Latest Updates
-
దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే!
ఫ్రెంచ్ ఫ్రైస్ తింటే ఒత్తిడి, ఆందోళన.. తాజాగా తేల్చిన స్టడీ
కరకరలాడే ఆహార పదార్థాలు తినడం చాలా మందికి ఇష్టమే. మంచి స్పైసీ గా ఉండి కరకరలాడుతూ ఉండే ఫ్రైస్ ను చాలా మంది ఇష్టంగా తింటారు. ముఖ్యంగా చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ లాంటి ఆహార పదార్థాలు అంటే చాలా మంది నోట్లో నీళ్లూరుతుంటాయి. మీరు కూడా నూనెలో బాగా వేయించిన వాటిని తెగ ఇష్టంగా తింటుంటే కాస్త ఆగి ఇది చదవండి.
ఫ్రెంచ్ ఫ్రైస్ తినే వారు నిరాశ, నిస్పృహలకు, ఒత్తిడికి, ఆందోళనకు గురవుతున్నట్లు తాజా అధ్యయనం ఒకటి పేర్కొంది. చైనాకు చెందిన పరిశోధకుల బృందం ఆ అధ్యయన ఫలితాన్ని వెల్లడించింది. ఈ స్టడీ రిపోర్టును అమెరికాకు చెందిన ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్ జర్నల్ లో ప్రచురించారు. ఈ అధ్యయనాన్ని 1,40,728 మందిపై 11 ఏళ్ల పాటు నిర్వహించినట్లు పరిశోధకులు తెలిపారు.

12 శాతం ఎక్కువ ఆందోళన:
ఫ్రెంచ్ ఫ్రైస్ తినని వారితో పోలిస్తే తినే వారు ఆందోళనకు గురయ్యే అవకాశం 12 శాతం ఎక్కువ. అలాగే నిరాశకు, నిస్పృహకు గురయ్యే అవకాశం 7 శాతం ఎక్కువగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు.
ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా ప్రభావితం చేస్తుందంటే..:
బంగాళదుంపలను వేయించినప్పుడు విడుదలయ్యే యాక్రిలామైడ్ అనే పదార్థం వల్లే ఒత్తిడి, ఆందోళన కలుగుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. యాక్రిలామైడ్ అనేది ఆహారాన్ని డీప్ ఫ్రై చేసినప్పుడు, అధిక ఉష్ణోగ్రతల వద్ద వండినప్పుడు విడుదల అయ్యే విష పదార్థం. బంగాళాదుంపల్లో స్టార్చ్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది యాక్రిలామైడ్ ను మరింతగా ఉత్పత్తి చేస్తుంది.
వేయించిన ఆహారాలతో మానసిక సమస్యలు:
వేయించిన ఆహారాలు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి. డీప్ ఫ్రై చేసిన ఆహారాలు వాపుకు కారణమవుతాయి. ఇది ఆందోళన, ఒత్తిడిని ప్రేరేపిస్తాయి. ఆహారాన్ని నూనెలో వేయించినప్పుడు అవి నీటిని కోల్పోయి కొవ్వును గ్రహిస్తాయి. అలా వాటి వల్ల వచ్చే కేలరీల సంఖ్య కూడా పెరుగుతుంది.
యాక్రిలామైడ్ దీర్ఖకాలికంగా గురికావడం వల్ల స్పింగోలిపిడ్, ఫాస్ఫోలిపిడ్ జీవక్రియను క్రమబద్ధీకరిస్తుంది. ఇది ఆందోళన, నిరాశను కలిగిస్తుంది. యాక్రిలామైడ్ లిపిడ్ పెరాక్సిడేషన్, ఆక్సీకరణ ఒత్తిడిని ప్రోత్సహిస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications