Latest Updates
-
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.?
పీరియడ్స్ కు, సంతానానికి అంతరాయం కలింగే ఓవేరియన్ సిస్ట్ లక్షణాలు..!
మహిళ ఆరోగ్య సమస్యల్లో ఓవేరియస్ సిస్టులు ఒకటి. ఇవి గర్భాధారణకు అంతరాయం కలిగించే నీటి తిత్తులు. వీటిని సైలెంట్ క్రీప్స్ అని అనవచ్చు. ఎందుకంటే ఇవి ఉన్నట్లు మహిళలకు తెలియదు. గర్భాశయంలో ఏర్పడే ఈ నీటితిత్తు
మహిళ ఆరోగ్య సమస్యల్లో ఓవేరియస్ సిస్టులు ఒకటి. ఇవి గర్భాధారణకు అంతరాయం కలిగించే నీటి తిత్తులు. వీటిని సైలెంట్ క్రీప్స్ అని అనవచ్చు. ఎందుకంటే ఇవి ఉన్నట్లు మహిళలకు తెలియదు. గర్భాశయంలో ఏర్పడే ఈ నీటితిత్తులు వారికిన్నట్లు తెలియదు, రెగ్యులర్ చెకప్స్ కు వెళ్లినప్పుడు లేదా గర్భధారణ చికిత్సను తీసుకునేటప్పుడు , లేదా పీరియడ్స్ లో హెచ్చుతగ్గులున్నప్పుడు డాక్టర్స్ కలిస్తే తెలుస్తుంది.
ఈ సిస్టులను మహిళలో అండోత్సర్గ సమయంలో గుర్తించవచ్చు. గర్భంలో అండం ఏర్పడినప్పడు ఈ సిస్టులు వాటికి రాసుకున్నప్పుడు, లేదా రెడు సిస్టుల మద్య అడ్డం ఒరుసుకున్నప్పుడు, అండం విచ్చిన్నమవుతుంది. దాంతో అండోత్సరం జరగదు. అండాలను ఫోలిసెల్స్ అని పిలుస్తారు. ఇవి రప్చర్ కాలేదంటే, అండంను విడుదల చేయడంలో విఫలమవుతుంది. ద్రవాలు అలాగే ఉండిపోతాయి. దాంతో ఓవరీస్ లో సిస్టులు పెరుగుతాయి. ఇవి ఓవరీస్ మీద కూడా ప్రభావం చూపుతాయి.
అలర్ట్: మహిలళలు ఖచ్చితంగా గుర్తించుకోవాల్సిన ఓవేరియన్ క్యాన్సర్ లక్షణాలు..!
అయితే ఈ నీటి తిత్తుల వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు. ఇవి నాన్ క్యాన్సేరియస్ లక్షణాలు కలిగి ఉంటాయి. కొన్ని మాత్రం క్యాన్సర్ లక్షణాలను(మిల్నాంట్ )కలిగి ఉంటాయి.ప్రివెన్షన్ ఈజ్ బెటర్ ద్యాన్ క్యూర్ అనే మాట మనం వింటూనే ఉంటాము. ఇది అక్షరాల నిజం. ఓవరీస్ సిస్టుల విషయంలో ఈ నానుడి బాగా పనిచేస్తుంది.సమస్య రాకుండా ముందే నివారించుకోవడం మంచిది. ప్రారంభ సంకేతాలంటూ ఏవి ఉండవు. అయితే కొన్ని లక్షణాలను , సంకేతాలను మహిళలు గమనిస్తుండాలి. ఇవి నార్మల్ గా కూడా ఉండవచ్చు .
కాబట్టి, ఓవేరియస్ సిస్ట్ లు ఉన్నట్లు గుర్తించడానికి కొన్ని సంకేతాలు ఈ క్రింది విధంగా..

పొట్ట ఉబ్బరం, నొప్పి:
ఓవేరియన్ సిస్టులున్నప్పుడు, పొట్ట వాపు, ముఖ్యంగా లోయర్ ఆబ్డోమిన్ లో వాపు తో పాటు నొప్పి కూడా ఉంటుంది. ఈ సంకేతంను గుర్తించినట్లైతే ఓవరీస్ లో సిస్టులున్నట్లు .

పీరియడ్స్ సమయంలో పెల్విక్ పెయిన్:
ఫోలిసెల్స్ బ్రేక్ కాకపోవడం వల్ల అండం విడుదల కాదు, మహిళలకు సరిగా పీరియడ్స్ అవ్వడం లేదంటే సిస్టులు ఏర్పడటంతో పెల్విక్ పెయిన్ ఎక్కువగా ఉంటుంది.

మూత్రవిసర్జనలో సమస్యలు, లేదా తరచూ మూత్ర విసర్జనకు వెళ్లడం:
ఓవరీస్ లో సిస్టులు ఏర్పడి నప్పుడు, మూత్ర విసర్జన చేయడం కష్టం అవుతుంది, ఇది నొప్పికి దారితీస్తుంది. ఇంకా ఇది బ్లాడర్ పెయిన్ కు గురిచేస్తుంది . బ్లాడర్ మీద ఒత్తిడి పెరిగి తరచూ మూత్ర విసర్జన చేయాలనిపిస్తుంది.

వికారం మరియు వాంతులు:
సిస్టులు రప్చర్ అయినప్పుడు, వికారం, వాంతులు లక్షణాలు కనబడుతాయి. ఈ లక్షణాల గురించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. లేదంటే ఇన్ఫెక్షన్ పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

బరువు పెరగడం :
ఓవరీస్ లో సిస్టులున్నప్పుడు, ఓవరీస్ లో నొప్పితో పాటు, కడుపుబ్బరం, వంటి లక్షణాలు కనబడుతాయి. అంతే కాదు అతి తక్కువ సమయంలోనే బరువు ఎక్కువగా పెరుగుతారు.

బౌల్ మూమెంట్ సమస్యలు:
ఓవరీస్ లో సిస్టులున్నప్పుడు, బౌల్ మూమెంట్ లో సమస్యలుంటాయి. బౌల్ మూమెంట్ పెయిన్ ఫుల్ గా ఉంటుంది. పెద్ద ప్రేగులు లేదా కోలన్ మీద ప్రెజర్ పడటంతో స్టూల్ పాస్ చేయడం కష్టం అవుతుంది.

అజీర్తి లేదా గుండెలో మంట:
చాలా తక్కువ ఆహారం తీసుకున్నా కూడా, మహిళల్లో సిస్టులున్నట్లైతే, చాలా త్వరగా కడుపునిండినట్లు అనిపిస్తుంది. పొట్ట మీద ప్రెజర్ పెరుగుతుంది, దాంతో అన్ని రకాల అజీర్తి సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది.

లోయర్ బ్యాక్ పెయిన్ :
ఓవరీస్ లో సిస్టులున్నప్పుడు, లోయర్ బ్యాక్ పెయిన్ ఉంటుంది. కొంత మందిలో లోయర్ బ్యాక్ తో పాటు, తొడల్లో కూడా నొప్పి ఎక్కువగా ఉంటుంది. ఈ లక్షణాలు కూడా ఓవేరియస్ సిస్టుల ప్రారంభ సంకేతాలు.



Click it and Unblock the Notifications