Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
ఉమెన్స్ అలర్ట్ : ఈస్ట్ ఇన్ఫెక్షన్ నివారించే కోకనట్ ఆయిల్
ఆయుర్వేదిక్ రెమెడీస్ లో కొబ్బరి నూనె చాలా ప్రసిద్ది, శతాబ్దాల కాలం నుండి దీన్ని ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఈ నూనె చాలా ట్రాన్పరెంట్ గా ఉంటుంది. ఎండు కొబ్బరి నుండి ఎక్సట్రాక్ట్ చేసిన కలర్ లెస్ ఫ్యాటీ ఆయిల్ . చర్మ, జుట్టు సమస్యల నివారణకు ఉపయోగించే ట్రీట్మెంట్స్ లో కొబ్బరినూనె పాపులర్ . అందుకు వివిధ రకాల బ్యూటీ ప్రొడక్ట్స్ లో దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.
ఈస్ట్ ఇన్ఫెక్షన్, ఈస్ట్ ఇన్ఫెక్షన్ అంటే వెజినా ఇన్ఫ్లమేషన్ కు గురి కావడం. దీని ఫలితంగా దురద, డిశ్చార్జ్, మరియు ఇరిటేషన్ కలిగిస్తుంది. ఇది కాండిడా ఈస్ట్ కణాలకు కారణమవుతుంది. . వ్యాధినిరోధకత లోపించినప్పుడు, లేదా హార్మోనుల అసమతుల్యత వల్ల ఈస్ట్ ఇన్ఫెక్షన్ కు గురి అవుతుంది.
కొబ్బరి నూనెలో కాప్రిలిక్ యాసిడ్ అధికంగా ఉంటుంది. ఇది ఈస్ట్ ఇన్ఫెక్షన్ ను నివారిస్తుంది. ఈస్ట్ ఇన్ఫెక్షన్ నివారించే అన్ని రకాల ట్రీట్మెంట్స్ లో కొబ్బరి నూనెను ఉపయోగిస్తున్నారు . ఈస్ట్ ఇన్ఫెక్షన్ నివారించుకోవడానికి కొబ్బరి నూనెను ఇంటర్నల్ గా లేదా ఎక్సటర్నల్ గా తీసుకోవడం వల్ల ఈస్ట్ ఇన్ఫెక్షన్ ను నివారించుకోవచ్చు.

ఈస్ట్ ఇన్ఫెక్షన్ నివారించే మార్గాలు:
ఈస్ట్ ఇన్ఫెక్షన్ నివారించుకోవడానికి , రెగ్యులర్ గా మూడు నాలుగు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనెను తాగాలి. కొబ్బరి నూనెను ఏవిధంగా తీసుకోవాలన్న విషయం ఈ క్రింది విధంగా ఉంది..
కొబ్బరి నూనెను వంటలకు ఉపయోగించువచ్చు.
బట్టర్ లేదా మాగ్రైన్ టోస్ట్ కు కొబ్బరి నూనె అప్లై చేయవచ్చు.
కోకనట్ ఆయిల్ ను స్మూతీలో జోడించుకోవచ్చు.
కోకనట్ ఆయిల్ ను ఓట్ మీల్ కు జోడించుకోవచ్చు
ప్రతి మీల్స్ కు ముందు ఒక టీస్పూన్ కొబ్బరి నూనె తీసుకోవాలి.

కొబ్బరి నూనేను లోకల్ గా అప్లై చేయడం వల్ల కూడా ఈస్ట్ ఇన్ఫెక్షన్ తగ్గించుకోవచ్చు. ఈస్ట్ ఇన్ఫెక్షన్ సోకిన ప్రాంతంలో శుభ్రంగా కడుక్కుని, పొడివస్త్రంతో తేమలేకుండా తుడవాలి . తర్వాత ఆ ప్రాంతంలో కొబ్బరి నూనెను అప్లై చేయాలి. దీన్ని రోజుకు రెండు మూడు సార్లు అప్లై చేయడం వల్ల ఈస్ట్ ఇన్ఫెక్షన్ నివారించుకోవచ్చు.
కొబ్బరి నూనె మరియు దాల్చిన చెక్క నూనెను సమంగా తీసుకుని, మిక్స్ చేయాలి. తర్వాత ప్రభావిత ప్రాంతంలో అప్లై చేయాలి. ఇన్ఫెక్షన్ పోయే వరకూ రెగ్యులర్ గా అప్లై చేయాలి.

కొన్ని చుక్కల గార్లిక్ ఆయిల్లో విటిమన్ ఇ మిక్స్ చేసి కొబ్బరినూనె కూడామిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ప్రభావిత ప్రాంతంలో అప్లై చేయాలి. రెగ్యులర్ గా అప్లై చేస్తుంటే ఇన్ఫెక్షన్ మాయమవుతుంది.
రెగ్యులర్ గా ఆ ప్రాంతాన్ని కోకనట్ ఆయిల్ వాటర్ తో శుభ్రం చేసుకుంటే ఈస్ట్ ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. డిస్టిల్ వాటర్ తీసుకుని, కొబ్బరి నూనె మిక్స్ చేసి ఆ నీటితో శుభ్రం చేసుకోవాలి. దీన్ని రిపీట్ చేస్తూ ఇన్ఫెక్షన్ తగ్గే వరకూ కంటిన్యూ చేయొచ్చు.
కొబ్బరి నూనెను పైన తెలిపిన పద్ధతులను అనుసరిస్తుంటే, ఈస్ట్ ఇన్ఫెక్షన్ ని తప్పనిసరిగా తగ్గించుకోవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications