Latest Updates
-
ఇంట్లోనే ఫైవ్ స్టార్ హోటల్ రుచి.. ఘుమఘుమలాడే కొబ్బరి కొత్తిమీర చికెన్ రోస్ట్ -
బంగాళదుంపలు, గుడ్లు ఉడకబెట్టేటప్పుడు ఈ తప్పు చేస్తున్నారా? పర్ఫెక్ట్ గా ఉడికే ట్రిక్ చెప్పిన చెఫ్! -
కాలేయ ఆరోగ్యం కోసం చాణక్యుడు చెప్పిన ఈ రహస్యాలు పాటిస్తున్నారా? -
బరువు తగ్గడానికి బ్రహ్మాస్త్రం.. పరగడుపున అవిసె గింజల నీళ్లు తాగితే పొట్ట మాయం! -
ఫైవ్ స్టార్ రెస్టారెంట్ రుచితో.. ఇంట్లోనే సులభంగా క్రీమీ కోకోనట్ చికెన్ కర్రీ..ఎలా చేసుకోవాలంటే.. -
వడగాల్పుల వేళ జాగ్రత్త! ఎండల నుంచి ప్రాణాలు కాపాడుకోవడం ఎలా? -
అక్షయ తృతీయ రోజున ఈ సమయాల్లో పూజ చేస్తే అదృష్టం మీదే! -
వృషభం, సింహం, ధనుస్సు రాశుల వారికి ఈ వారం రాజయోగం.. మీ జాతకం ఎలా ఉందంటే? - 19 నుండి 25 ఏప్రిల్ 2026 వరకు -
వృషభం, సింహం, ధనస్సు రాశుల వారికి రాజయోగం.. ఆ ఒక్క విషయంలో జాగ్రత్త! - ఆదివారం, 19 ఏప్రిల్ 2026 -
తల్లిదండ్రులూ అలెర్ట్..ఏడాదిలోపు పిల్లలకు పొరపాటున కూడా ఇవి తినిపించొద్దు!
OMG: పగటిపూట నిద్రపోతున్నారా? ఆ తీవ్రమైన వ్యాధికి సంకేతమట!
చాలామందికి ఉదయం లేదా పగటి పూట నిద్ర వస్తుంటది. రాత్రి పూట కంటినిండా కునుకు తీసినా సరే ఉదయం మళ్లీ ఛాన్స్ ఎప్పుడు దొరుకుతుందా నిద్రపోదామా అని చూస్తుంటారు. కొంతమంది ఉద్యోగులు ఆఫీస్ లో వర్క్ చేస్తూనే తూలుతూ ఉంటారు. ఛాన్స్ దొరికితే వెళ్లి పడుకుందామా అనేట్లుగా ఉంటారు. కొంతమంది అయితే పనిచేస్తూనే నిద్రలోకి జారుకుంటారు. అలసట, ఒత్తిడి, పేలవమైన దినచర్య ఇలా మనం పగటిపూట నిద్రపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. అయితే పగటిపూట నిద్ర గురించి తాజాగా జరిపిన ఓ పరిశోధనలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. పగటిపూట నిద్ర కొన్ని తీవ్రమైన వ్యాధులకు సంకేతం అని ఆ పరిశోధనలో తేలింది.
ఇటీవల జర్నల్ ఆఫ్ న్యూరాలజీలో పబ్లిష్ అయిన రీసెర్చ్ రిపోర్ట్ ప్రకారం..పగటిపూట నిద్ర అనేది డిమెన్షియా(చిత్తవైకల్యం)అనే తీవ్రమైన వ్యాధికి ప్రారంభ సంకేతమట. అయితే ఈ చిత్తవైకల్యం అంటే ఏంటి?పగటిపూట నిద్రకు చిత్తవైకల్యంకు ఏంటి సంబంధం..తాజా అధ్యయనంలో వెల్లడైన షాకింగ్ విషయాలు ఏంటనే పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం.

చిత్తవైకల్యం అంటే
చిత్తవైకల్యం లేదా డిమోన్షియా అంటే ఓ వ్యక్తి ఆలోచనా సామర్థ్యం, గుర్తుంచుకోవడం, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం క్రమంగా తగ్గిపోవడం. మెదడు కణాలు దెబ్బతినడం వల్ల ఇది జరుగుతుంది. అల్జీమర్స్ వ్యాధి చిత్తవైకల్యం యొక్క అత్యంత సాధారణ రకం.
పగటిపూట నిద్ర-చిత్తవైకల్యం మధ్య ఏంటీ సంబంధం
జర్నల్ ఆఫ్ న్యూరాలజీలో ప్రచురించబడిన పరిశోధన ప్రకారం అధిక పగటిపూట నిద్ర చిత్తవైకల్యం యొక్క ప్రారంభ లక్షణం కావచ్చు. ఏ పని పట్ల ఇంట్రెస్ట్ లేకపోవడం, చేసే పని పట్ల ఆశక్తి లేకపోవడం,పగటిపూట నిద్రపోవడం ఇలాంటి లక్షణాలన్నీ చిత్తవైకల్యం ప్రారంభ సంకేతాలు కావచ్చు. దీనినే "మోటార్ కాగ్నిటివ్ రిస్క్(MCR)" అంటారు. దీనిని ముందుగా గుర్తించడం వల్ల డిమెన్షియాను నివారించవచ్చు. అయితే ఇది పూర్తిగా చిత్తవైకల్యం అని నిర్ణారణ చేయలేం..ఈ సమస్యకు అనేక ఇతర అంశాలు కూడా కారణం కావచ్చు.
చిత్తవైకల్యం సంకేతం అని ఎలా అర్థం చేసుకోవాలి?
పగటిపూట నిద్రపోవడంతో పాటు మీరు జ్ణాపకశక్తి కోల్పోవడం,భాషా సమస్యలు, డెసిషన్స్ తీసుకోవడంలో ఇబ్బంది, వ్యక్తిత్వంలో మార్పులు వంటి ఇతర లక్షణాలను కూడా గమనించినట్లయితే అది ఛిత్తవైకల్యానికి సంకేతం కావచ్చు. పగటిపూట నిద్రలేమి సమస్య నెమ్మదిగా పెరుగుతూ రోజువారీ కార్యక్రమాలు దానివల్ల ప్రభావితం అవుతున్నట్లయితే అది ఖచ్చితంగా ఆందోళన కలిగించే విషయమే.
ఇక పగటిపూట నిద్రలేమి సమస్యకు ఇతర కారణాలు ఉండవచ్చు. రాత్రి సమయాల్లో నిద్ర లేకపోవడం,నిరాశ,అలసట, మెడిసిన్స్ వాడుతున్నట్లయితే వాటి దుష్ప్రభావాలు మొదలైనవి దీనికి కారణాలుగా ఉంటాయి. ఈ కారణాలపై కూడా శ్రద్ధ వహించడానికి ప్రయత్నించండి.
MCR లక్షణాలు ఉంటే ఏమి చేయాలి?
పగటిపూట నిద్ర ఎక్కువగా అనిపించినా డిమెన్షియా యొక్క ఇతర లక్షణాలు కూడా కనిపిస్తే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్లి చూపించుకోవాల్సిందే. డాక్టర్ మీ లక్షణాలు, మెడికల్ హిస్టరీ ఆధారంగా కొన్ని టెస్ట్ లు చేయవచ్చు.ఒత్తిడి చిత్తవైకల్యం ప్రమాదాన్ని పెంచుతుంది. కాబట్టి ఒత్తిడి నిర్వహణ లేదా స్ట్రెస్ మేనేజ్ మెంట్ పద్ధతులను పాటించండి.క్రమం తప్పకుండా ఎక్సర్ సైజ్ చేయడం,సమతుల్య ఆహారం, తగినంత నిద్ర తీసుకోవడం ద్వారా మీ మనస్సును ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications











