Latest Updates
-
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు! -
రోజు తినే పెరుగన్నమే కదా అని తీసిపారేయకండి.. ఇలా స్పెషల్ గా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే! -
హోటల్ స్టైల్ రాయల్ కొబ్బరి చట్నీ.. ఈ ఒక్క సీక్రెట్ పదార్థం కలిపితే రుచి అదుర్స్! -
బగారా రైస్, చపాతీ,రాగి సంగటిలోకి అదిరిపోయే మటన్ లెగ్ కర్రీ..రుచికి రుచి, బలానికి బలం! -
వంట మధ్యలో గ్యాస్ అయిపోతోందని టెన్షనా? మీ సిలిండర్లో ఎంత గ్యాస్ మిగిలి ఉందో చిటికెలో తెలుసుకోండిలా! -
International womens day 2026: భారతీయ మహిళల తలరాతను మార్చిన జనవరి 1,1848.న ఏం జరిగింది? -
మీ భాగస్వామికి మీరంటే నిజమైన ప్రేమేనా? ఈ 5 విషయాలు చెబుతాయి -
ఎండల్ని తట్టుకునే అమృతం లాంటి తెలంగాణ సల్ల చారు..గిన్నె ఖాళీ చేస్తారు! -
సృష్టికి మూలం, ప్రగతికి ప్రాణం.. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఇలా చెప్పండి! -
ఇడ్లీ, దోసెల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్..చెట్టినాడ్ స్టైల్ సొరకాయ పచ్చడి..వేళ్లు కూడా నాకేస్తారు!
లాలాజలం నోటినుంచి కారడానికి దారితీసే కారణాలు
లాలాజలం నోటినుంచి కారడానికి దారితీసే కారణాలు
చాలా మందికి తెలియకుండానే నిద్రలో నోటిలోంచి లాలాజలం బయటకు కారుతుంది. నోటిలోంచి అదనపు సెలైవా బయటకు వచ్చేటప్పుడు దాన్ని చొంగకార్చడమని అంటారు. ఇది సాధారణమైన స్థితే అయినప్పటికీ కొన్ని సార్లు ఇది కొన్ని రకాలైన మెడికల్ కండిషన్స్ తో ముడిపడి ఉంటుంది. మెడికల్ టర్మ్స్ ప్రకారం దీనిని సయాలోరియ లేదా హైపర్ సెలైవేషన్ అనంటారు.
సలైవా గ్లాండ్స్ అదనపు సలైవాను ఉత్పత్తి చేస్తున్నపుడు దాన్ని హైపర్ సలైవేషన్ అనంటారు. ఈ కండిషన్ అనేది తాత్కాలికం కావచ్చు లేదా క్రానిక్ కావచ్చు. ఇది అంతర్లీనంగా ఉన్న న్యూరాలజికల్ కండిషన్ ని గాని లేదా స్లీపింగ్ డిజార్డర్ ను గాని తెలియచేసేది అయి ఉండవచ్చు.

చొంగకార్చడానికి దారితీసే కారణాలు
అనేక ఫ్యాక్టర్స్ ఈ సమస్యకు దారితీస్తాయి. నోటిలోని ఇన్ఫెక్షన్, స్ట్రోక్ తో ఇబ్బంది పడటం, సెరిబ్రల్ పల్స్ లేదా మల్టిపుల్ సెలెరోసిస్ వంటివి కొన్ని కారణాలు.
ఈ సమస్యకు దారితీసే మరికొన్ని కారణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం:

బ్లాక్డ్ సైనసెస్ :
జలుబు లేదా ఇన్ఫెక్షన్ తో ఇబ్బంది పడుతున్నప్పుడు నాసల్ కంజెషన్ తో పాటు ఇంఫ్లేమేషన్ తో ఇబ్బంది పడే అవకాశం ఉంది. అటువంటప్పుడు, లాలాజలం బయటకు కారే అవకాశం ఉంది. ముక్కు బ్లాక్ అయినప్పుడు నోటిలోంచి శ్వాస తీసుకునే సమయంలో నిద్రలో లాలాజలం బయటకు వచ్చే అవకాశం ఉంది.

స్లీపింగ్ పోజిషన్:
మీరు నిద్రించే పొజిషన్ కూడా ఈ సమస్యకు దారితీయవచ్చు. నోటిలో ఎక్కువ సెలైవా అక్యుములేట్ అవడం వలన నోటిలోంచి సెలైవా లీక్ అవవచ్చు. పక్కకు తిరిగి నిద్రించడం లేదా పొట్టపై ఒత్తిడి వచ్చేలా నిద్రించడం వంటివి ఈ సమస్యకు దారితీస్తాయి. అందువలన, ఈ పొజిషన్స్ ను అవాయిడ్ చేయటం మంచిది.

మెడికేషన్స్ వలన తలెత్తే సైడ్ ఎఫెక్ట్ :
క్లోజాపైన్ వంటి యాంటీ సైకోటిక్ డ్రగ్స్ ని తీసుకోవడం వలన ఈ సమస్య తలెత్తుతుంది. అలాగే అల్జీమర్స్ ట్రీట్మెంట్ లో వాడే డ్రగ్స్ తో పాటు వివిధ యాంటీ బయోటిక్స్ కూడా ఈ సమస్యను తీసుకువచ్చే అవకాశం కలదు.

గ్యాస్ట్రోయసోఫాగస్ రిఫ్లక్స్ డిసీజ్ (GERD) :
GERD అనే ఈ కండిషన్ లో డైజెస్టివ్ యాసిడ్స్ అనేవి ఎసోఫేగస్ లైన్ లోకి తిరిగి వెళ్ళేటప్పుడు యసోఫాగస్ లైనింగ్ కి డేమేజ్ అయ్యే ప్రమాదం ఉంది. గొంతులో ఎదో ఒక లంప్ ఉన్నట్టు అనిపిస్తుంది. ఇది మింగేందుకు అసౌకర్యాన్ని కలిగిస్తుంది. తద్వారా, ఈ సమస్యకు దారితీస్తుంది.

స్లీప్ ఎప్నియా :
ఇది సీరియస్ స్లీప్ డిజార్డర్ కిందకి వస్తుంది. ఈ సమస్య ఉన్నవారిలో అప్పుడప్పుడు అర్థరాత్రి శ్వాస ఆగిపోయినట్లు అనిపిస్తుంది. ఈ కండిషన్ అనేది సెలైవాను ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. ఆ విధంగా సలైవా నిద్రలో కారుతుంది.

డిస్ఫేగియా లేదా స్వాలోయింగ్ డిజార్డర్:
డిస్ఫేగియా వంటి కొన్ని రకాల స్వాలోయింగ్ డిజార్డర్స్ వలన కూడా ఈ సమస్య తలెత్తవచ్చు. పార్కిన్సన్స్, మల్టిపుల్ సెలెరోసిస్ తో పాటు వివిధ రకాల క్యాన్సర్స్ వలన సెలైవాను మింగడంలో ఎదురయ్యే అసౌకర్యం ఎదురవవచ్చు.

చికిత్స:
కొన్ని సులభమైన రెమెడీస్ ను పాటించడంతో పాటు కొన్ని సర్జరీస్ అలాగే ఇంజెక్షన్స్ తో చొంగ కారే సమస్యను తగ్గించుకోవచ్చు.
చొంగకార్చడాన్ని ఎలా నివారించవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం:

1. హోమ్ రెమెడీస్:
వివిధ ఇన్ఫెక్షన్స్ నుంచి మీ శరీరాన్ని రక్షించడంలో సెలైవా ముఖ్య పాత్ర పోషిస్తుంది. అయితే నిద్రపోయినప్పుడు ఎప్పుడైతే సెలైవా అనేది నోటిలో పేరుకుపోవడం ప్రారంభించి అసౌకర్యం కలిగిస్తుందో ఈ స్థితి అనేది అంతర్లీనంగా ఉన్న అనేక ఆరోగ్య సమస్యలను గురించి హెచ్చరిస్తోందని అర్థం చేసుకోవాలి. కొన్ని సులభమైన హోమ్ రెమెడీస్ ను పాటిస్తే ఈ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. నీటిని ఎక్కువగా తీసుకోవడం. నిమ్మ చెక్కను కొరకడం వంటివి సెలైవాను తగ్గిస్తాయి. అందువలన, సెలైవా నోటిలో పేరుకుపోయే సమస్య తగ్గుతుంది.

2. సరిగ్గా నిద్రపోవడం:
వెల్లకిలా నిద్రపోవడం వలన ఈ సమస్య తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. వెల్లకిలా పడుకునేటప్పుడు ఏదైనా అసౌకర్యం తలెత్తితే తక్షణమే వైద్యున్ని సంప్రదించండి. ఈ లక్షణం అనారోగ్యానికి చిహ్నం కావచ్చు.

3. జలుబు, సైనస్ మరియు ముక్కు దిబ్బడ నుంచి ఉపశమనం పొందండి:
జలుబు, సైనస్ అలాగే బ్లాక్డ్ నోస్ వంటివి శ్వాసలో ఇబ్బందులను పెంచుతాయి. ఈ సమస్యలను తగ్గించుకోవడానికి తగిన మెడికేషన్స్ ను అలాగే స్టీమ్మింగ్ వంటి కొన్ని రెమెడీస్ ను పాటించండి. వీటి వలన బ్రీతింగ్ అనేది సులభతరం అవుతుంది లాలాజలం కారే సమస్య తగ్గుముఖం పడుతుంది. నోటితో శ్వాస తీసుకునే అవసరం తగ్గినందువలన లాలాజలం కారే సమస్య తగ్గుతుంది.

4. న్యూరాలజికల్ కండిషన్స్ కి వాడే మెడికేషన్స్:
హ్యూసైన్ మరియు గ్లైకోపైరోలెట్ వంటి మెడికేషన్స్ ను న్యూరాలజికల్ కండిషన్స్ తో బాధపడే వారికి వైద్యులు ప్రిస్క్రైబ్ చేయవచ్చు. ఈ మెడిసిన్స్ అనేవి సెలైవరీ గ్లాండ్స్ కి సంబంధించిన ఇబ్బందులను తగ్గిస్తాయి. అయితే, వీటి వలన తలతిరగడం, మత్తు, కళ్ళు దురద, డ్రై మౌత్, ఇరిటబిలిటీ, హైపర్ యాక్టివిటీ, గుండె దడ పెరగడం వంటి ఇతర సైడ్ ఎఫెక్ట్స్ పెరిగే అవకాశం ఉంది.

5. బొటాక్స్ ఇంజెక్షన్స్:
కొంతమంది చొంగ కార్చే సమస్య నుంచి ఉపశమనం పొందటం కోసం బొటాక్స్ ఇంజెక్షన్స్ ను ప్రిఫర్ చేస్తారు. సెలైవారీ గ్లాండ్స్ కిచ్చే బొటాక్స్ ఇంజెక్షన్ వలన అవి ఆరునెలల పాటు పారలైజ్ అయి పనిచేయడం ఆగిపోతాయి. అవసరమైతే మళ్ళీ బొటాక్స్ ఇంజెక్షన్ ను చేయించుకోవచ్చు.
ఓరల్ డివైసెస్, స్పీచ్ థెరపీ మరియు సర్జరీ వంటివి ఈ సమస్యను తగ్గించే మరికొన్ని చికిత్సా విధానాలు. ఓరల్ డివైస్ ను నోటిలో అమరిస్తే నాలుక పొజిషనింగ్ మరియు లిప్ క్లోజర్ కి అనువుగా ఉంటుంది.
స్పీచ్ థెరపీ అనేది జా మరియు నాలుక మొబిలిటీ మరియు స్ట్రెంత్ ని ప్రేరేపించి ఈ సమస్యను తగ్గించేందుకు తోడ్పడుతుంది. ఈ థెరపీ ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే సరిగ్గా మింగటం అనేది అలవాటు చేయడం. క్రమంగా, లాలాజలం కారే సమస్య తగ్గుతుంది.
న్యూరాలజికల్ కండిషన్ వలన ఈ సమస్య తలెత్తితే సర్జరీ అనేది అవసరపడుతుంది. ఇందులో, సెలైవారీ గ్లాండ్స్ ను తొలగించడం జరుగుతుంది.



Click it and Unblock the Notifications











