Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
పోషకాల పుట్ట..బరువు తగ్గాలన్నా,చెడు కొలెస్ట్రాల్ సమస్యకు పరిష్కారం ఇందులో
శరీరానికి అవసరమైన విటమిన్లు, ప్రోటీన్లు, ఖనిజాల లోపాన్ని భర్తీ చేయడానికి ప్రెష్ ఫ్రూట్స్,ఆకుకూరలు తినాలని పోషకాహార నిపుణులు అంటున్నారు. సీజనల్ కూరగాయలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఎన్నో సమస్యలను తగ్గించడంలో ఆకు కూరలు చక్కగా సహాయపడతాయి. ఆకు కూరల్లో మెంతికూర ఒకటి. మెంతి కూరను పోషకాలు పుట్ట అంటారు. మెంతి కూరను రెగ్యులర్ గా మన ఆహారంలో భాగం చేసుకోగలిగితే బరువు తగ్గడమే కాదు, వేలాది సమస్యలు కూడా పరిష్కారమవుతాయి.
మెంతికూర తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే
-మెంతికూరలో ఉండే సపోనిన్ కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అంతేకాకుండా అధిక రక్తపోటు సమస్యను తగ్గించడానికి మీరు మెంతికూర తినవచ్చు. . దీనిలో ఉండే యాంటీ వైరల్ లక్షణాలు అనేక నొప్పులు, వాపులకు బాగా పనిచేస్తాయి.

-మెంతి ఆకులలోని ఐరన్, విటమిన్లు రక్తహీనత సమస్యను దూరం చేస్తాయి. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) ప్రకారం ప్రతిరోజూ 25 గ్రాముల నుండి 100 గ్రాముల మెంతులు తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర నియంత్రణలో ఉంటుంది.
-మెంతికూరలో ఫోలిక్ యాసిడ్, రైబోఫ్లావిన్, పొటాషియం, కాల్షియం, ఐరన్, మాంగనీస్ గుణాలు ఉన్నాయి. విటమిన్ ఎ, బి6, సి, కె కూడా ఉన్నాయి. ఫలితంగా మెంతికూర తినడం వల్ల ఎముకలు దృఢంగా తయారవుతాయి, శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
-డయాబెటిస్ తో బాధ పడే వారు కూడా మెంతికూరను తినవచ్చు.షుగర్ వ్యాధిని కంట్రోల్ చేయడం మెంతి కూర దివ్యౌషధంగా పని చేస్తుంది. రక్తంలో గ్లూకోజ్ లెవల్స్ పెరగకుండా నియంత్రిస్తుంది.
-ICMR ప్రకారం మెంతికూరలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది,కాబట్టి మెంతికూర తినడం వల్ల బరువు అదుపులో ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలు కూడా అదుపులో ఉంటాయి.
-మెంతికూర చర్మం, జుట్టుకు పోషణను అందిస్తాయి. మెంతికూర తినడం వల్ల శరీరంలో మంట కూడా తగ్గుతుంది.
-మెంతికూర లైంగిక సమర్థతను కూడా గణనీయంగా మెరుగుపరుస్తుంది. మలబద్ధకం, పేగు సంబంధిత ఆరోగ్య సమస్యలు, మూత్రపిండాల వ్యాధి, కాలిన గాయాలు, వంధ్యత్వం ఇతర అనారోగ్య సమస్యలకు మెంతికూర బాగా పనిచేస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications