Latest Updates
-
గోళ్లు బలంగా, అందంగా ఉండాలంటే.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
లక్ష్మణ రేఖ వద్దు, కెమికల్ స్ప్రేలు వద్దు..వంటగదిలో చీమలను తరిమికొట్టే చిట్కా! -
ఈ ఫ్రూట్స్ తింటున్నారా.. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఒక్కసారి వీటి రేటింగ్స్ తెలుసుకుంటే బెటర్.! -
శుక్రవారం ఈ పూజలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట.. ఇంట్లో ధనం, శుభం పెరుగుతాయా? -
Viral Video: నైట్ మార్కెట్ లో టవల్ కట్టి డాన్స్ చేసిన మహిళ..ఊడిపోతున్నా కూడా.. -
బ్యూటీ పార్లర్‌కి వెళ్లే పనిలేదు.. పాతకాలం టిప్స్‌తో మృదువైన జుట్టు, మెరిసే ముఖం మీ సొంతం.! -
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు!
హైపర్ థైరాయిడిజం ఉన్నవారు ఖచ్చితంగా తినకూడని ఆహారాలు..
భారత దేశంలో సగటున 4.2 కోట్ల మంది థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్నారని తాజా సర్వేలు చెబుతున్నాయి. అంటే సంఖ్యాపరంగా మధుమేహం' తర్వాత మళ్లీ ఇదే అంత పెద్ద సమస్య! అయినా చాలామందికి.. అసలు తమకీ సమస్య ఉందన్న విషయమే తెలీదు. ఇది థైరాయిడ్ గ్రంథిపై అవగాహన పెంచుకోవాల్సిన సమయం! థింక్ థైరాయిడ్! థైరాయిడ్ హార్మోన్ లోపమన్నది ఎంతోమంది స్త్రీల జీవితాలను అతలాకుతలం చేస్తున్న పెను సమస్య. దీనితో జీవితం యావత్తూ డీలాపడటమే కాదు.. నిర్లక్ష్యం చేస్తే గుండె జబ్బులు, సంతాన రాహిత్యం, ఎముకల సమస్యల వంటివెన్నో చుట్టుముడతాయి.
మన మెడ కిందే.. గొంతు ముందు భాగంలో.. సీతాకోక చిలకలా కరుచుకుని ఉంటుంది అవటు (థైరాయిడ్) గ్రంథి! పరిమాణం రీత్యా చూడటానికి ఇది చాలా చిన్నదేగానీ.. మన శరీరం మొత్తానికి చురుకుదనాన్నిస్తుండే కీలక హార్మోన్లను స్రవించే అమోఘమైన అవయవం ఇది. ఈ గ్రంథి స్రవించే టి3', టి4' హార్మోన్లు రెండూ నేరుగా మన రక్తంలో కలిసి.. శరీరంలోని ప్రతి అవయవాన్నీ చైతన్యవంతం చేస్తాయి. ప్రతి కణాన్నీ, ప్రతి కండరాన్నీ శక్తిమంతంగా తీర్చిదిద్దుతుంటాయి. మన శారీరక జీవక్రియలన్నీ చురుకుగా, క్రమబద్ధంగా సాేగలా చూడటంలో ఈ థైరాయిడ్ హార్మోన్లదే కీలక పాత్ర. గోళ్లు, వెంట్రుకల పెరుగుదల నుంచి గుండె కొటు్టకునే వేగం వరకూ.. జీర్ణప్రక్రియ నుంచి సంతాన సామర్థ్యం వరకూ శరీరంలోని ప్రతి జీవక్రియనూ ప్రభావితం చేసే హార్మోన్లు ఇవి! అందుకే శరీరంలో ఈ హార్మోన్లు ఎక్కువైనా సమస్యే... తక్కువైనా సమస్యే. ఈ రెండే దీనితో వచ్చే పెద్ద చిక్కులు.
థైరాక్సిన్ ఎక్కువ మోతాదులో థైరాక్సిన్‌ను విడుదల చేయడం వల్ల వచ్చే సమస్యను హైపర్ థైరాయిడిజం అంటారు.హైపర్ థైరాయిడిజంకు గురైనప్పుడు, ఆహారం సరైన మోతాదులో తీసుకున్నా బరువు తగ్గడం, నిద్రలేమి, గుండెదడ, అధిక చమటలు, విరేచనాలు, చేతులు వణకడం, నీరసంగా ఉండడం, నెలసరులు త్వరత్వరగా రావడం, అధిక రక్తస్రావం, గాయిటర్, ఆయాసం, నిద్రలేమి, పాలిపోయిన చర్మం వంటిలక్షణాలు కనిపిస్తాయి.
కారణాలు:ప్రస్తుత జీవన విధానం వేగవంతం కావడం, ఒత్తిడి పెరిగిపోవడం, శారీరక శ్రమ తగినంత లేకపోవడం, పౌష్టికాహార లోపం వల్ల థైరాయిడ్ వ్యవస్థలో మార్పులు రావడం వల్ల థైరాయిడ్ సమస్యలు మొదలవుతాయి. కుటుంబ చరిత్రలో థైరాయిడ్ సమస్యలు ఉన్నపుడు కూడా తర్వాత తరంలో వారికి రావచ్చు. అయోడిన్ లోపం వల్ల కూడా థైరాయిడ్ సమస్యలు వస్తాయి.పార్శియల్ థైరాయిడెక్టమి వల్ల
పిట్యూటరీ గ్రంధిలో వచ్చే వ్యాధుల వల్ల కూడా థైరాయిడ్ సమస్యలు వస్తాయి.
థైరాయిడ్ పరిస్థితులు చాలా జాగ్రత్తగా నిర్వహించాలి. లేకపోతే చాలా రకాల సమస్యలకు గురయ్యే అవకాశం ఉంది. హైపర్ థైరాయిడిజాన్ని ఆరోగ్యకర స్థాయిలో నిర్వహించాలంటే ఆహార మార్పులు తప్పని సరి. థైరాయిడిజం వలన కలిగే సమస్యలు అధికమవకుండా ఉండాలంటే ఇక్కడ తెలిపిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండండి.

ఉప్పు ఎక్కువగా ఉన్న ఆహారాలు
అధికంగా ఉప్పు కలిగిన ఆహారాలు థైరాయిడ్ పరిస్థితులను ఎక్కువగా ప్రభావితపరుస్తాయి. కావున అధికంగా ఉప్పు కలిగిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి మరియు మీరు తీసుకునే ఆహార పదార్థాలలో ఉప్పు స్థాయిలను ఎంత మేరలో ఉన్నాయో చూసుకోవాలి. అయోడిన్ సేకరణకు వీలైనంత దూరంగా ఉండటం అవసరం.

పాలు:
హైపర్ థైరాయిడిజంతో బాధపడే వారు పాలు ఉత్పత్తులు , పాలు తీసుకోవడం మంచిది కాదు . హోల్ మిల్క్ (వెన్న లేదా మీగడ తియ్యని పాలను )తాగకుండా , స్కిమ్డ్ మిల్క్ (మీగడ తీసేసిన) పాలను తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది మరియు జీర్ణమవ్వడానికి సులభంగా ఉంటుంది.

నువ్వుల పొడి:
నువ్వుల పౌడర్ లో న్యూట్రీషియన్స్ అధికంగా ఉంటాయి . హై గ్లిసిమిక్ ఇండెక్స్ కలది. ఇది శరీరంలో షుగర్ లెవల్స్ మరియు హార్మోనుల లెవల్స్ కు మరియు థైరాయిడ్ హార్మోన్స్ కు అంతరాయం కలిగిస్తుంది. కాబట్టి, వీటికి దూరంగా ఉండటం మంచిది.

ఫుడ్ స్వీట్నర్స్ :
షుగర్, షుగర్ జోడించిన డెక్ట్సోరోస్, హైఫ్రక్టోజ్, కార్న్ షుగర్ మొదలగునవి మరియు హైక్యాలరీ మరియు ఫుడ్ స్వీట్నర్స్ తినడం వల్ల బ్లడ్ షుగర్ వెవల్స్ పెరిగిపోతాయి . అయితే ఇవి ఒకరకంగా ఆరోగ్యానికి మంచిది. కానీ హైపర్ థైరాయిడిజంతో బాధపడే వారు ఇటువంటి ఫుడ్ స్వీట్నర్స్ కు దూరంగా ఉండటం మంచిది.

డైరీ ప్రొడక్ట్స్ :
డైరీప్రొడక్ట్స్ ను కూడా నివారించాలి. ల్యాక్టోజ్ ఇంటాలరెన్సె ఉన్న వారు డైరీ ప్రొడక్ట్స్ ను ఎక్కువగా తీసుకుంటుంటారు. అయితే హైపర్ థైరాయిడిజం సమస్య ఉన్న వారు అజీర్తి, బ్లోటింగ్, అలసట, మొదలగు సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి, డైరీ ప్రొడక్ట్స్ లో పాలు, చీజ్, ఐస్ క్రీమ్స్, పెరుగు వంటివి తినడం నివారించాలి.

రైస్
హైపర్ థైరాయిడిజాన్ని కలిగి ఉండే వారు రైస్ తినకూడదు ఎందుకంటే వీటిలో సోడియం మరియు కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. రైస్ మరియు వాటి ఉత్పత్తులు శరీర బరువును గణనీయంగా పెంచుతాయి దీని వలన థైరాయిడ్ వ్యాధ గ్రస్తులలో సమస్యలు అధికమవవచ్చు.

ఫ్రై చేసిన ఆహారాలు
నూనెలో ఫ్రై చేసిన ఆహారాలు లేదా రెసిపీలు శరీరంలో కొవ్వు పదార్థాలను మరియు బరువును పెంచుతాయి. ఈ రెండు పరిస్థితులు కూడా థైరాయిడ్ వ్యాధి గ్రస్తులకు చాలా ప్రమాదకరం. కావున, ఫ్రై చేసిన ఆహార పదార్థాలకు వీలైనంత దూరంగా ఉండాలి.

ఆల్కహాల్
మానసిక పరిస్థితిని, నిద్ర, థైరాయిడ్ విధి మరియు థైరాయిడ్ మందులను ఆల్కహాల్ ప్రభావితపరుస్తుంది. హైపర్ థైరాయిడిజాన్ని కలిగి ఉన్న వారు, ఎక్కువగా నీటిని తాగుతూ, శరీరాన్ని హైడ్రేటేడ్ గా ఉంచుకోవాలి. ఆల్కహాల్ ద్రావణాలకు దూరంగా ఉండటం వలన థైరాయిడ్ విధి సజావుగా జరపబడుతుంది.

కెఫీన్
థైరాయిడ్ వ్యాధి గ్రస్తులు కెఫీన్ సంబంధిత ద్రావణాలకు, ఉత్పత్తులకు దూరంగా ఉంటూ, వీటిని తీసుకునే ముందు తప్పక వైద్యుడి అనుమతి తీసుకోవాలి. వీటికి బదులుగా హెర్బల్ టీ, తాజా పండ్లు, రసాలు మరియు కూరగాయల ఆధారిత సూప్ లు మంచి ఎంపికలుగా చెప్పవచ్చు.



Click it and Unblock the Notifications