Latest Updates
-
ఆన్లైన్లో విపరీతంగా ఆభరణాలు కొంటున్నారా.. 'మెరిసే' నగలతో మోయలేని ఆరోగ్య సమస్యలు.! -
మీ భాగస్వామి ఈ విషయాల్లో మీకు దూరంగా ఉంటున్నారా.. ఈ సంకేతాలతో చాలా డేంజర్.! -
ఆలూ పరోటాకి మించిన రుచితో ఉల్లి పరోటా.. బరువు తగ్గాలనుకునేవారికి బెస్ట్ డైట్ ఫుడ్ ! -
భోజనం చేసిన వెంటనే కడుపు నొప్పిగా ఉంటుందా.?.. ఈ వ్యాధులకు సంకేతం కావచ్చు.! -
ఆషాఢం బల్కంపేటలో వైభవం.. నేడు ఘనంగా ఎల్లమ్మ తల్లి కళ్యాణం.. ‘జలదుర్గ’ విశేషాలివే.! -
వక్ర గతిలోకి శని గ్రహం.. ఈ నెల 28 వరకు ఈ 3 రాశుల వారికి కష్టాలు తప్పవు.! -
అద్భుతమైన విందు భోజనం కావాలా? అయితే ఈ కోకనట్ మిల్క్ మటన్ పులావ్ ట్రై చేయాల్సిందే -
ప్రోటీన్ రిచ్ రాగి పనీర్ పరాఠా..షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో,బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..ఈజీగా చేసుకోండిల -
పని వేళలు కాదు.. పని పూర్తయ్యేవరకు ఉండాల్సిందే.. బ్యాంకు గేటుకు తాళం వేసిన మేనేజర్.. వైరల్ వీడియో.! -
స్నానం చేసేటప్పుడు మొదట ఏ భాగంపై నీళ్లు పోయాలి.?.. ఆయుర్వేదం ప్రకారం సరైన పద్ధతి ఏంటో తెలుసా.?
రాత్రిపూట లేటుగా తింటే క్యాన్సర్ గ్యారెంటీనా?..డాక్టర్ మంతెన చెప్పిన షాకింగ్ నిజాలు
ఇప్పడంటే అందరూ కరోనా వైరస్ ని మహమ్మారి అని పిలుస్తున్నారు కానీ గతంలో క్యాన్సర్ ని కూడా మహమ్మారి అని పిలిచేవాళ్లు. క్యాన్సర్ అనే పేరు వింటేనే గుండెళ్లో రైళ్లు పరుగెత్తేవి. క్యాన్సర్ వచ్చిందంటే మరణం ఖాయం అని వణికిపోయేటోళ్లు. అయితే గతంలో ఎక్కడో ఒకరికి క్యాన్సర్ వస్తుండేది.
ఇప్పుడు ఆధునిక జీవనశైలి,రకరకాల కారణాలతో బీపీ, షుగర్ వచ్చినట్లుగానే క్యాన్సర్ కూడా కామన్ గా వచ్చేస్తుంది. అయితే ఇప్పుడు అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చింది. క్యాన్సర్ కు ట్రీట్మెంట్ కూడా అందరికీ అందుబాటులో ఉంది. క్యాన్సర్ కేసులు మనదేశంలో పెరిగిపోవడానికి కారణం ఏంటంటే.. చాలామంది ఎరువులు, పురుగుమందులు వేసిన కూరగాయలు తినడం, పొల్యూషన్, కార్బైడ్ వేసిన పండ్లు, నీటి కాలుష్యం, సిగరెట్లు, ఆల్కహాల్ ఇలాంటివి చెబుతుంటారు.

వాస్తవానికి క్యాన్సర్ రావడానికి ఇవన్నీ కారకాలే అయినప్పటికీ ఇవన్నీ ప్రథమం కాదని ప్రకృతి వైద్య నిపుణులు డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు చెబుతున్నారు. అందరూ కామన్ గా చేసే కొన్ని చిన్న తప్పులే క్యాన్సర్ కేసుల పెరుగుదలకు కారణమని ఆయన తన యూట్యూబ్ ఛానెల్ లో పోస్ట్ చేసిన ఒక వీడియోలో చెప్పారు.
ఈ 5 చిన్న తప్పుల వల్లే ఎక్కువగా క్యాన్సర్
రాత్రిపూట చాలామంది 9 గంటలకో లేదా 10 గంటలో ఇలా లేటుగా భోజనం చేస్తుంటారు. క్యాన్సర్ రావడానికి ఇదొక అతిముఖ్యమైన కారణమని డాక్టర్ మంతెన తెలిపారు. రాత్రి లేటుగా తినడం వల్ల శరీరంలో రిపేర్, క్లీనింగ్ జరగదని..దీంతో కణకాలుష్యం పెరిగిపోయి ఆ కణాల్లో మంట పెరిగిపోతుందని దీంతో మంచి కణం కూడా క్యాన్సర్ కణంగా మారుతుందన్నారు. రాత్రిపూట తినడం అనేది మన శరీర ఆరోగ్యాన్ని మొత్తం మార్చేయడానికి అవకాశం కల్పిస్తుందన్నారు.క్యాన్సర్ వచ్చే అవకాశాలు బాగా పెరగడానికి ఇదే ప్రధాన కారణమని చెప్పారు.
-అసలు పోషకాలు లేని ఆహారాన్ని తినడం. పోషకాలు లేకుంటే లివర్ క్లీన్ జరగదు,శరీరం రక్షించబడదు. మంచి కణం క్యాన్సర్ కణంగా మారకూడదన్నా కొన్ని ఎంజైమ్స్, హార్మోన్స్ కావాలన్నారు. అవి ఇమ్యూనిటీలో ఉత్పత్తి అవ్వాలని, లివర్ లో ఉత్పత్తి అవ్వాలని..ఇవన్నీ పోషకాలు ఉంటే ఉత్పత్తి అవుతాయని చెప్పారు.
-నూనెలో నుంచి దేవినవి, ఒవెన్ లో ఎక్కువగా వేడిచేసిన ఆహారాలు, నెయ్యిలో నుంచి తీసినవి నిత్యం తినడం చాలామందికి ఒక అలవాటుగా మారిపోయిందని, ఇది క్యాన్సర్ రావడానికి కారణమని ఆయన తెలిపారు.

-కృత్రిమమైన కలర్స్, ఫ్లేవర్స్, ప్రిజర్వేటివ్స్ కలిపిన ప్యాకేజ్డ్ లేదా రెడమేడ్ ఫుడ్ ఎక్కువగా వాడటం ఇటీవల కాలంలో ఎక్కువైపోయిందని..క్యాన్సర్ రావడానికి ఇది ఎక్కువ కారకంగా ఉంటుందని చెప్పారు. అయితే చాలామంది విదేశాల్లో చాలామంది ప్యాకేజ్డ్ ఫుడ్ ని ఎక్కవుగా తింటుంటారు కదా..వారికెందుకు క్యాన్సర్ రాదు మనకే ఎందుకు వస్తుంది అని ఆలోచిస్తుంటారు.
వాస్తవానికి విదేశాల్లో క్యాన్సర్ కేసులు ఎక్కువగానే ఉన్నాయి. అయితే వాళ్లు ఇలాంటి బ్యాడ్ ఫుడ్ తో పాటు మంచి ఫుడ్ కూడా తింటారని, సలాడ్ప్, నట్స్, స్ప్రౌట్స్, ఫ్రూట్స్, గ్రీన్స్ లీఫ్స్, జ్యూస్ లు ఇలాంటివి ఎక్కువగా తీసుకుంటారని చెప్పారు. దీనవల్లే వాళ్లు కొంత రక్షించబడుతున్నారన్నారు.
-ఎక్కువగా నూనెలో వేపిన వేపుళ్లు, కూరలు వండుకునే విధానం(ఉప్పు, కారం, మసాలాలు బాగా ఎక్కువవడం)..క్యాన్సర్ రావడానికి కారణమవుతుందని తెలిపారు.
ఈ 5 కారణాల వల్లే క్యాన్సర్ కేసులు ఎక్కువవుతున్నాయని, చిన్న వయస్సులోనే క్యాన్సర్ రావడానికి ఇవి కారణమవుతున్నాయని, మంచి కణాలు కూడా క్యాన్సర్ కణాలుగా మారిపోతున్నాయని, కాబట్టి వీటి విషయాల్లో మార్పులు చేసుకుంటే క్యాన్సర్ రాదని,ఒకవేళ వచ్చినా తగ్గుతుందని డాక్టర్ మంతెన చెప్పారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications