Latest Updates
-
స్వైపింగ్ ఇక లేదు! బంబుల్ యాప్‌లో వచ్చిన ఆ మార్పుతో డేటింగ్ స్టైల్ పూర్తిగా మారిపోతుందా? -
ఎండల వల్ల పీరియడ్స్ మిస్ అవుతున్నాయా? మహిళలు తప్పక తెలుసుకోవాల్సిన షాకింగ్ నిజాలు! -
నోట్లో వేస్తే వెన్నలా కరిగిపోయే దహీ లచ్చా పరాఠా.. దీన్ని ఎలా చేయాలో తెలుసా? -
అమ్మకు, భార్యకు మధ్య నలిగిపోతున్నారా? మదర్స్ డే రోజున ఈ బ్యాలెన్స్ ఎలాగో తెలుసా! -
మార్కెట్లో కొనే పనిలేదు.. 100% స్వచ్ఛమైన మామిడి పొడి తయారీ విధానం ఇదే -
ఆమె తెచ్చిన రోజే ఆమెకు భారమైంది.. మాతృదినోత్సవం వెనుక తెలియని నిజాలు! -
ఎండలు మండిపోతున్నాయి! గర్భిణులు ఈ చిన్న పొరపాట్లు చేస్తే ప్రమాదమేనా? -
గుండె పదిలం..కిడ్నీలు శుభ్రం..అంతులేని పోషకాలున్న ఈ జ్యూస్ తాగితే బోలెడు బెనిఫిట్స్! -
అకస్మాత్తుగా ధనలాభం..మే 10న ఈ రాశుల వారికి ఊహించని అదృష్టం వరించబోతోంది! -
గజకేసరి యోగం.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, ధన యోగంతో జాక్ పాట్!
యానల్ ఫిషర్/ఆనల్ ఫిషర్ చెప్పుకోలేని చోట బాధ... పంచుకోలేని వ్యధ!
యానల్ ఫిషర్ అంటే? మలద్వారం వద్ద చిన్న పగులులా కనిపించే ఇది ప్రారంభ దశలో మలద్వారం అంచునుంచి చిన్న చిరుగులా ఉంటుంది. అంటే ప్రారంభ దశలో ఇది కేవలం చర్మం పైపొరకు మాత్రమే పరిమితమవుతుందన్నమాట. ఈ దశలో ఎలాంటి చికిత్సా తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తే అక్కడి మృదువైన లోపలి పొరల్లోనూ పగుళ్లు ఏర్పడి చీరుకుపోయే ప్రమాదం ఉంది.
ఫిషర్‌లలో రకాలు: ఫిషర్ ఏర్పడిన వ్యవధిని బట్టి దీన్ని రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. మొదటిది అప్పటికప్పుడు కనిపించే అక్యూట్ ఫిషర్. రెండవది దీర్ఘకాలం పాటు కొనసాగుతూ బాధించేవాటిని క్రానిక్ ఫిషర్.
ఆక్యూట్ ఫిషర్ : ఇందులో తొలుత మలద్వారం బయటి చర్మం చీరుకుపోయినట్లుగా అవుతుంది. ఆ తర్వాత అక్కడి మెత్తటి కణజాలం పొరల (మ్యూకోజా)లో కూడా పగుళ్లు ఏర్పడినట్లు అవుతుంది. ఒకవేళ ఈ ఫిషర్‌కు తగిన చికిత్స తీసుకోకుండా అలాగే వదిలేసి, అలా చాలాకాలం పాటు ఉండి, అలాగే దీర్ఘకాలం కొనసాగే ఫిషర్ (క్రానిక్ ఫిషర్)గా గుర్తించవచ్చు.
క్రానిక్ ఫిషర్ : ఇలా దీర్ఘకాలం పాటు కొనసాగే క్రానిక్ ఫిషర్ నిర్దిష్టమైన లక్షణాలను కనబరుస్తుంది. ఉదాహరణకు మలద్వారాన్ని గట్టిగా పట్టేసినట్లుగా ఉంచి, బలంగా మూసుకుపోయేలా చేసే స్ఫింక్టర్ కండరాలు చీరుకుపోయినట్లుగా కనిపిస్తుంటాయి. ఫిషర్ చివరల్లో మలద్వారం వద్ద చీరుకుపోయిన చోట కండ పెరిగినట్లుగా ఉండి, దాని చివరభాగం బయటకు తోసుకొచ్చినట్లుగా
కనిపిస్తుంది.
యానల్ ఫిషర్ లేదా ఆనల్ ఫిషర్స్ లక్షణాలు : 1. మలవిసర్జన సమయంలో తీవ్రమైన నొప్పి వస్తుంది. ఇలా వచ్చిన నొప్పి ఆ తర్వాత కొద్ది గంటల సేపు బాధిస్తుంటుంది. 2. మలవిసర్జనకు వెళ్లిన ప్రతిసారీ నొప్పి తిరగబెడుతుంటుంది. దీంతో మలవిసర్జనకు వెళ్లాలంటేనే రోగి తీవ్రమైన ఆందోళనకు గురవుతుంటాడు. 3. మలవిసర్జనకు వెళ్లడానికి విముఖత చూపుతుంటాడు. ఫలితంగా మలబద్దకం ఏర్పడి, మలవిసర్జన క్రమం (సైకిల్) దెబ్బతినవచ్చు. పైగా మలవిసర్జనకు వెళ్లడానికి విముఖత చూపుతూ... మాటిమాటికీ ఆపుకోవడం వల్ల మలం మరింత గట్టిగా మారి, మలవిసర్జన మరింత బాధాకరంగా పరిణమిస్తుంది.
యానల్ /ఆనల్ ఫిషర్ నొప్పితో బాటు, నలుగురిలో చాలా ఇబ్బందిని కలిగించే సమస్య. అందుకే వచ్చాక దీనికి చికిత్స చేయించుకోవడం కంటే అసలు రాకుండానే నివారించుకోవడం మేలు. పైగా ఫిషర్‌ను నివారించుకోవడం చాలా సులువు కూడా. అంతే కాదు, ఫిషర్ ప్రారంభ దశలో ఉంటే కొన్ని హోం రెమెడీస్ గ్రేట్ గా సహాయపడుతాయి. ఈ హోం రెమెడీస్ నొప్పితో పాటు, ఫిషర్స్ ను కూడా కొన్ని రోజుల్లో మరియు కొన్ని వారాల్లో నయం చేస్తాయి.వీటిని ఉపయోగించిన తర్వాత కూడా ఎలాంటి మార్పు లేకుంటే వెంటనే డాక్టర్ ను సంప్రధించడం చాలా అవసరం.
యానల్/ఆనల్ ఫిషర్స్ తగ్గించుకోవడానికి మార్గాలు

1. ఆలివ్ ఆయిల్:
ఆలివ్ ఆయిల్లో హెల్తీ ఫ్యాట్స్ ఉన్నాయి. ఇది బౌల్ సిస్టమ్ కు లూబ్రికేట్ గా పనిచేస్తుంది. దాంతో స్టూల్ చాలా సులభంగా పాస్ అవుతుంది. ఇంకా ఆనల్ ఫిషర్స్ వల్ల వచ్చే నొప్పిని ఆలివ్ ఆయిల్లో ఉండే యాంటీఇన్ల్ఫమేటరీ లక్షణాలు నివారిస్తుంది.
అందుకు ఏం చేయాలంటే, ఆలివ్ ఆయిల్ తేనెను సమంగా తీసుకొని, ఆ ప్రదేశంలో వాక్సింగ్ లా అప్లై చేయాలి . అలాగే ఈ రెండింటి యొక్క మిశ్రమాన్ని వేడి చేసి, చల్లారిన తర్వాత ఆనల్ ప్రదేశంలో అప్లై చేయాలి . రోజులో రెండు మూడు సార్లు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

2. అలోవెర:
కలబందలో నేచురల్ హీలింగ్ పబర్ మరియు నొప్పి నివారించే లక్షణాలు మెండుగా ఉన్నాయి . ఇవి ఆనల్ ఫిషర్ యొక్క లక్షణాలను నివారించడంతో పాటు ఆ ప్రదేశంలో డ్యామేజ్ అయిన చర్మకణాలను రిపేర్ చేస్తుంది. అందుకు ఏం చేయాలంటే, కలబంద మొక్కనుండి ఒక ఆకును తీసుకొని, అందులోని జెల్ ను స్పూన్ తో తీసుకోవాలి. ఈ జెల్ ను ఎఫెక్టెడ్ ఏరియాలో అప్లై చేయాలి. ఇలా రోజులో నాలుగైదుసార్లు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

3. హాట్ సిట్జ్ బాత్:
ఆ ప్రదేశంలో నొప్పిని మరియు అసౌకర్యాన్ని నివారించుకోవడానికి హాట్ సిట్జ్ బాత్ గ్రేట్ గా సహాయపడుతుంది. ఈ బాతింగ్ వల్ల ఆ ప్రదేశానికి రక్తప్రసరణ మెరుగుపడుతుంది. దాంతో చర్మం మీద ఏర్పడిన చిన్న చిరుగులను నయం చేస్తుంది. మరియు ఇది నొప్పిని, వాపును మరియు దురదను నివారిస్తుంది. అందుకు ఏంచేయాలంటే? పెద్ద బాతింగ్ టబ్ లో గోరువెచ్చగా నీళ్ళు నింపాలి . తర్వాత అందులో కొద్దిగా ల్యావెండర్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేయాలి. బాత్ టబ్ లోని నీరు మీ నడుము వరకూ వచ్చే వరకూ నింపుకొని 15*-20నిముషాలు ఆ నీటిలో కూర్చోవాలి. ఇలా రోజులో రెండు మూడు సార్లు చేస్తే తక్షణ ఉపశమనం కలుగుతుంది.

4. కాంప్రే :
కాంప్రే ఒక పాపులర్ హెర్బల్ రెమెడీ . ఈ హెర్బ్ లో నయం చేసి గుణాలు మరియు నొప్పినివారించే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి . ఆనల్ ఫిషర్స్ తో బాధపడే వారు, కాంప్రే రూట్ మరియు ఆకులను హోం రెమెడీగా తీసుకోవచ్చు. వీటిలో మెడిసినల్ విలువలు అధికంగా ఉన్నాయి . ఇది స్కిన్ టిష్యులను రీజనరేట్ చేస్తుంది మరియు కణాల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. అందుకు చేయాల్సింది..డ్రైడ్ కాంప్రేను రూట్ లేదా ఆకులను వేడి నీటిలో వేసి బాగా మరిగించాలి. . వడగట్టి, చల్లారిన తర్వాత ఆ నీటితో ఎఫెక్టెడ్ ఏరియాను రోజుకు రెండుమూడు సార్లు శుభ్రం చేసుకోవాలి.

5. కొబ్బరి నూనె:
కొబ్బరి నూనె మరో హెల్ప్ ఫుల్ హోం రెమెడీ. ఈ నూనెలోని ట్రైగ్లిజరేట్ ఉండటం వల్ల చర్మంలోనికి చాలా తేలికగా షోషింపబడుతుంది, ఎఫెక్టెడ్ ఏరియాలో అప్లై చేయడం వల్ల లూబ్రికాంట్ గా పనిచేస్తుంది. మరియు నొప్పి, చిరుగును నయం చేస్తుంది . కొబ్బరినూనెను ఆనల్ ఫిషర్ ఏర్పడ్డ ప్రదేశంలో రోజుకు మూడు నాలుగు సార్లు అప్లై చేయాలి.

6. ఎల్-అర్జినైన్ జెల్:
ఎల్ ఆర్జినైన్ జెల్ లో అమినో యాసిడ్స్ అధికంగా ఉండటం వల్ల ఇది హీలింగ్ లక్షణాలను ప్రోత్సహిస్తుంది . ఈ జెల్ ను ఎఫెక్టెడ్ ఏరియాలో రోజులో రెండు మూడు సార్లు అప్లై చేస్తుండాలి.

7. యాపిల్ సైడర్ వెనిగర్:
మలబద్దకం, బౌల్ మూమెంట్ ప్రారంభంలో నొప్పి, ఇబ్బందిగా..కష్టంగా ఉండటం వల్ల ఆనల్ ఫిషర్ కు కారణం అవుతుంది . మలబద్దకానికి ఆపిల్ సైడర్ వెనిగర్ ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది . ఇందులో ఉండే పెక్టిన్ మరియు సోలబుల్ ఫైబర్ జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. రెండు చెంచాల ఆపిల్ సైడర్ వెనిగర్ ను ఒక గ్లాసు నీళ్ళలో మిక్స్ చేసి, తేనె మిక్స్ చేసి రోజూ రెండు సార్లు త్రాగాలి.

8. ఫ్లాక్స్ సీడ్స్:
ఫ్లాక్స్ సీడ్స్ లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి . మలబద్దకంను నివారిస్తుంది. ఫిషర్స్ ను నివారించే లాక్సేటివ్ గుణాలు కూడా ఉన్నాయి . ఒక చెంచా ఫ్లాక్స్ సీడ్స్ ను ఒక గ్లాసు నీళ్ళలో వేసి రాత్రి నిద్రించడానికి ముందు ప్రతి రోజూ ఒకసారి త్రాగాలి. ఇలా చేయడం వల్ల బౌల్ మూమెంట్ ను రెగ్యులేట్ చేస్తుంది.

9.పీచు(ఫైబర్ ఫుడ్స్)అధికంగా తీసుకోవాలి:
మనం తీసుకునే ఆహారంలో పీచు ఎక్కువగా ఉండే ఆకుపచ్చటి ఆకుకూరలు, తాజా పండ్లు, క్వీనా, ఓట్ మీల్, గోధుమరవ్వ, లెగ్యుమ్స్, గుమ్మడి, సన్ ఫ్లవర్ సీడ్స్ వంటివి ఎక్కువగా తీసుకోవడం, రోజులో ఎక్కువసార్లు మంచినీళ్లు తాగుతూ ఉండాలి. మలం గట్టిగా మారడానికి తోడ్పడే ఆహారపదార్థాలైన మసాలాలూ, మాంసాహారం, పచ్చళ్ల మోతాదును గణనీయంగా తగ్గించుకోవడం వంటి జాగ్రత్తలతో ఫిషర్‌ను సమర్థంగా నివారించుకోవచ్చు.

10. పరిశుభ్రత పాటించాలి:
మలవిసర్జన తర్వాత ఆ ప్రాంతాన్ని చక్కగా శుభ్రం చేసుకోవడం, పొడిగా ఉంచుకోవడం వంటి వ్యక్తిగత పరిశుభ్రత (పర్సనల్ హైజీన్) విధానాలను పాటించాలి. మలవిసర్జన తర్వాత టాయిలెట్ పేపర్‌తో శుభ్రపరచుకునే వారు చాలా మృదువైన వాటిని ఉపయోగించడం మేలు. ఒకవేళ అప్పటికే చిన్నపాటి ఫిషర్ ఉన్నవారు మలవిసర్జన సాఫీగా జరిగేలా అక్కడ ఒరిపిడిని తగ్గించే ల్యూబ్రికేటింగ్ ఆయింట్‌మెంట్స్ వాడాలి.



Click it and Unblock the Notifications