Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
బరువు తగ్గాలనుకుంటున్నారా? పొరపాటున కూడా ఈ 5 తినకండి
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చాలామందిని బాధపెడుతున్న ప్రధాన సమస్యల్లో ఊబకాయం లేదా అధిక బరువు ఒకటి. ఇప్పటి పరిస్థితులే కంటిన్యూ అయితే ప్రపంచంలో సగం మంది ఊబకాయం బారినపడే ప్రమాదం ఉందని గతంలో అనేక అధ్యయనాలు తెలిపాయి. ముఖ్యంగా మనదేశంలో ఊబకాయంతో బాధపడుతున్నవారిలో చిన్నపిల్లలు,యువత ఎక్కువగా ఉన్నారు. కొంతమందికి ఇది అనేక ఇతర కారణాల వల్ల రావచ్చు కానీ మెజార్టీ ప్రజలకి మాత్రం ఫుడ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లనే వస్తుంది. వ్యాయామం చేయకపోవడం,ఎప్పుడు పడితే అప్పుడు తినడం,కావాల్సిన దానికన్నా ఎక్కువ తినడం,ఏది పడితే అది తినడం వల్ల అధిక బరువుతో ఇబ్బంది పడేవాళ్లు చాలామంది ఉన్నారు.
బరువు తగ్గడానికి ఆరోగ్యకరమైన, సమతుల్య ఆహారం చాలా ముఖ్యం. బరువు తగ్గడానికి చాలా మంది జిమ్ లో గంటల తరబడి చెమటలు పట్టేలా వ్యాయామాలు చేస్తుంటారు. అయితే తినేటప్పుడు మాత్రం బరువు తగ్గడానికి బదులుగా పెరిగే వాటిని తింటారు. తెలిసో తెలియక ఎన్నో తింటుంటాం. అవి మన బరువు తగ్గించే ప్రయాణానికి ఆటంకం కలిగిస్తాయి. అయితే మీరు కూడా బరువు తగ్గాలని ట్రై చేస్తున్నట్లయితే ఈ రోజు 5 ఫుడ్స్ ని ఎట్టిపరిస్థితుల్లోనూ తీసుకోకూడదు. బరువు తగ్గాలంటే ఏం తినకూడదో తెలుసుకుందాం.

బరువు తగ్గాలంటే ఏం తినకూడదు
1. బంగాళాదుంప
బంగాళాదుంపలు మీ బరువును పెంచుతాయి.తెల్ల బంగాళాదుంపలతో చేసిన ఫుడ్స్ తినడం మానుకోండి. బంగాళాదుంప చిప్స్ మొదలైనవి తింటే బరువు పెరుగుతారు.
2. బ్రెడ్
చాలా మంది ఉదయం అల్పాహారంలో బ్రెడ్ తినడానికి ఇష్టపడతారు. అయితే మీకు కూడా బ్రెడ్ తినడం, బ్రేక్ ఫాస్ట్ లో బ్రెడ్ తినడం ఇష్టమైతే ఈ రోజు నుంచి మానేయాలి. ఎందుకంటే ఇది బరువు పెరగడానికి దారితీస్తుంది.
3. చక్కెర
బరువు తగ్గాలనుకుంటే మీ ఆహారం నుండి చక్కెరను మినహాయించండి. చక్కెరలో చాలా కేలరీలు ఉంటాయి..ఇవి బరువును పెంచుతాయి.
4. మైదా
పిండితో చేసిన వస్తువులు తినడానికి చాలా రుచికరంగా కనిపిస్తాయి. కానీ అవి ఆరోగ్యానికి, బరువుకు కూడా హానికరం.
5. బియ్యం
భారతీయ ఆహారంలో బియ్యం ఒక ముఖ్యమైన భాగం. కానీ వైట్ రైస్ తినడం వల్ల బరువు పెరుగుతారు. మీరు డైట్ లో ఉంటే వైట్ రైస్ కు బదులు బ్రౌన్ రైస్ తినవచ్చు.
Note: ఇంటర్నెట్ లో లభించిన సమాచారం ఆధారంగా ఈ కథనం ఇవ్వబడింది. బోల్డ్ స్కై తెలుగు దీనిని ధృవీకరించలేదు. దీనిని పాటించే ముందు నిపుణుల సూచనలు తీసుకోండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications