Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
తిన్న వెంటనే మళ్లీ ఆకలేస్తుందా.. అయితే ఇదే కారణం అయ్యుండొచ్చు, జాగ్రత్త సుమీ!
కొంత మందికి ఎక్కువ ఆకలి వేస్తుంది. మరికొంత మందికి కాస్త తక్కువ ఆకలి ఉంటుంది. వారి వారి శరీర ఆకృతులను బట్టి ఆకలిలో, తినే ఆహారంలో మార్పులు ఉంటాయి. కానీ తిన్న వెంటనే మళ్లీ ఆకలి వేయడం, తరచుగా ఆకలి వేయడం జరుగుతుందంటే మాత్రం ఆలోచించాల్సిన విషయమే. మన శరీరంలో జరుగుతున్న మార్పులే రాబోయే సమస్యలకు సంకేతాలు. ఏమాత్రం తేడాగా అనిపించినా వెంటనే వైద్యులను కలవడం మంచిది. వారి సలహాలతో సమస్యలకు పరిష్కారం తెలుసుకోవాలి.

20 రకాల అమైనో ఆమ్లాలతో ప్రోటీన్ తయారు:
శరీరంలోని ప్రతీ కణానికి ప్రోటీన్ చాలా అవసరం. రోజువారీ కార్యకలాపాలు సజావుగా సాగాలంటే ప్రోటీన్ తప్పనిసరి. రోజూ శారీరక శ్రమ చేసే ఆరోగ్యవంతమైన మనిషికి రోజుకు కనీసం 0.8 గ్రాముల ప్రోటీన్/ కిలో శరీర బరువు ఉండాలి. ప్రోటీన్ 20 రకాల అమైనో ఆమ్లాలతో తయారవుతుంది. వాటిలో 9 అమైనో ఆమ్లాలను ఆహారం ద్వారానే పొందుతారు. శరీరానికి తగినంత ప్రోటీన్ అందకపోతే అనేక సమస్యలు వచ్చి పడతాయి. ముఖ్యంగా రోగాలు, ఎలాంటి పనులు చేసుకోలేకేపోవడం వంటివి జరుగుతుంటాయి.
ప్రోటీన్ లోపం వల్లే అతి ఆకలి..!
తగినంత ప్రోటీన్ తీసుకోకపోవడం వల్ల నిరంతరం ఆకలిగా అనిపిస్తుంది. ఎక్కువగా తినేలా చేస్తుంది. ఆకలిని అణుచుకునేందుకు జంక్ ఫుడ్ మీద పడిపోతారు. ఫలితంగా బరువు పెరగడం, ఊబకాయం, అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. కావాల్సినంత ప్రోటీన్ అందితే పొట్ట నిండుగా అనిపిస్తుంది. ఆకలిని అదుపులోక ఉంచుకోవచ్చు. అంతే కాదండోయ్.. శరీర భాగాల్లో వాపు కనిపిస్తుంది. దీన్ని వైద్య పరిభాషలో ఎడెమా అంటారు. తీవ్రమైన ప్రోటీన్ లోపానికి ఇదో సంకేతం.
ప్రోటీన్ లోపంతో విపరీతమైన సమస్యలు:
ఎముక కణాల నిర్మాణాన్ని తయారు చేయడం కోసం ప్రోటీన్ సహాయపడుతుంది. ప్రోటీన్ లోపిస్తే ఎముకలు బలహీనపడిపోతాయి. పుగుళ్లు ప్రమాదాన్ని పెంచుతాయి. చిన్న గాయాలు అయినా ఎముకలు విరిగిపోవడం ఖాయం. శరీరానికి సరిపడా ప్రోటీన్ అందకపోతే రోగనిరోధక వ్యవస్థ తగ్గిపోతుంది. అప్పుడు త్వరగా రోగాల బారిన పడతారు. వర్షాకాలంలో రోగాలను ఎదుర్కోవాలంటే తప్పకుండా ప్రోటీన్ పుష్కలంగా లభించే ఆహారాలు తీసుకోవాలి. ఆరోగ్యకరమైన జుట్టు, చర్మం, గోళ్లకి ప్రోటీన్ చాలా అవసరం. జుట్టు పలచబడిపోతుంది.
ఆహారంలో ప్రోటీన్ లేకపోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు త్వరగా పెరగడానికి దారి తీస్తుంది. వెంటనే తగ్గిపోతుంది. షుగర్ లెవెల్స్ హెచ్చు తగ్గుల కారణంగా చక్కరె తినాలనే కోరిక మరింత పెరుగుతుంది. దీని వల్ల అనేక సమస్యలు వస్తాయి. అలాగే ప్రోటీన్ లోపం ప్రారంభ సంకేతాలలో ముందుగా కనిపించేది అలసట, బలహీనత. శరీరం పప్పు లేదా చికెన్ తినాలని ఆశ పడుతూ ఉంటుంది. ఇది కూడా ప్రోటీన్ లోపానికి మరో సంకేతం కావచ్చు.
ప్రోటీన్ సరిగ్గా అందాలంటే ఏం తినాలి?
ప్రోటీన్ శరీరానికి సరిపోయేంతగా తినాలంటే పాల ఉత్పత్తులు, మాంసం, గుడ్లు, చికెన్, పెరుగు, చేపలు, గుమ్మడి కాయ గింజలు, కాయ ధాన్యాలు వంటివి తినాలి. వీటిని తీసుకోవడం వల్ల ప్రోటీన్ పుష్కలంగా లభిస్తుంది. శాఖాహారులు అయితే తృణధాన్యాలు తీసుకోవడం మంచిది. చిక్కుడు గింజల్లో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. అలాగే అవిసె గింజలు, సోయా బీన్స్, ఓట్స్, పచ్చి బఠానీ, వేరు శెనగలో ప్రోటీన్ ఉంటుంది.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications