Latest Updates
-
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా?
థైరాయిడ్ తో నిద్రలేమి సమస్యలు: లక్షణాలు-జాగ్రత్తలు
ప్రస్తుతం చాలా మందిని పీడిస్తున్న సమస్య నిద్రలేమి. దీనినే వైద్య పరిభాషలో 'ఇన్‌సోమ్నియా' అంటారు. అయితే థైరాయిడ్‌తో బాధపడే వారిలో నిద్రలేమి సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. థైరాయిడ్‌గ్రంథి నాలుకకు మొదట్లో గొంతు భాగంలో సీతాకొక చిలుక ఆకారంలో ఉంటుంది. మానవ శరీరంలో ఈ గ్రంథి అతి ప్రధానమైనది. ఇది శరీరంలోని జీవక్రియలన్నింటిపైనా ప్రభావం చూపుతుంది. పిట్యూటరీ గ్రంథి ఆధీనంలో ఉండే ఈ గ్రంథి ముఖ్యంగా థైరాక్సిన్, ట్రైఐడో థైరోనిన్, కాల్సిటోనిన్ అనే మూడు రకాల హార్మోన్లను విడుదల చేస్తుంది. ఇవి జీవ క్రియల సమతుల్యతను కాపాడటంలో ప్రధానపాత్ర వహిస్తాయి. హర్మోన్‌ల సమతుల్యత లోపించినప్పుడు మానసిక ఒత్తిడి పెరిగి, నిద్రలేమి సమస్య ఏర్పడుతుంది. ఈ విధమైన సమస్యలు ఎదుర్కొంటున్నవారు ప్రతి నలుగురిలో ఒకరు ఉన్నారని ఇటీవలి సర్వేలు చెబుతున్నాయి. వినడానికి పెద్ద సమస్యగా అనిపించకపోయినా నిద్రలేమి అనేది వ్యక్తిని కృంగదీస్తున్న వాటిలో ముఖ్యంగా ఉంటోంది.
కారణాలు
మానసిక ఆందోళన ఎక్కువగా ఉండటం. సరైన ఆహారం తీసుకోకపోవడం. దాంపత్య జీవితం సరిగ్గా లేకపోవడం, నెగెటివ్ ఆలోచనలు పెరిగిపోవటం వంటి సమస్యలు థైరాయిడ్, నిద్రలేమికి దారితీస్తాయి. అసహజ వాంఛలు, దీర్ఘ కాలిక వ్యాధులు. ఆత్మన్యూనతా భావం వంటివి కారణం అవుతాయి..
థైరాయిడ్ గ్రంథిలో ముఖ్యంగా రెండు తేడాలు చోటు చేసుకుంటాయి. ఒకటి టి3, టి4 తగ్గి, టి.ఎస్.హెచ్ పెరగడం. దీనినే ప్రైమరీ హైపోథైరాయిడిజమ్ అంటారు. అలాగే టి.ఎస్.హెచ్. తగ్గడం లేదా నార్మల్‌గా ఉండి టి3, టి4 తగ్గడం దీనినే సెకండరీ హైపోథైరాయిడిజం అంటారు. రెండోది టి3, టి4 పెరగడంవల్ల హైపర్ థైరాయిడిజం వస్తుంది. ఇలా థైరాయిడ్ హార్మోన్‌ల అసమతుల్యత ఏర్పడటంవల్ల నిద్రలేమి సమస్య ఉత్పన్నం అవుతుంది.

లక్షణాలు
కంటి చుట్టూ నలుపు వలయాలు ఏర్పడతాయి. ఆయాసం, గుండె దడగా అనిపించడం, మానసికంగా ఆత్మన్యూనతతో బాధ పడటం వంటి సమస్యలు ఉంటాయి. వీరు నిద్రకు ఉపక్రమించిన తర్వాత కొంత సేపటికే నిద్ర నుండి మేల్కొని మళ్లీ ఎంత ప్రయిత్నించినా నిద్ర పట్టదు. నీరసం, బద్దకం, బరువు పెరగటం, ముఖం వాచినట్లుండటం, జుట్టు రాలడం, స్త్రీలలో రుతుక్రమం తప్పటం, చర్మం పొడిబారినట్లుండటం, మలబద్దకం, వంటి లక్షణాలు కనిపిస్తాయి. తలనొప్పి, చిరాకు, ద్వేషం, కోపం ఎక్కువగా ఉంటాయి. ఏ పనిపైనా శ్రద్ధ పెట్టకపోవడం, పనుల్ని వాయిదా వేయడం, ఏకాగ్రత లోపించడం, ఆకలి తగ్గిపోవడం, చదువుపై శ్రద్ధ తగ్గడం, నీరసంగా ఉండటం, తమలో తామే బాధ పడటం వంటి లక్షణాలు కనబడతాయి.
జాగ్రత్తలు
మొదటగా మానసిక ఒత్తిడి నివారణకు యోగా, మెడిటేషన్, ప్రాణాయామం నిత్యం చేయాలి. ఇలా చేస్తే మానసిక ప్రశాంతత కలిగి నిద్రలేమి తీవ్రత తగ్గుతుంది. పడుకోవడానికి రెండు గంటల ముందుగానే మంచి ఆహారం తీసుకోవాలి. ఫాస్ట్‌ఫుడ్స్, మసాలా పదార్థాలు, వేపుళ్లకు స్వస్తి పలికి పౌష్టికరమైన ఆహారం తీసుకోవాలి. ఆకుకూరలకు, వెజిటేబుల్స్, తాజా పండ్లు తీసుకోవటానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. వేళకు ఆహారం తీసుకుంటూ, సమయానికి నిద్ర పోతూ ఉండాలి. ప్రతిరోజూ వేకువజామున లేచి 45 నిమిషాలపాటు నడవటం అలవాటు చేసుకోవాలి. దీనివల్ల రక్త ప్రసరణ సరిగ్గా జరిగి, మనస్సు ఉత్తేజ పూరితంగా ఉంటుంది. నిద్రలేమితో బాధపడేవారు తమ చుట్టూ ప్రశాంత వాతావరణం ఉండేలా చూసుకోవాలి. అంతర్మథనాలకు దూరంగా ఉండటం, భావోద్వేగాలను, ఆలోచనలను, అభిప్రాయాలను అణిచిపెట్టకుండా ఎప్పటికప్పుడూ ఆత్మీయులతో పంచుకోవడం వంటివి చేస్తే నిద్రలేమి నుండి తొందరగా బయటపడవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications