Latest Updates
-
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.!
మొలల నొప్పి (Piles) నివారించే ఎఫెక్టివ్ న్యాచురల్ రెమిడీస్
మోషన్ వెల్లే సమయంలో బ్లడ్ పడటం మీరు గమనించారా? మీ సమాధానం అవును అయితే, వెంటనే నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్ ను కలవాలి. ఇది పైల్స్ (హెమరాయిడ్స్)లక్షణంగా గుర్తించాలి. అనస్ ప్రదేశంలో, ఆనల్ కనాల్ వద్ద వాపు ఉండి, మోషన్ వెళ్లడానికి ఇబ్బంది పెడుతుంది. ఇది పైల్స్ కు దారితీస్తుంది. ఆనస్ (మలవిసర్జన) ప్రదేశంలో బుడిపె వంటిది ఏర్పడి, చీలిపోయుంటుంది. దీన్ని లోయర్ పార్ట్ ఆనల్ కెనాల్ అని పిలుస్తారు.
దీన్ని అలాగే వదిలేయడం వల్ల ఆనల్ కెనాల్ లైనింగ్ వరకూ చీలిక ఏర్పడి రక్తకణం వరకూ వ్యాప్తి చెందుంతుంది. రక్త కణం పెద్దగా విస్తరించినప్పుడు, బుడిపె మరింత పెద్దదిగా మారి ఎక్కువ వాపు వస్తుంది. దీన్ని పైల్స్ అంటారు. పైల్స్ కు కారణం కొన్ని సందర్భాల్లో ఎలాంటి కారణం లేకుండానే, లేదా వారసత్వం లేకుండానే వస్తుంది.
అయితే దీనికి ఒకే ఒక ముఖ్యకారణం ఆనస్ ఆనల్ కెనాల్ మీద ఎక్కువ ప్రెజర్ పడటం. దీనికి కొన్ని సహజ లక్షణాలు మోషన్ వెళ్లిన సమయంలో మలంతో పాటు రక్తం పడుతుంది. అయితే అంత నొప్పిగా అనిపించదు. అయితే కొంత మందిలో ప్రమాదకర పరిస్థితుల్లో మ్యూకస్ డిశ్చార్జ్, ఇరిటేషన్, ఆనస్ చుట్టూ దురద, టాయిలెట్ వెళ్లి వచ్చినా తిరిగి పోవాలనిపించడం వంటి లక్షణాలు ఎక్కువగా కనబడుతుంటాయి.
పైల్స్ నివారించుకోవడానికి వివిధ రకాల మెడికేషన్స్ అందుబాటులో ఉన్నాయి. కానీ వీటన్నింటికంటే నేచురల్ రెమెడీస్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. వాటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. పైల్స్ నివారించుకోవడానికి 5 ఎఫెక్టివ్ నేచురల్ రెమెడీస్ ఈ క్రింది విధంగా ఉన్నాయి.

1. అలోవెర: కలబందలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పైల్స్ నుంచి చాలా వేగంగా ఉపశమనం కలిగిస్తుంది. ఇన్ఫ్లమేషన్ కు గురైన ప్రదేశంలో అలోవెర జెల్ ను కొద్దిగా అప్లై చేస్తే చాలు త్వరిత ఉపశమనం పొందుతారు. అలాగే వీన్స్ వాపుకు అప్లై చేయడం వల్ల కూడా వాపు తగ్గుతుంది.

2. టీట్రీ ఆయిల్ : కొన్ని చుక్కల టీట్రీ ఆయిల్ తీసుకుని, దానికి కొద్దిగా బాదం ఆయిల్ మిక్స్ చేసి ఇన్ఫ్లమేషన్ కు గురైన ప్రదేశంలో అప్లై చేయాలి. ఇది ఇన్ఫ్లమేషన్ తగ్గించడం మాత్రమే కాదు, పైల్స్ ను క్రమంగా తగ్గించేస్తుంది. అయితే ఈ ఆయిల్ క్రమం తప్పకుండా అప్లై చేస్తుండాలి.

3. సైల్యూమ్ సీడ్స్: ఫైబర్ ఎక్కువగా ఉన్న ఇలాంటి ఆహారాలు స్టూల్ ను మరింత సాప్ట్ గా మార్చి సులభంగా మోషన్ అయ్యేందుకు సహాయపడుతుంది. ఇందులో ఉండే ఫైబర్ కంటెంట్ స్టూల్ సులభంగా అయ్యేందుకు సహాయపడుతుంది. ఈ సీడ్స్ పైల్ వల్ల వచ్చే నొప్పిని కూడా తగ్గిస్తుంది. అలాగే బ్లీడింగ్ కూడా తగ్గిస్తుంది.

4. డ్రై మ్యాంగో సీడ్, తేనె: పైల్స్ నివారణకు డ్రైడ్ మ్యాంగో సీడ్ పౌడర్, తేనె రెండూ తీసుకోవడం వల్ల త్వరగా ఉపశమనం కలుగుతుంది. ఈ రెండింటి మిశ్రమాన్ని రోజుకు రెండు సార్లు తీసుకుంటే మంచిది.

5. అల్లం, పుదీనా, నిమ్మరసం, తేనె: అల్లం, పుదీనా, తేనె ఉత్తమ నేచురల్ రెమెడీస్ గా భావిస్తారు. ఇది వివిధ రకాల వ్యాధులను నివారిస్తుంది. ఫైల్స్ నివారణకు అల్లం, తేనె, కొన్ని పుదీనా ఆకులు, కొద్దిగా నిమ్మరసం తీసుకోవాలి. ఈ మిశ్రమాన్ని రోజుకు రెండు మూడుసార్లు తింటే మంచి ఫలితం ఉంటుంది. ఇది పైల్స్ వల్ల వచ్చే ఆనల్ పెయిన్, వాపు తగ్గిస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications