Latest Updates
-
కృష్ణాష్టమి స్పెషల్ అటుకులు నువ్వుల లడ్డూ..10 నిమిషాల్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
కృష్ణాష్టమి స్పెషల్: కన్నయ్య మనసు దోచే అటుకుల పాయసం..ఇంట్లోనే చేయండిలా -
మగవారూ అలర్ట్ : మూత్రం పోశాక కూడా చుక్కలు కారుతున్నాయా? ఈ 3 వ్యాధులకు సంకేతం కావచ్చు! -
ఈ కృష్ణాష్టమికి ఇంట్లోనే.. 100% పవిత్రమైన పంచామృత కేక్ తయారు చేయండిలా! -
రోడ్ సైడ్ స్టైల్ ఎగ్ శార్వా..చపాతీ, దోశ, పరోటాల్లోకి అమృతంలా! -
గ్యాస్, అజీర్తి అని ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారా? ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ముప్పు కావచ్చు, జాగ్రత్త! -
ఆడవారైనా, మగవారైనా అస్సలు తాగకూడని డ్రింక్ ఏంటో తెలుసా.. డాక్టర్ సలహా ఇదే.! -
ఇడ్లీ, దోశలతో విసిగిపోయారా? ప్రొటీన్ల నిధి,బలాన్నిచ్చే ఎగ్ పరాఠా ట్రై చేయండి! -
సైలెంట్ కిల్లర్స్: పైకి ముక్కుసూటి.. వెనుక మహా కిలాడీలు!..ఈ 3 రాశులు ఎవరో తెలుసా? -
వినాయక చవితి స్పెషల్..ఇంట్లోనే ఈజీగా నోరూరించే చాక్లెట్ మోదక్ ఎలా చేసుకోవాలంటే..
Beer And Belly Fat: బీర్ తాగితే పొట్ట వస్తుందా? మీ పొట్టకు బీర్ కారణమో.. కాదో.. తెలుసుకోండి
బీర్ తాగడం వల్ల పొట్ట వస్తుందా? ఈ ప్రశ్న చాలా మందిని వేధిస్తుంది. ముఖ్యంగా యూత్ ను ఈ ప్రశ్న వెంటాడుతుంది. బీర్ తాగితే బెల్లీ ఫ్యాట్ వస్తుందని కొందరు, రాదని మరికొందరు అంటుంటారు. నిజంగా బీర్ తాగితే పొట్ట వస్తుందో లేదో ఇప్పుడు తెలుసుకుందాం.
బీర్ లో ఉండే న్యూట్రిషన్ ఫ్యాక్ట్స్:
- కేలరీలు: 153
- ఆల్కహాల్: 14 గ్రాములు
- కార్బొహైడ్రేట్లు: 13 గ్రాములు
- ప్రోటీన్: 2 గ్రాములు
- ఫ్యాట్: 0 గ్రాములు

బీర్‌లో సోడియం, పొటాషియం, మెగ్నీషియం వంటి సూక్ష్మపోషకాలు కూడా చిన్న మొత్తంలో ఉంటాయి. రోజువారీ అవసరాలు తీర్చడానికి పోషకాలు అందాలంటే పెద్ద మొత్తంలో తాగాల్సి ఉంటుంది. బీర్లలో ఎక్కువ కేలరీలు ఉంటాయి. ఆల్కహాల్ లో గ్రాముకు 7 కేలరీలు ఉంటాయి.
బీర్ తాగడం వల్ల కొవ్వు ఎలా పెరుగుతుంది?
1. కేలరీలు తీసుకోవడాన్ని పెంచుతుంది:
బీర్ లో ఎక్కువ కేలరీలు ఉంటాయి. అలాగే ఆల్కహాల్ తీసుకున్న తర్వాత ఎక్కువగా ఆకలి వేస్తుంది. బీర్ లో అధికంగా ఉండే కేలరీలు, అలాగే ఆల్కహాల్ తర్వాత తినే ఆహారం వల్ల కేలరీలు ఎక్కువగా తీసుకుంటాం.
2. కేలరీలు కరగడాన్ని నిరోధిస్తుంది:
ఆల్కహాల్ తాగడం వల్ల శరీరం కొవ్వును కరిగించడాన్ని నిరోధిస్తుంది. శరీరంలో ఒంట్లోని కొవ్వును కరిగించడం కంటే కూడా ఆల్కహాల్ ను జీర్ణం చేసుకోవడంపైనే ఫోకస్ పెడుతుంది. దీని వల్ల ఒంట్లోని కేలరీలు తగ్గవు.
3. బీర్‌లో పైటోఈస్ట్రోజెన్లు ఉంటాయి:
బీర్ లో పైటోఈస్ట్రోజెన్లు ఎక్కువగా ఉంటాయి. ఇది స్త్రీ సెక్స్ హార్మోన్ అయిన ఈస్ట్రోజెన్ చర్యను అనుకరించే మొక్కల సమ్మేళనం. అయితే ఇది పురుషుల్లో బెల్లీ ఫ్యాట్ ను పెంచుతుంది.
బీర్ తాగడం వల్ల బెల్లీ ఫ్యాట్ నిజంగానే పెరుగుతుందా?
పొట్ట చుట్టూ ఉండే కొవ్వు ఆరోగ్యానికి అత్యంత ప్రమాదమని వైద్యులు చెబుతుంటారు. ఈ రకమైన ఫ్యాట్ ను వైద్య నిపుణులు విసెరల్ ఫ్యాట్ అని పిలుస్తారు. విసెరల్ ఫ్యాట్ జీవక్రియలో చురుకుగా ఉంటుంది. అంటే హార్మోన్ల విడుదల్లో జోక్యం చేసుకుంటుంది. శరీర పనితీరును మారుస్తుంది. మెటబాలికి సిండ్రోమ్, టైప్-2 డయాబెటిస్, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. సాధారణ బరువు ఉన్న వారు కూడా పెద్ద మొత్తంలో బెల్లీ ఫ్యాట్ కు గురయ్యే ప్రమాదాన్ని పెంచుతుంది. బీర్ తాగడం వల్ల బెల్లీ ఫ్యాట్ పెరిగే అవకాశాలు ఉన్నాయని పలు అధ్యయనాలు తేల్చాయి. అయితే ఇది పూర్తిగా వ్యక్తులను బట్టి మారవచ్చు. జీవన శైలి, బీర్లు ఎన్ని తాగుతున్నారు, తాగిన తర్వాత ఏం తింటున్నారు, రోజూ ఎంత సేపు వ్యాయామం చేస్తున్నారు అనే పలు కారణాలపై ఆధారపడి ఉంటుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications