Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
దగ్గు నుంచి తక్షణ ఉపశమనం కలిగించే హోంమేడ్ సిరప్
నాన్ స్టాప్ గా దగ్గుతున్నారా ? నలుగురిలో ఉన్నప్పుడు, ఆఫీల్ లో మాటిమాటికీ దగ్గు వస్తుంటే ఇబ్బందిపడుతున్నారా ? ఎన్ని సిరప్ లు, ట్యాబ్లెట్స్ వేసుకున్నా దగ్గు తగ్గడం లేదా ? అయితే డోంట్ వర్రీ.. ఇంట్లోనే దగ్గు మందు తయారు చేసుకోవచ్చు. సింపుల్ గా తయారు చేసుకునే ఈ దగ్గు మందు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.
ఎక్కువగా దగ్గడం వల్ల మీరు మరింత అనారోగ్యానికి గురవుతారు. చాలాకాలం దగ్గు తగ్గకపోతే మీరు ఎనర్జీ మొత్తం కోల్పోతారు. దగ్గుకి చాలా కారణాలుంటాయి. వైరల్ ఫ్లూ, గొంతులో ఇన్ఫెక్షన్స్, ఎలర్జీలు, ఆస్తమా, లంగ్ డిజార్డర్స్ కూడా దగ్గు రావడానికి కారణమవుతాయి. దగ్గుతో బాధపడుతున్నప్పుడు ఏ పని చేయాలనిపించదు. రన్నింగ్, స్విమ్మింగ్ వంటి వ్యాయామాలకు దూరంగా ఉండాల్సి వస్తుంది.

డాక్టర్లు రాసిచ్చే దగ్గు మందులు, సిరప్ లలో ఉండే మెడిసినల్ ప్రాపర్టీస్ అలసట, తలనొప్పి, కాన్స్టిపేషన్, ఆకలి పెంచడం, ఎసిడిటీకి కారణమవుతాయి. కాబట్టి న్యాచురల్ రెమిడీ ద్వారా దగ్గను వెంటనే నివారించుకోవచ్చు. కాబట్టి ఇంట్లోనే సింపుల్ గా దగ్గు మందు తయారు చేసుకోవడం ఎలాగో మీరే చూడండి..
కావాల్సిన పదార్థాలు
1 గ్లాసు వేడి పాలు,
పావు టీ స్పూన్ మిరియాలు
2 టేబుల్ స్పూన్ల తేనె

ఈ మూడింటితో తయారు చేసే దగ్గు మందు.. రాత్రికి రాత్రే దగ్గు తగ్గించడానికి సహాయపడుతుందని.. అధ్యయనాలు నిరూపించాయి. అలాగే దగ్గు లక్షణాలను కూడా దూరం చేస్తుంది. వేడిపాలు గొంతులో ఇరిటేషన్ తగ్గించి.. స్మూత్ గా మార్చేస్తాయి. దీనివల్ల దగ్గు నుంచి త్వరిత ఉపశమనం పొందవచ్చు. తేనె యాంటీ బ్యాక్టీరియల్ గుణం కలిగి ఉంటుంది. ఇది ఇన్ఫెక్షన్ కి కారణమయ్యే క్రిములను నాశనం చేస్తుంది. దగ్గు ఎంత తొందరగా వీలైతే.. అంత త్వరగా తగ్గడానికి సహాయపడుతుంది. హాట్ మిల్క్, మిరియాలు, తేనె కలిపి తీసుకోవడం వల్ల ఇన్ల్ఫమేషన్ తగ్గుతుంది. దగ్గు, వాపు, కఫం వంటి సమస్యలను దూరం చేస్తుంది.
తయారు చేసే విధానం
*పాలు ఒక పాన్ పోసి బాగా మరిగించాలి. తర్వాత గ్లాసులోకి తీసుకోవాలి.
*నల్ల మిరియాలను పొడి చేసుకోవాలి.
*రెండు టేబుల్ స్పూన్ల తేనె, పావు టీ స్పూన్ మిరియాల పొడిని వేడి పాలల్లో కలపాలి.
*ఈ డ్రింక్ ని ప్రతి రోజు రాత్రి భోజనం తర్వాత తీసుకుంటే.. దగ్గు, దగ్గు లక్షణాలు పూర్తీగా తగ్గిపోతాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications