Latest Updates
-
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు! -
రోజు తినే పెరుగన్నమే కదా అని తీసిపారేయకండి.. ఇలా స్పెషల్ గా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే! -
హోటల్ స్టైల్ రాయల్ కొబ్బరి చట్నీ.. ఈ ఒక్క సీక్రెట్ పదార్థం కలిపితే రుచి అదుర్స్! -
బగారా రైస్, చపాతీ,రాగి సంగటిలోకి అదిరిపోయే మటన్ లెగ్ కర్రీ..రుచికి రుచి, బలానికి బలం! -
వంట మధ్యలో గ్యాస్ అయిపోతోందని టెన్షనా? మీ సిలిండర్లో ఎంత గ్యాస్ మిగిలి ఉందో చిటికెలో తెలుసుకోండిలా!
సైనసైటిస్ ఇబ్బంది పెడుతోందా? ఈ యోగాసనాలతో ఉపశమనం పొందచ్చు
సైనస్‌ల వాపు వల్ల వచ్చే సైనసైటిస్ చాలా మందిని తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది. దీని వల్ల నాసికా రంధ్రాలు మూసుకుపోతాయి. కనుబొమ్మల మధ్య నొప్పి, తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. సైనసైటిస్ ను తగ్గించడానికి మందులు, వైద్య చికిత్సలు తీసుకుంటారు చాలా మంది.
సైనసైటిస్ కు యోగా కూడా చాలా బాగా ప్రభావం చూపిస్తుంది. కొన్ని రకాల యోగ భంగిమలతో సైనసైటిస్ అదుపులో ఉంటుంది. యోగాసనాలు రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడతాయి. మంటను తగ్గిస్తాయి. సైనసైటిస్ తో బాధపడే వారు ఎలాంటి యోగసనాలు వేయాలి, ఏయే ఆసనాలు వేస్తే సైనసైటిస్ నుండి ఉపశమనం లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

నేటి పాట్‌తో క్లీన్ చేసుకోవడం:
నేటి పాట్ ఉపయోగించి మూసుకుపోయిన నాసికా రంధ్రాలను క్లీన్ చేయవచ్చు. నేటి పాట్ ఉపయోగించడం వల్ల నాసికా రంధ్రాలను క్లియర్ చేస్తుంది, చికాకు తొలగిస్తుంది, అలాగే సైనస్ లను తేమగా ఉంచడంలో సహాయపడుతుంది. గోరు వెచ్చని నీటిలో ఒక టీ స్పూన్ ఉప్పు వేసి కరిగిన తర్వాత నేటి పాట్ ఉపయోగించాలి.
తలను పక్కకు వంచి, నోటి ద్వారా ఊపిరి పీల్చుకుంటూ ఆ నీటిని నాసికా రంధ్రంలోకి పోయాలి. మరో నాసికా రంధ్రం గుండా ఆ నీరు బయటకు వస్తుంది. ఇలా రెండు నాసిగా రంధ్రాలకు చేయడం ద్వారా ముక్కు క్లియర్ అవుతుంది.
సేతు బంధాసన:
మోకాళ్లను వంచి, పాదాలను నేలపై చదునుగా ఉంచి వెనకభాగంపై పడుకోవాలి. తుంటి కింద దుప్పటి మడతపెట్టి ఉంచాలి. నెమ్మదిగా తుంటిని పైకెత్తాలి. ఈ భంగిమ ద్వారా సైనస్ లు క్లియర్ అవుతాయి. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.
ఉత్తనాసన:
పాదాలను నేలపై ఉంచి నిలబడాలి. ఊపిరి పీల్చుకుంటూ నడుము వంచుతూ కిందకు వంగాలి. శరీరాన్ని బిగుతుగా కాకుండా వదులుగా ఉండేలా చూసుకోవాలి. తల, మెడలను విశ్రాంతినిచ్చే భంగిమలో ఉండాలి. ఈ భంగిమ ద్వారా తలకు రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. సైనస్ ఒత్తిడిని తగ్గిస్తుంది. ఈ భంగిమలో ముక్కు ద్వారా శ్వాస తీసుకోవడానికి ప్రయత్నించాలి.
సలాంబ సిర్సాసన:
ఈ భంగిమలో తల నేలపై ఉంటాయి, కాళ్లు పైకి ఉంటాయి. దీనిని హెడ్ స్టాండ్ అని కూడా అంటారు. అలవాటు లేని వారు గోడను మద్దతుగా తీసుకుని ఈ సలాంబ సిర్సాసన భంగిమను సాధన చేయవచ్చు. ఈ ఆసనం ద్వారా తలకు రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. సైనస్ తగ్గించడంలో సహాయపడుతుంది.
బాలాసన:
మోకాళ్లను మడిచి కింద కూర్చోవాలి. ఆ తర్వాత శరీరాన్ని నేలకు సమాంతరంగా ఉండేలా పడుకోవాలి. రెండు చేతులను నేలకు సమాంతరంగా చాపాలి. ఈ భంగిమలో ముఖం నేలను చూస్తుంది. ఈ యోగాసనం ద్వారా సైనస్ ఒత్తిడి తగ్గుతుంది.
సైనసైటిస్ తీవ్రంగా ఇబ్బంది పెడుతుంటే వైద్యులను సంప్రదించాలని గుర్తుంచుకోండి. ఈ యోగాసనాలు సైనసైటిస్ సమస్యను తగ్గిస్తాయనడంలో ఎలాంటి అనుమానం లేదు. కానీ సమస్య తీవ్రంగా ఉంటే మాత్రం వైద్యులను సంప్రదించాలి. అలాగే ఏదైనా కొత్త వ్యాయామ దినచర్యను ప్రారంభించే ముందు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications











