్నారు.
అల్సర్లు
కడుపులో అల్సర్లు రాకుండా చేస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అసిడిటీ లాంటి ఇతర కడుపు జీర్ణ సమస్యలు ఏవి ఉన్నా ఈ దాల్చినచెక్క తేనె పానియంతో తొలగిపోతాయ్.
ఆరోగ్య సంజీవినీ
ప్రతి రోజు ఓ కప్పు తేనెనీటిలో దాల్చిన చెక్క వేసుకొని ఓ నెలపాటు తాగి ఆ ఫలితాన్ని తెలుసుకోవచ్చు. ఒకేసారి గుండె, చర్మం, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
రోగనిరోధక శక్తి
రోగనిరోధక శక్తిని కూా పెంచే సామర్ధ్యం ఈ పానియానికుంది. హానికరమైన వైరస్‌లను, బ్యాక్టీరియాను నశింపచేసే శక్తి ఈ మిశ్రమానికి ఉంది.
యాంటీ ఆక్సిడెంట్లు
దాల్చిన చెక్క తేనె పానియంలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ ఉండడంతో ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే ఆరోగ్యసమస్యల నుంచి బయటపడతాం. శరీరంలో ఏదైనా వాపు తున్న వెంటనే తగ్గిస్తుంది.
హైడ్రేషన్
దాల్చిన చెక్క తేనె మిశ్రమాన్ని తాగడం వల్ల శరీరం డీహైడ్రేట్ కాకుండా ఉంటుంది. ప్రతీ రోజు ఈ కషాయాన్ని తాగితే మీరు డీహైడ్రేట్ అయ్యే అవకాశమే ఉండదు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications