Latest Updates
-
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే!
2025 weight loss goals: 2025లో జిమ్‌కు వెళ్లాలని అనుకునేవారికి అలర్ట్.. కండలు రావాలంటే ఇలా చేయండి!
కొత్త సంవత్సరం వచ్చేస్తోంది. ఇంకో పది రోజుల్లో కొత్త ఏడాది మొదలైపోతుంది. అయితే సాధారణంగా చాలా మంది కొత్త ఏడాది జిమ్‌కు వెళ్లాలని, బరువు తగ్గిపోవాలని, కండలు పెంచుకోవాలని అనుకుంటూ ఉంటారు. కాకపోతే అది చాలా మందికి కుదరదు. ఎవరైతే కొంతమంది సీరియస్‌గా జిమ్‌కు వెళ్లి బరువు తగ్గాలని అనుకుంటారో ఆ వ్యక్తులు ఈ టిప్స్ పాటిస్తే కచ్చితంగా మంచి రిజల్ట్స్ పొందుతారు. అవేంటో ఈ స్టోరీలో డిస్కస్ చేద్దాం.
బరువును తగ్గించుకోవడానికి లక్ష్యాలు ఏమిటి
ఇంటి భోజనం
2025 సీరియస్‌గా బరువు తగ్గాలని అనుకుంటారో ఆ వ్యక్తులు బయటి భోజనాన్ని వదులుకోవాలి. ప్రతిరోజూ ఇంటి భోజనమే తినాలి. ఒకవేళ లంచ్‌కు ఇంటి భోజనం తీసుకెళ్లడం కష్టంగా ఉంటే.. సలాడ్స్, మిల్లెట్స్, ప్రోటీన్ నిండిన ఆహారాన్ని తీసుకోవాలి. కేవలం అన్నం మాత్రమే తినే వ్యక్తులు తమ డైట్‌లో కూరగాయలను, పప్పును జత చేసుకోవాలి. బయట దొరికే ప్యాక్ చేసిన ఆహారాన్ని తీసుకోకూడదు.

సమయానికి తినాలి
మంచి ఆహరం తీసుకోవడం ఎంత ముఖ్యమో.. సమయానికి ఆ భోజనాన్ని తీసుకోవాలి. మీరు ప్రతిరోజూ లంచ్ వంటిగంటకు తింటే ప్రతిరోజూ వంటి గంటకే లంచ్ ముగించేయాలి. సాయంత్రం కూడా అలానే ఫాలో అవ్వాలి. ప్రతిరోజూ సాయంత్రం 7 లేదా 8 గంటల లోపు పూర్తి చేసేయాలి. నిద్రపోవడానికి రెండు గంటల ముందే ఆహరం తీసుకోవాలి.
పోషకాలు ముఖ్యం
ఏ భోజనం తీసుకున్నా ఎలాంటి ఆహరం తీసుకున్న అందులో పోషకాలు పుష్కలంగా ఉండే విధంగా చూసుకోవాలి. సమయానికి తినే ఆహరంలో ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, హెల్తీ ఫ్యాట్స్ కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి. సలాడ్ ఉంటే కూడా ఆ సలాడ్‌ను డైట్‌లో జత చేసుకోవాలి. ఆహరం తినే సమయంలో ఎలాంటి గ్యాడ్జెట్స్ వినియోగించకూడదు. ఇలా చేయడం వల్ల జీర్ణక్రియ అనేది ఇబ్బందిగా, సమస్యాత్మకంగా మారుతుంది.
ఈ టిప్స్ పాటించాలి..
2025లో బరువు తగ్గాలనుకునే వ్యక్తులు కచ్చితంగా ఈ చిన్న చిన్న టిప్స్ పాటించాలి. ప్రతిరోజూ రెండు లేదా మూడు లీటర్ల నీటిని కచ్చితంగా తాగాలి. మీ బరువుకు తగ్గుట్టుగా, బరువు తగ్గేందుకు వీలుగా ఉండే విధంగా క్యాలరీలను తీసుకోవాలి. అలాగే ప్రతిరోజూ 30 నుంచి 40 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. సింపుల్ వర్క్ అవుట్ చేయడంతో పాటు కొన్ని కొన్ని హెవీ వర్క్ ఔట్స్ కూడా చేస్తుండాలి. అలాగే ఒత్తిడిని తగ్గించుకోవాలి. ఒత్తిడి తగ్గించుకుంటేనే బరువు తగ్గగలరు.
ఈ ఫుడ్స్ తినాలి
బరువు తగ్గాలనుకునే వ్యక్తులు కచ్చితంగా కొన్ని ఆహారాలను తీసుకోవడం మానేయాలి. చిప్స్, బిస్కెట్లు, ఫాస్ట్ ఫుడ్, చెడు కొవ్వు ఉండే పదార్థాలు, షుగర్ ఉండే ఆహార పదార్థాలను తీసుకోకూడదు. ఇవి తీసుకోవడం వల్ల ఎంత డైట్ చేసినా, బరువు తగ్గలేరు. అలాగే మీరు లక్ష్యాలను చేరుకోలేరు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications