Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
చెవి సమస్యలను నివారించే 12 అద్భుత హోం రెమెడీస్..!
సహజంగా కొంత మందికి ప్రయాణాలంటే భయపడుతుంటారు. ఎందుకంటే ప్రయాణం చేసేప్పుడు వికారం వాంతులు అవుతాయి. మరికొందరికి లాంగ్ జర్నీ లేదా ప్లైట్ జర్నీ చేసినప్పుడు, చెవులు మూసుకుపోవడం, లేదా చెవి నొప్పి ఎదుర్కుంటారు. ఇది అసౌకర్యంగా మార్చడమే కాదు, నొప్పితో చాలా బాధిస్తుంది. కాబట్టి, మీరు తక్షణ పరిష్కారం కోసం వెతుకుతుంటే మాత్రం..అందుకు కొన్ని బెస్ట్ హోం రెమెడీస్ ఉన్నాయి. ఇవి క్లాగ్డ్ ఇయర్స్(చెవి దిబ్బడ)ను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతాయి.
చెవులు మూసుకపోయినప్పుడు చెవిలోపల గాలి చొరబిడిన సౌండ్ వస్తుంది. కొన్ని సదర్భాల్లో ఏమి వినపడకపోవచ్చ. కొంత మందిలో చెవిలోపల దురదగా , చెవిలో గుమిలి ఉన్నట్లు ఫీలవుతారు. ఇంకా చెవిలో నీరు కారుతున్నట్లు ఫీలవుతారు. ఇది ఎక్కువ సమయం ఉన్నట్లైతే వినికిడి లోపం ఏర్పడుతుంది. చెవులు సరిగా వినపడక, నొప్పి బాధిస్తుంది.
చెవులు మూసుకుపోవడానికి వివిధ రకాల కారణాలున్నాయి, చెవిలోపల ఈస్టాచియాన్ ట్యూబ్స్ మూసుకుపోవడం, చెవిలో ఒత్తిడి, ఎయిర్ ఫ్లో డిఫరెంట్ గా ఉండటం, కొన్ని సందర్భాల్లో వాక్స్(గుమిలి) చేరడం వల్ల కూడా ఇలా జరగుతుంది. క్లాగ్డ్ ఇయర్స్(చెవిదిబ్బడ)లేదా చెవులు మూసుకుపోవడానికి కారణమేదైనా కావచ్చు, త్వరగా ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా అవసరం. . అందుకు హోం రెమెడీస్ చాలా సింపుల్ గా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి . కాబట్టి నేచురల్ రెమెడీస్ ను ఎంపిక చేసుకోండం మంచిది.
క్లాగ్డ్ ఇయర్స్ ను నివారించే 12 హోం రెమెడీస్:

1. వెల్లుల్లి:
వెల్లుల్లి బెస్ట్ యాంటీబయోటిక్. ఒక టీస్పూన్ మస్టర్డ్ ఆయిల్లో నాలుగు వెల్లుల్లి రెబ్బలు చితగ్గొట్టి వేసి, వేడి చేయాలి. తర్వాత వడగట్టి, గోరువెచ్చగా ఉన్నప్పుడుచెవిలోకి రెండు మూడూ చుక్కలు వేయాలి. ఇదిచెవి దిబ్బడ, నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది.

2. ఆలివ్ ఆయిల్:
ఆలివ్ ఆయిల్ తీసుకుని , వేడి చేయాలి. కొన్ని చుక్కల ఆలివ్ ఆయిల్ ను మూసుకుపోయిన చెవిలో రెండు మూడుచుక్కలు వదలాలి. ఇది గ్రేట్ రిలీఫ్ ఇస్తుంది.

3. ల్యావెండర్ ఆయిల్ :
మరిగే నీటిలో కొన్ని చుక్కల లావెండర్ ఆయిల్ మిక్స్ చేసి, ఆ నీటితో ఆవిరి పట్టాలి. టవల్ లేదా బ్లాంకెట్ తో పూర్తిగా తలకు కప్పుకోవాలి.క్లాగ్డ్ ఇయర్స్ ను నివారించుకోవడానికి ఇది ఒక ఉత్తమ మార్గం.

4. హాట్ వాటర్ స్టీమ్:
నీటిని బాగా మరిగించి ఆవిరి పట్టాలి.రోజులో రెండు మూడు సార్లు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇది ఇయర్ వాక్స్ ను వదులు చేస్తుంది. ఇన్ స్టాంట్ గా రిలీఫ్ ఇస్తుంది.

5. గోరువెచ్చని నీరు:
చెవి నొప్పిగా లేదా చెవులు మూసుకున్నట్లు అనిపిస్తుంటే కొద్దిగా వేడినీటిని కాపడం పెట్టుకోవడం, లేదా వేడినీటితో ఆ బాగంలో శుభ్రం చేయడం చేయాలి.

6. ఆవలింపు:
చెవులు మూసుకుపోయినప్పుడు ఆవలించడం వల్ల చెవి కండరాలు, నరాలు వదులౌతాయి. ఆవలించినప్పుడు చెవుల మీద ఒత్తిడి కలిగి చెవులు బ్యాలెన్స్ అవుతాయి. ఇది మూసుకున్న చెవులను నేచురల్ గా క్లియర్ చేస్తుంది.

7. గోరువెచ్చగా సూప్:
చెవులు మూసుకుపోయినప్పుడు, గోరువెచ్చగా సూప్ తాగడం వల్ల నేచురల్ గా రిలీఫ్ కలిగిస్తుంది. మ్యూకస్ సాప్ట్ గా చేస్తుంది. దాంతో చెవుల్లో బ్లాక్స్ లేకుండా నివారిస్తుంది.

8. హాట్ స్పైసీ ఫుడ్స్:
హాట్ అండ్ స్పైసీ ఫుడ్స్ గ్రేట్ గా సహాయపడుతాయి. కారంగా ఉండే ఆహారాలను తిన్నప్పుడు ,కలిగే వేడి వల్ల చెవులు క్లియర్ అవుతాయి.

9. గోరువెచ్చగా సాల్ట్ వాటర్ ను గార్గిలింగ్ చేయాలి:
వేడి నీళ్ళలో ఉప్పు వేసి గార్గిలింగ్ చేయాలి. రోజులో రెండు మూడు సార్లు సాల్ట్ వాటర్ ను పుక్కలించడం వల్ల క్లాగ్డ్ ఇయర్స్ కు ఉపశమనం కలుగుతుంది.

10. టీట్రీ ఆయిల్:
బాయిలింగ్ వాటర్ లో కొద్దిగా టీట్రీ ఆయిల్ మిక్స్ చేయాలి. తర్వాత టవల్ తో తలను కవర్ చేస్తే టీట్రీ ఆయిల్ మిక్స్ చేసిన వాటర్ ను ఆవిరి పట్టడం వల్ల చెవి దిబ్బడ నుండి తక్షణ ఉపశమనం కలుగుతుంది.

11. ఆపిల్ సైడర్ వెనిగర్:
ఆపిల్ సైడర్ వెనిగర్ లో యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు ఎక్కువ. ఆపిల్ సైడర్ వెనిగర్ కొన్ని చుక్కల ఆల్కహాల్ మిక్స్ చేసి చెవి నొప్పిగా ఉన్నప్రదేశంలో అప్లై చేయాలి. 15 నిముషాల తర్వాత ఇయర్ బడ్స్ తో వాక్స్ ను తొలగించాలి. ఇది చెవి దిబ్బడ నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది.

12. వార్మ్ కంప్రెసర్:
జలుబు, దగ్గు నుండి ఉపశమనం పొందాలంటే వార్మ్ కంప్రెసర్ ను ఉపయోగించాలి. గోరువెచ్చని నీటిలో క్లీన్ గా ఉండే క్లాత్ నుడిప్ చేసి, నీరు పిండేసి, నొప్పి ఉండే ప్రదేశంలో కాపడంలా పెట్టాలి. ఇది మూసుకుపోయిన చెవులు తెరచుకునేలా చేస్తుంది.



Click it and Unblock the Notifications