Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
కాలేయంలో పేరుకున్న ఫ్యాట్ తొలగించే బెస్ట్ హోం రెమిడీస్
లివర్ డిసీజ్ అనేది ప్రాణాంతకమైనది. అయితే ఈ వ్యాధిని మొదట్లోనే కనుగొన్నట్లైతే.. దీన్ని నివారించవచ్చు. కాలేయంలో కొవ్వు చేరినప్పుడు దాన్ని హోం రెమిడీస్ ద్వారానే నివారించవచ్చు. లివర్ లో ఫ్యాట్ సెల్స్ చేరినప్పుడు వచ్చే డిసీజ్ ని ఫ్యాటీ లివర్ అని పిలుస్తారు. ఇవి లివర్ టిఫ్యూష్ పై ప్రభావం చూపడం వల్ల కాలేయం పనితీరు సక్రమంగా జరగదు. దీనివల్ల ప్రాణానికే ముప్పు ఏర్పడే అవకాశముంది.
కాలేయంలో కొవ్వు చేరినప్పుడు దానికి వాపు వస్తుంది. సాధారణంగా ఈ వ్యాధి ఒబెసిటీతో బాధపడే వాళ్లలో కనిపిస్తుంది. అయితే సన్నగా ఉన్న వాళ్లకు కూడా ఈ వ్యాధి వచ్చే అవకాశాలున్నాయి. కానీ ఒబేసిటీ, డయాబెటీస్ ఉన్న వాళ్లకు రావడానికి ఎక్కువ అవకాశాలున్నాయి. అలాగే మద్యం సేవించే వాళ్లకు కూడా ఈ వ్యాధికి అవకాశముంది. ఒకవేళ ఫ్యాటీ లివర్ డిసీజ్ తో బాధపడుతుంటే ముందుగా డాక్టర్ ని సంప్రదించాలి. అలాగే.. కొన్ని హోం రెమిడీస్ ద్వారా కూడా ఈ సమస్యను పరిష్కరించవచ్చు. వ్యాధి సోకిన మొదట్లోనే ఈ చిట్కాలు ప్రయత్నిస్తే మంచి ఫలితం ఉంటుంది.

వెనిగర్, వాటర్
ఒక కప్పు గోరువెచ్చని నీళ్లు తీసుకుని అందులో కొన్ని చుక్కల యాపిల్ సైడర్ వెనిగర్ కలపాలి. ఈ నీటిని రోజు భోజనానికి ముందు కొన్ని నెలల పాటు క్రమం తప్పకుండా తాగాలి. ఈ జ్యూస్ కాలేయంలో చేరిన ఫ్యాట్స్ ని బయటకు పంపుతుంది.

నిమ్మకాయ, నీళ్లు
ఒక నెలరోజుల పాటు నిమ్మరసం నీళ్లు తాగాలి. ఇందులో ఉండే విటమిన్ సి కాలేయంలో పేరుకున్న విషపదార్థాలను తొలగిస్తుంది. అలాగే కాలేయం పనితీరు కూడా మెరుగుపడుతుంది.

గ్రీన్ టీ
ఉదయం, సాయంత్రం ఒక కప్పు గ్రీన్ టీ తీసుకోవాలి. ఇది కాలేయం పనితీరుకి సహకరిస్తుందని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.

పసుపు, నీళ్లు
గోరు వెచ్చని నీటిలో ఒక టీ స్పూన్ పసుపు కలుపుకుని రోజుకి రెండుసార్లు 15 రోజుల పాటు తీసుకోవాలి. పసుపు కాలేయంలో పేరుకున్న ఫ్యాట్ ని తొలగించడానికి సహాయపడుతుంది.

ఉసిరికాయ జ్యూస్
ఉసిరికాయలో ఉండే విటమిన్ సి కాలేయంలో ఉండే టాక్సిన్స్ ని తొలగించడానికి సహకరిస్తుంది. కాబట్టి ప్రతి రోజు ఉదయాన్నే ఒక టీ స్పూన్ ఉసిరికాయ జ్యూస్ ని 25 రోజులపాటు తీసుకోవడం వల్ల మంచి ఫలితం పొందవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications