Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
పాలు తాగుతున్నారా.. అయితే మీకు ఈ ప్రాబ్లమ్ ఉన్నట్లే!.. వెంటనే ఈ పని చేయకపోతే..!
ఈ మధ్య కాలంలో చాలా మందిని వేధిస్తున్న సమస్య కొలెస్ట్రాల్. దీని కారణంగా అధికంగా బరువు పెరగడంతో పాటు, గుండెపోటు వంటి సమస్యల బారిన కూడా పడుతున్నారు. అందుకే చాలా మంది ప్రజలు ఈరోజుల్లో ఏది తినాలి, ఏది తింటే మంచిది అని ఒకటికి రెండు సార్లు ఆలోచించి మరీ తింటున్నారు. ఆ జాబితాలో ఇప్పుడు పాలు కూడా చేరింది. పాలను తాగొచ్చా? తాగకూడదా అనే అనుమానం ప్రజల్లో కలిగింది.
అయితే పాలపై ఎందుకు ఈ అనుమానం, పాలు తాగితే ఎలాంటి సమస్యలు వస్తాయి, పాలు ఎలాంటి వ్యక్తులు తాగాలి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
పాలు తాగడం వల్ల కలిగే లాభాలు
ప్రతిరోజూ పాలు తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. అందుకే ప్రతిరోజూ ఒక గ్లాస్ పాలు తాగాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. పాలలో అనేక రకాల పోషక విలువలు ఉంటాయి. శరీరానికి కావాల్సిన ఖనిజాలు, విటమిన్స్ ఈ పాలోలో ఉంటాయి. అలాగే ఎముకలకు కావాల్సిన క్యాల్షియం కూడా ఇందులో సమృద్ధిగా లభిస్తుంది.

పాలు తాగడం వల్ల బరువు పెరుగుతారా?
పాలు తాగడం వల్ల బరువు పెరుగుతారనే అపోహ ప్రజల్లో ఉంది. అందుకే చాలా మంది పాలు తాగడం మానేస్తుంటారు. కొంతమంది పాలు తాగడం కూడా ఇష్టపడరు. ఎందుకంటే పాలలో పోషకాలతో పాటు క్యాలరీలు కూడా ఎక్కువగానే ఉంటుంది. దీని కారణంగా సులువుగా బరువు పెరుగుతారు. అలాగే పాలు తాగడం వల్ల ఆకలి కూడా పెరుగుతుంది. దీని ద్వారా క్యాలరీ ఇంటెక్ పెరిగి బరువు పెరిగేందుకు అవకాశం ఉంటుంది. అయితే కొన్ని టిప్స్ పాటించడం వల్ల పాలు తాగినా బరువు పెరిగరు. ఆ టిప్స్ ఏంటంటే..
పాలు తాగుతూ బరువు ఎలా తగ్గాలంటే..
పాలు తాగుతూ బరువు తగ్గాలంటే కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. అందులో ముఖ్యమైనది పాలు తాగే పరిమాణాన్ని తగ్గించాలి. ఎక్కువ మొత్తంలో పాలు తాగడం మానేయాలి. మన శరీరానికి తగ్గ పరిమాణంలోనే పాలు తాగాలి. అలాంటప్పుడే బరువు పెరగకుండా పాలలో ఉండే పోషకాలు మన శరీరానికి అందుతాయి.
పాలలో మీగడ ఎక్కువగా ఉంటే పాలు తాగేటప్పుడు దానిని తీసేసి తాగితే మంచిది. ఒక గ్లాసు కొవ్వు పాలలో 146 క్యాలరీలు, కొవ్వులేని పాలలో 86 క్యాలరీలు ఉంటాయి. కాబట్టి మీకు తగినట్టుగా మీకు కావాల్సిన విధంగా, మీ డైట్ ప్లాన్ ప్రకారం పాలను ఎంచుకొని తగిన పరిమాణంలో తాగితే మంచి ఫలితాలను పొందొచ్చు. పాల మీగడను తీసేయడం వల్ల బరువు పెరిగే సమస్యను కూడా నివారించొచ్చు.
ఎలాంటి పాలు మంచివి..
ప్రస్తుత కాలంలో ప్రతీదాన్ని కల్తీ సమస్య వెంటాడుతుంది. అందులో పాలు కూడా ఒకటి. పాలు ఎంచుకునేటప్పుడు మంచి పాలను ఎంచుకోవాలి. కల్తీలేని పాలను ఎంచుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. అలాగే కొవ్వు శాతం తక్కువగా ఉన్న పాలను తీసుకుంటే బరువు పెరిగేందుకు తక్కవ ఆస్కారం ఉంటుంది. స్వచ్ఛమైన పాలను నేరుగా రైతు వద్దే తీసుకోవడం వల్ల ఫలితాలు పొందొచ్చు.
గమనిక: ఈ కథనంలో పొందుపరిచిన అంశాలు పలు అధ్యయనాలు, ఇంటర్నెట్‌లో మాకు దొరికిన సమాచారం ఆధారంగా అందించబడింది. వీటిని పాటించే ముందు తప్పనిసరిగా నిపుణుల సలహాలు తీసుకుంటే మంచిది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications