Latest Updates
-
తొలి ఏకాదశి పర్వదినం.. విష్ణుమూర్తికి ప్రీతికరమైన తులసీ పూజ ఇలా చేస్తే కష్టాలు తొలగిపోతాయి.! -
లంచ్ తర్వాత విపరీతంగా నిద్ర మత్తు.. వీటిని అలవాటు చేసుకుంటే ఇక కునుకు మాటే ఉండదు.! -
వాతావరణ మార్పులతో మోకాళ్ల నొప్పుల బాధలు.. ఉపశమనం కోసం ఇంట్లోనే ఇలా చేయండి.! -
తిరోగమనం నుంచి బయటపడ్డ బుధ గ్రహం.. ఇక ఈ రాశుల వారి దశ తిరిగినట్లే.! -
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక
మెడ మరియు భుజాలపై పడే ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగించే మత్స్యాసనం (ఫిష్ పోస్)
ఈ ఆసనం పేరు సంస్కృత పదం నుంచి ఉద్భవించింది. 'మత్స్యం' అంటే చేప అని అర్థం. 'ఆసనం' అంటే భంగిమ అని అర్థం.
చేపవంటి భంగిమలో ఈ ఆసనాన్ని సాధన చేస్తారు కాబట్టి ఈ ఆసనానికి మత్స్యాసనమని పేరు వచ్చింది. చేపలు ఏ విధంగా ఈదుతాయో అలాగే శరీరం కూడా తేలికగా అవడానికి ఈ ఆసనం తోడ్పడుతుంది.
ప్రక్కటెముకల మధ్యలో ఉండే ఫ్లెక్సర్స్ తో పాటు ఇంటర్ కోస్టల్స్ ను బలపరచడానికి ఈ ఆసనం తోడ్పడుతుంది. అలాగే, ఈ ఆసనం స్ట్రెస్ మరియు టెన్షన్ నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
భుజాల నొప్పి నుంచి అలాగే మెడ నొప్పి నుంచి ఉపశమనం లభించడమే కాకుండా మిగతా కండరాలను శక్తివంతం చేయడానికి కూడా ఈ ఆసనం ఎంతగానో తోడ్పడుతుంది.
ఈ ఆసనం సాధన చేయడానికి అవసరమైన దశలను అలాగే ఈ ఆసన సాధన వల్ల కలిగే లాభాలను ఇప్పుడు చూద్దాం.

ఈ ఆసనానికి సంబంధించిన స్టెప్స్
1. నేలపై పడుకుని వెన్నెముకను నిటారుగా ఉంచాలి. రెండు కాళ్ళను దగ్గర ఉంచుతూ శరీరాన్ని రిలాక్స్డ్ గా ఉంచాలి. మీ చేతులు శరీరానికి ఇరువైపులా ఉండాలి.
2. ఇప్పుడు మెల్లగా మీ అరచేతులను మీ హిప్స్ కింద తీసుకువచ్చి మీ భుజాలు రెండిటినీ ఒకదానికొకటి దగ్గరగా తీసుకురావాలి. నేలపై కూర్చున్నట్టుగా మీ కాళ్ళను ఫోల్డ్ చేయాలి.
3. శ్వాస తీసుకుంటూ మీ ఛాతీ మరియు శిరస్సును పైకెత్తాలి.
4. ఇప్పుడు మీ తలను ఎంత ఎనుకకు అనగలిగితే అంత వరకు మీ మెడను సాగదీస్తూ మీ శిఖర భాగం నేలను తాకగలిగేలా చేయాలి. ఈ క్రమంలో మీ ఛాతీ ఎలివేటెడ్ పొజిషన్ లో ఉంటుంది.

5. శరీరం బ్యాలెన్స్ తప్పకుండా జాగ్రత్తగా మీ భుజాలను నేలపైనుంచాలి. మీ శరీరపు బరువు మీ తలపై కాకుండా మీ భుజాలపై ఉండాలన్న కిటుకును గ్రహించండి. మీ పొత్తికడుపును కిందకు ఉంచుతూ, చెస్ట్ ని ఎలివేట్ చేయండి. మీ తొడలు అలాగే కాళ్ళను కూర్చున్నప్పుడు ఫోల్డ్ చేసినట్టుగానే ఫోల్డ్ చేసి ఉంచండి.
6. ఇదే పోస్ లో మీరు ఎంతసేపు సౌకర్యవంతంగా ఉండగలిగితే అంతసేపు ఉండండి. ప్రారంభంలో శ్వాసను తీసుకుంటూ, వదులుతూ కనీసం ఒక నిమిషం ఉండగలుగుతారు. అయితే, ఈ ఆసనాన్ని సాధన చేసే ప్రారంభదశలో మీరు మీ మెడపై ఒత్తిడిని మరింత పెంచకండి.
7. ఇప్పుడు, క్రమంగా, మీ తలను సాధారణ పొజిషన్ కు తీసుకువచ్చి, మీ చెస్ట్ ని కిందికి దించి నేలపై శయనించే పొజిషన్ లోకి వచ్చాక, మీ చేతులను అలాగే కాళ్ళను కూడా సాధారణ పొజిషన్ కు తీసుకువచ్చి రిలాక్స్ అవ్వండి.

ఈ ఆసన సాధన వల్ల కలిగే లాభాలు
• మీ చెస్ట్ అలాగే మెడని స్ట్రెచ్ చేయడానికి తోడ్పడుతుంది
• మీద అలాగే భుజాలపై పడే ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుంది
• శ్వాసకోస ఇబ్బందులను అరికడుతుంది. తద్వారా గాఢమైన శ్వాస తీసుకునే దిశగా ప్రోత్సహిస్తుంది
హెచ్చరిక
లో లేదా హై బ్లడ్ ప్రెజర్ తో బాధ పడుతున్న వారు లేదా మైగ్రైన్ తో పాటు నిద్రలేమి సమస్యతో సతమతమవుతున్న వారు ఈ ఆసనాన్ని వేయడానికి ప్రయత్నించకూడదు.
అలాగే, లోయర్ బ్యాక్ పెయిన్ తో గాని లేదా ఇటీవలే సర్జరీ చేయించుకున్న వారు ఈ ఆసనాన్ని సాధన చేయకపోవడం ఉత్తమం. ఈ ఆసనమే కాదు వారు ఏ యోగాసనం కూడా సర్జరీ చేయించుకున్న వెంటనే సాధన చేయకూడదు.
మీ శరీరాన్ని ఫిట్ గా ఉంచుకున్నాకే ఏదైనా యోగాసనాన్ని సాధన చేయాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications