Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
ఆడవాళ్ళు నెలసరి సమయంలో ఇవి చెయ్యకూడదు
నెలసరి (పీరియడ్స్) సమయం లో ఆడవాళ్ళు కొన్ని పనులు చెయ్యరాదు.నెలసరి సమయం కొంత మంది ఆడవారికి ఇబ్బంది పెట్టకుండా అయిపోతే ఇంకొంతమంది నరకాన్ని చవిచూస్తారు. ఆ సమయం లో నెప్పి వస్తే చాలా అసౌకర్యం గా ఉంటుంది.దీనికి తోడు శరీరం లో జరిగే హార్మోన్ల మార్పుల వల్ల ఆడవాళ్ళకి పిచ్చెత్తినట్లు ఉంటుంది.అందువల్ల ఈ సమయంలో కొన్నింటికి దూరంగా ఉండటం మీకు, మీతో కలిసిమెలిసి తిరిగేవారికీ కూడా శ్రేయస్కరం.
READ MORE: ఇర్రెగ్యులర్ పీరియడ్స్ సమస్య నివారణకు ఉత్తమ హోం రెమెడీస్
నెలసరి సమయం లో ఆడవాళ్ళు చాలా ఒత్తిడికి లోనవ్వడం వల్ల ఒక్కోసారి వింతగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ ప్రవర్తనకి ఇదీ అని ఇతమిద్ధమైన వివరణ ఉండదు.రుతుస్రావం జరిగేటప్పుడు నీరసం, నిస్సత్తువతో ఉంటారు.అందువల్ల రుతుస్రావం జరిగే ఆ రోజుల్లో లేదా 8 రోజులపాటు కింద పేర్కొన్న పనులు చెయ్యకూడదు.ఇవి కాస్త వెర్రిలా అనిపించినా వీటిని పాటిస్తే మంచిది.

అసురక్షిత కలయిక
రుతుస్రావ సమయం లో కలవడం వల్ల గర్భం రాదని అపోహపడద్దు.ఈ సమయంలో గర్భం దాల్చే అవకాశాలు ఎక్కువే.పైగా ఇన్ ఫెక్షన్ లు రాకుండా నివారించడానికి కూడా ఈ సమయం లో కలయిక లో పాల్గొనకూడదు.

భోజనం మానెయ్యడం:
రుతుస్రావసమయం లో భోజననాన్ని మానకుండా తీసుకోవటం చాలా ముఖ్యం.ఈ సమయం లో మీలో రక్తస్రావం అవుతూ ఉంటుంది, అందువల్ల ఆహారం ద్వారా మాత్రమే శక్తి ని పొందగలుగుతారు.

శారీరక శ్రమ నుండి దూరం గా ఉండాలి:
రుతుస్రావ సమయంలో మీకు నడుము లేదా పొత్తికడుపు నొప్పి వస్తోంటే శారీరక శ్రమ ని తగ్గించుకుంటే మంచిది.లేదంటే ఈ శ్రమ మీ నెప్పిని మరింత పెంచుతుంది.

శానిటరీ నాప్ కిన్ తరచుగా మార్చుకోవాలి
ప్రతీ 3 గంటలకొకసారి మీ నాప్కిన్ ని మార్చుకుంటూ ఉండాలి. దీనివలల్ జననాంగ ఇన్ ఫెక్షన్లని, దుర్వాసననీ నివారించవచ్చు

అతిగా శుభ్రపరచుకోవద్దు:
కొంతమంది ఆడవాళ్ళు జననాంగాలని పదే పదే శుభ్రపరచుకుంటూ ఉంటారు ఆ సమయంలో. ఇది రుతుస్రావ సమయంలో చెయ్యకూడని పనుల్లో ఒకటి. మంచి బాక్టీరియా అక్కడ ఉండటం అవసరం.



Click it and Unblock the Notifications











