Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
ఫ్యాటీ లివర్ వ్యాధి ఉన్నవారు అనుసరించవలసిన డైట్
ఫ్యాటీ లివర్ డైట్ ఫ్యాటీ లివర్ వ్యాధిని నయం చేయటంలో సహాయపడుతుంది. ఫ్యాటీ లివర్ వ్యాధి నిర్ధారణ అయ్యాక ఏ ఆహార పదార్ధాలు తినాలో అప్పటి పరిస్థితులు మరియు కారకాల మీద ఆధారపడి ఉంటుంది.
మీరు అధిక మద్యపానం సేవిస్తారా? అధిక బరువు/ఊబకాయంతో బాధ పడుతున్నారా? మధుమేహం వంటి సమస్యలతో బాధ పడుతున్నారా? అధిక రక్తపోటు,జివక్రియలో ఇబ్బందులు ఉన్నాయా? ఏదైనా ఆహారం తీసుకున్నప్పుడు అలర్జీలు వస్తున్నాయా ?
ఈ ప్రశ్నలకు సమాధానం తెలిస్తే నిర్దిష్ట సమస్యకి సరైన పరిష్కారం గుర్తించడానికి సహాయపడుతుంది.

ఫ్యాటీ లివర్ ఆహారం ప్రణాళికను ఎంచుకొనే సమయంలో కొన్ని విషయాల గురించి ఆలోచించుకోవాలి. బరువు తగ్గటానికి డైట్ మరియు వ్యాయామం చేస్తూ ఉంటే ఫ్యాటీ లివర్ చికిత్సకు చాలా సహాయకారిగా ఉంటుంది.
ఇది ఆల్కహాలిక్ మరియు నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ రోగులకు వర్తిస్తుంది. నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ (NAFL) రోగుల కంటే ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ (AFL) రోగులలో మద్యం పై కఠినమైన నియమాలు ఉంటాయి.

ఎక్కువగా కొవ్వు ఆహారాలను తీసుకోవటం వల్ల ఫ్యాటీ లివర్ వ్యాధి వస్తుంది. ప్రత్యేకంగా అనారోగ్య కొవ్వులు కలిగిన ఆహారాలను తీసుకోవటం తగ్గించాలి. ప్రతి రోజు FLD రోగులు 30 శాతం కేలరీలు ఉండేలా చూసుకోవాలి.
మొత్తం మీద ప్రతి రోజు 1200 నుంచి 1500 కేలరీలు ఉండే విధంగా డైట్ కంట్రోల్ చేసుకోవాలి. మీకు చాలా ఆహారాలు ప్రియమైనవి ఉంటాయి. అయితే వాటిని తీసుకొనే సమయంలో కేలరీలు లెక్కించుకొని తీసుకోవటం మంచిది.

కాబట్టి అనేక రుచికరమైన ఫ్యాటీ లివర్ ఆహారాలు ఉన్నాయి. మీరు ఆహారంలో కొవ్వు పదార్దాలను తగ్గించి, పండ్లు మరియు కూరగాయలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి.
సాదారణంగా సలాడ్ చేసుకున్నప్పుడు డ్రెస్సింగ్ కొరకు అధిక కొవ్వు కలిగిన మసాలాలను జోడిస్తాం. ఫ్యాటీ లివర్ వ్యాధి ఉన్నవారు అధిక కొవ్వు కలిగిన మసాలాలను మానేయాలి.

లివర్ కి అనుకూలమైన ఆహారలలో పండ్లు,ఆకుపచ్చని కూరగాయలు,విటమిన్ సి సమృద్దిగా ఉండే సిట్రస్ పండ్లు, చిరు ధాన్యాలు ఉన్నాయి.
కూరగాయలు మరియు పండ్లు తరచుగా తీసుకుంటే శరీరానికి అవసరమైన ఫోలేట్ మరియు యాంటి ఆక్సిడెంట్ సమృద్దిగా అందుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications