Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
సమ్మర్ లో ఈజీగా బరువు తగ్గడానికి జస్ట్ ఇలా చేస్తే సరిపోతుందట..సన్నగా నాజూగ్గా అయిపోతారు!
ప్రస్తుతం మారిన జీవనశైలి, ఆహార అలవాట్ల కారణంగా చాలామంది బరువు పెరిగే సమస్యలతో బాధపడుతున్నారు. బరువు పెరగడం కారణంగా అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే బరువు తగ్గడానికి డైటింగం, వ్యాయమం వంటి దినచర్యలను అనుసరిస్తున్నారు కొంతమంది. అయితే బరువు పెరగడం ఈజీనే కానీ తగ్గడం అంత తేలిక కాదు. ఒక్కసారి బరువు పెరిగారు అంటే దాన్ని తగ్గించాలంటే చాలానే శ్రమించాలి. అనేక కఠిన నియమాలను ఫాలో అవుతూ ఉండాలి. అధిక బరువు కారణంగా కొంతమంది సమాజంలో అవమానాలకు కూడా గురవుతున్నారు. కొందరికి అయితే బరువు కారణంగా పెళ్లిళ్లు అవడం కూడా కష్టంగా ఉంది.
ప్రస్తుతం సమ్మర్ సీజన్ వచ్చేసింది. వేసవి కాలంలో బరువు తగ్గడం కొంచెం సులభం అవుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం వేసవి కాలంలో మీ అధిక బరువును తగ్గించుకోవడానికి సరైన పద్ధతిని అనుసరించడం ముఖ్యం. ఈ సమయంలో శరీరాన్ని వీలైనంత హైడ్రేటెడ్ గా ఉంచాలని నిపుణులు తెలిపారు. మీరు తక్కువ నీరు తాగుతుంటే నెమ్మదిగా తగినంత నీరు త్రాగడం ప్రారంభించాలని సూచించారు. వేసవి కాలంలో ఎక్కువ నూనె పదార్థాలు తినకుండా ఉండాలని సూచించారు.

బరువు తగ్గడానికి ప్రయత్నించేటప్పుడు విటమిన్లు, ఖనిజాలు కలిగిన ఆహారాన్ని తినాలని తెలిపారు. సులభంగా జీర్ణమయ్యే ఆహారాలు బరువు తగ్గడానికి చాలా సహాయపడతాయి. వేసవి కాలంలో దోసకాయలు, టమోటాలు, పుచ్చకాయ వంటి హైడ్రేటింగ్ ఆహారాలను చేర్చాలని చెప్పారు. గ్రీన్ టీలోని యాంటీఆక్సిడెంట్లు బరువు తగ్గడానికి సహాయపడతాయి. జీవక్రియను వేగవంతం చేయడమే కాకుండా శరీరం నుండి అదనపు కొవ్వును కాల్చడంలో కూడా ఇది సహాయపడుతుంది. ముఖ్యంగా ఉదయం పూట రెండు నుండి మూడు కప్పుల గ్రీన్ టీ తాగడం అలవాటు చేసుకోవడం మంచిదని నిపుణులు తెలిపారు. గ్రీన్ టీతో పాటు, మీరు హెర్బల్ టీ కూడా తాగవచ్చుని సూచించారు.
వేసవి కాలంలో మీ ఆహారంలో ఫైబర్, ప్రోబయోటిక్స్ చేర్చుకోండి. మీరు ప్రతిరోజూ పెరుగు, పండ్లు, సలాడ్లు, తృణధాన్యాలు తినాలని నిపుణులు సూచిస్తున్నారు. ఫైబర్ ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంచుతుంది దీంతో అతిగా తినకుండా మిమ్మల్ని నిరోధిస్తుంది. ప్రోబయోటిక్స్ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి, శరీర జీవక్రియను పెంచుతాయి, ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
అంతేకాకేుండా ప్రతిరోజూ క్రమంతప్పకుండా ఎక్సర్ సైజ్ లేదా వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మీరు ఉదయం లేదా సాయంత్రం సమయాల్లో వ్యాయామం చేయవచ్చు. మీరు వ్యాయామం చేయలేకపోతే కనీసం అరగంట పాటు వాకింగ్ అయినా చేయాలని తెలిపారు. నడకతో కేలరీలను బర్న్ అవుతాయని, కండరాలను బలపరుస్తుందని నిపుణులు తెలిపారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications