Latest Updates
-
స్నేహితురాలికి ఆశ్రయం ఇస్తే.. బాయ్ ఫ్రెండ్ వింత ప్రవర్తన..ప్రియురాలి ఆవేదన! -
బయట బండి మీద దొరికే రుచితో ఇంట్లోనే భేల్ పూరీ.. ఒక్కసారి రుచి చూస్తే వదలరు! -
ఇడ్లీ, దోసెల్లోకి ఈసారి వంకాయ చట్నీ రుచి చూడండి..లెక్కపెట్టకుండా తినేస్తారు -
హైదరాబాద్ స్పెషల్ ఇరానీ ఛాయ్.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి! -
చపాతీ, పూరీ, పులావ్ లలోకి అదిరిపోయే మీల్ మేకర్ మసాలా గ్రేవీ.. నాన్ వెజ్ కూడా దీని ముందు దిగదుడుపే! -
ఒకే రకమైన మందులు.. వేర్వేరు ఫలితాలు..లివర్ డ్యామేజ్ వెనుక ఉన్న రహస్యం ఇదే! -
హ్యాపీ హోలీ 2026..మీ బంధుమిత్రులకు పంపడానికి బెస్ట్ హోలీ విషెస్, వాట్సాప్ స్టేటస్ లు ఇవే! -
ఈ హోలీకి అదిరిపోయే స్నాక్..అతిథులను మెప్పించే కరకరలాడే హెల్దీ రైస్ కుర్కురే..ఎలా చేసుకోవాలంటే.. -
హోలీ స్పెషల్..తాగేకొద్దీ తాగాలనిపించే చల్లని థాండాయ్..ఎలా చేసుకోవాలంటే.. -
వేసవి తాపాన్ని క్షణాల్లో తగ్గించే అద్భుతమైన సోంపు షర్బత్..ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!
రోజుకు 15 నిమిషాలు ఇలా చేస్తే చాలు..క్యాన్సర్ మీ దరిచేరదు!
టెక్నాలజీ ఎంతగా డెవలప్ అయినా, వైద్య రంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు వచ్చినప్పటికీ క్యాన్సర్ పేరు వింటే ఇప్పటీకీ వెన్నులో వణుకు పుడుతుంది. క్యాన్సర్ లో అనేక రకాలు ఉంటాయి. లంగ్ క్యాన్సర్ అని, బ్రెస్ట్ క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ అని ఇలా అనేక రకాలు క్యాన్సర్ లో ఉంటాయి.
అనేక రకాల క్యాన్సర్ లకు ట్రీట్మెంట్ అందుబాటులోకి వచ్చినప్పటికీ కొన్ని సందర్భాల్లో అవి సంక్లిష్టంగా మారుతున్నాయి. అందుకే పెద్దలు ఎప్పుడూ చెబుతుంటారు..వ్యాధి వచ్చిన తర్వాత బాధపడటం కంటే, రాకుండా చూసుకోవడమే ఉత్తమం అని. ముఖ్యంగా క్యాన్సర్ వంటి మహమ్మారి విషయంలో నివారణే అత్యుత్తమ మార్గమని ప్రముఖ క్యాన్సర్ నిపుణుడు డాక్టర్ తరంగ్ కృష్ణ స్పష్టం చేస్తున్నారు.

ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని అద్భుతమైన మెడిసిన్ ఒకటుందని..అదే సన్ లైట్(సూర్య కాంతి)అని డాక్టర్ తరంగ్ కృష్ణ తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసిన ఓ వీడియోలో చెప్పారు. ప్రకృతి మనకు ప్రసాదించిన అద్భుతమైన వరం సూర్యకాంతి.. ఇది కేవలం వెలుతురును మాత్రమే కాదు, ఆరోగ్యాన్ని కూడా ఇస్తుందని చెప్పారు.
సూర్యకాంతి క్యాన్సర్ ను ఎలా అడ్డుకుంటుంది?
విటమిన్ డి - ఒక రక్షక కవచం
సూర్యుని నుండి వచ్చే UVB కిరణాలు మన చర్మాన్ని తాకినప్పుడు మన శరీరం విటమిన్ Dని ఉత్పత్తి చేస్తుంది. ఇది మీ మొత్తం హార్మోనల్ రిథమ్ ని రీసెట్ చేస్తుందన్నారు. కణాల పెరుగుదలను నియంత్రించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. తగినంత విటమిన్ డి ఉంటే క్యాన్సర్ ముప్పు గణనీయంగా తగ్గుతుందని అనేక పరిశోధనలు రుజువు చేశాయి.
హార్వర్డ్ స్వీప్ అండ్ మూడ్ అధ్యయనం ప్రకారం..ఉదయం సూర్యకాంతిలో 15 నిమిషాలు గడపడం ద్వారా రెండు ముఖ్యమైన హార్మోన్లు సెరటోనిన్, మెలటోనిన్ బ్యాలెన్స్ అవుతాయన్నారు. 70శాతం వరకు మెరుగుపడతాయని చెప్పారు. ఇది మీ మూడ్, ఎనర్జీ, రోగనిరోధక ఆరోగ్యాన్ని అన్నింటినీ బలపరుస్తుందన్నారు.
విటమిన్ D లోపం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్, కొలోన్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువ ఉంటుందన్నారు. కాబట్టి ప్రతిరోజూ ఉదయం సూర్యకాంతిలో 15 నిమిషాలు నడవాలని, వీలైతే సూర్యకాంతిలో చెప్పులు లేకుండానే గడ్డిపై నడవడం మంచిదని డాక్టర్ తరంగ్ కృష్ణ సూచించారు.
క్యాన్సర్ కణాల ఆత్మహత్య
సూర్యకాంతి ద్వారా లభించే విటమిన్ డి, క్యాన్సర్ కణాల అనియంత్రిత పెరుగుదలను అడ్డుకుంటుంది. అంతేకాదు చెడు కణాలు తమను తాము నాశనం చేసుకునేలా (దీనిని సైన్స్ భాషలో అపోప్టోసిస్ అంటారు) ప్రేరేపిస్తుంది.
వాపును తగ్గిస్తుంది
శరీరంలో దీర్ఘకాలికంగా ఉండే వాపు క్యాన్సర్ కు దారితీసే ప్రమాదం ఉంది. సూర్యరశ్మి ఈ అంతర్గత మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా కొలొరెక్టల్, రొమ్ము, ప్రోస్టేట్ క్యాన్సర్ ల ప్రమాదాన్ని ఇది 30 శాతం నుండి 70 శాతం వరకు తగ్గిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
మరెన్నో ప్రయోజనాలు
సూర్యకాంతిని ఆస్వాదించడం వల్ల క్యాన్సర్ నివారణతో పాటు ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి
-హై బీపీ సమస్య అదుపులోకి వస్తుంది.
-ఒత్తిడి, ఆందోళన తగ్గి మనసు ప్రశాంతంగా మారుతుంది.
-విటమిన్ డి ఎముకల పటుత్వానికి అత్యవసరం.
-సహజ కాంతి మన నిద్రను నియంత్రించే మెలటోనిన్ హార్మోన్ ను ప్రభావితం చేసి, నిద్ర నాణ్యతను పెంచుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications











